నేల ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
చి Bot: Automated text replacement (-ఆంధ్రప్రదేశ్{{ZWNJ}}, +ఆంధ్రప్రదేశ్,)
పంక్తి 24:
 
==ఔషధ గుణాలు==
ఈమొక్క మొత్తం ఉపయోగపడే ఔషధగుణాలు కలిగివుండటం విశేషం. అనేక రుగ్మతలకి, వ్యాధులకీ ఇది విస్తృతంగా వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. మనుషుల్లో హెపటైటిస్‌-బి వైరస్‌ని అరికట్టడానికి ఈ ఔషధం ఉపయోగిస్తారు. బాక్టీరియా, ఫంగస్‌ల్ని కూడా అరికడుతుంది. అంతేకాక లివర్‌కి రక్షణగా, అతిసార వ్యాధిని నివారించడంలో, కాన్సర్‌, గర్భనిరోధక ఔషధంగా ఈ మొక్క వినియోగపడుతుంది. బ్రెజిల్‌, పెరూల్లో కిడ్నీలో రాళ్ళ నివారణకి ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తారు. నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టునుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు. చలువకి, దాహార్తిని తీర్చడానికి, [[బ్రాంకైటీస్‌]]కి, కుష్టువ్యాధికి, మూత్ర సంబంధ వ్యాధులకి, ఉబ్బసానికి, తయారు చేసే మందుల్లో నేలఉసిరిని ఎక్కువగా వాడతారు. అంతేకాక యునానీ వైద్యపరంగా కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అల్సర్స్‌కి, దెబ్బలకి, తామర, గజ్జి నివారణకి వాడే యునానీ మందుల తయారీలో దీనిని వాడతారు. పచ్చకామెర్ల వ్యాధికి తాజాగా తీసిన దీని వేరు అత్యంత దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మ సంబంధ వ్యాధులకి దీని ఆకులు నూరి కాస్త ఉపð కలిపి గాయాలకీ, దెబ్బలకీ, ఇతర చర్మం మీద ఏర్పడే మచ్చలకీ రాస్తే తక్షణ నివారణ ఉంటుంది. పాముకాటుకి విరుగుడుగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. [[లివర్‌]] వ్యాధులకి తయారుచేసే మందులలో, చివరికి లివ్‌-52లో కూడా దీనిని వినియోగిస్తారు. ఎడారి ప్రాంతవాసులు నేల ఉసిరి వేర్లు, భద్రమిశ్రగంధితో కలిపి ఒంటెలకి అరుగుదల పెరగడానికి ఔషధంగా వాడతారు. నేల ఉసిరి పేస్టును మజ్జిగతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఇక ఇందులో ఉండే రసాయనాల్ని లిగ్నన్స్‌ (ఫిలంథిన్‌, హైపోఫిలంథిన్‌) ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇందులో ఉండే ఇతర పదార్థాలు ఆల్కాలాయిడ్స్‌, సెక్యూరినైన్‌, నార్‌-సెకూరినైన్‌, ఫిల్లంథిన్‌, ఆలో-సెక్యూరినాల్‌(వేర్లు), ఎంట్‌, నార్‌ సెకూరిన్‌ (మొత్తం మొక్క) లిగ్నన్స్‌, నిర్‌టెట్రాలిన్‌, డైబెంజైన్‌ బుట్రైల్‌ లాక్టోన్‌ (ఆకులు), గ్లైకోసైడ్‌- నిరునిన్‌ (మొక్క పైభాగం), నిరూరిసైడ్‌ (ఆకు), టానిన్స్‌-అమరిన్‌, ఫిలంథుసిన్‌ డి, అమరానిక యాసిడ్‌, రిఫండ్‌సినిక యాసిడ్‌, జెరనినిక యాసిడ్‌లు లభ్యమవుతాయి. అంత విలువలు ఉండబట్టే వ్యవసాయ రీతిలో [[ఉత్తరప్రదేశ్‌]], [[హర్యానా]], [[పంజాబ్‌]], [[మహారాష్ట్ర]], [[తమిళనాడు]], [[కేరళ]], [[ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}, [[కర్ణాటక]], [[బీహార్‌]], [[ఒడిషా]], [[బెంగాల్‌]]ల్లో ఎక్కువగా పెంచుతున్నారు. - వి. సౌమ్య (Andharaprabha sunday magazine)
 
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/నేల_ఉసిరి" నుండి వెలికితీశారు