రాజబాబు: కూర్పుల మధ్య తేడాలు

లింకులు సరిచేశాను
పంక్తి 2:
 
[[తెలుగు సినిమా]] రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన '''రాజబాబు''' "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.
==పుట్టు పూర్వోత్తరాలు==
[[అక్టోబరు 20]], [[1938]] తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో[[నర్సాపురం]]లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు '''పుణ్యమూర్తుల అప్పలరాజు'''. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు మరియు శ్రీమతి రవణమ్మ. [[నిడుదవోలునిడదవోలు]]లోని పాఠశాల చదువు చదువుతూనే [[బుర్రకథ]] నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయులుగా కొద్దికాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకలల్లో పాలుపంచుకొనే వారు. రాజబాబు డిసెంబర్ 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు గారిని వివాహమాడారు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.
 
==సినీ జీవితం==
పంక్తి 9:
ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన [[గరికపాటి రాజారావు]]గారు ([[పుట్టిల్ల్లు]] సినిమా దర్శకులు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచారు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నారు. పూట గడవడానికి హాస్యనటుడు [[అడ్డాల నారాయణరావు]] పిల్లలకు ప్రైవేటు చెప్పేవారు. కొన్నాళ్ళ తరువాత [[అడ్డాల నారాయణరావు]]గారే రాజబాబుకి [[సమాజం]] సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత "తండ్రులు-కొడుకులు","కులగోత్రాలు","స్వర్ణగౌరి","మంచి మనిషి" మొదలగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు. మొదటి సినిమా విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న సినిమా పాత్రలలో నటిస్తూనే "కుక్కపిల్ల దొరికిందా", "నాలుగిళ్ళ చావిడి", "అల్లూరి సీతారామరాజు" మొదలగు నాటకాలు వేశారు.
===పేరు తెచ్చిన సినిమాలు===
జగపతి ఫిలింస్ వీ.బీ.రాజేంద్రప్రసాద్ సినిమా "[[అంతస్తులు]]" చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందారు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు సినర్మించిన ఎన్నో ప్రముఖ సినిమాలలో నటించారు. ఆ సమయంలో [[ఆకాశరామన్న]], [[సతీ శబరి]], [[ప్రచండ భైరవి]], [[సత్యహరిశ్చంద్ర]], [[సంగీత లక్ష్మి]], [[పరమానందయ్య శిష్యుల కథ]], [[ఉమ్మడి కుటుంబం]], [[విచిత్ర కుటుంబం]] లాంటి చిత్రాలలో నటించారు. రాజబాబుకు జంటగా [[లీలా రాణి]], [[మీనా కుమారి]], [[ప్రసన్న రాణి]], [[గీతాంజలి]] లాంటి వారు నటించినా, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం [[రమాప్రభ]] గారే. [[ఇద్దరు అమ్మాయిలు]], [[ప్రేమ్ నగర్ప్రేమనగర్]], [[ఇల్లు ఇల్లాలు]], [[పల్లెటూరి బావ]], [[సెక్రెటరి]], [[జీవన జ్యోతి]], [[కార్తీక దీపం]], [[అడవి రాముడు]], [[సోగ్గాడు]] లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడికి మంచి హాస్య జంటగా ప్రేరు తెచ్చాయి.
 
===ఇతర పాత్రలు===
పంక్తి 23:
 
==వనరులు==
*[ [http://www.Telugucinema.com www.Telugucinema.comలో రాజబాబు గురించి వ్రాసిన వ్యాసం]]
==బయటి లింకులు==
* [http://rajbabu.crosscity.com:8002/Default.aspx రాజబాబు విశేషాలు తెలిపే అధికారిక సైటు]
 
[[వర్గం:1938 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజబాబు" నుండి వెలికితీశారు