ఆర్.పిచ్మణి అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
సినిమా దర్శకుడు [[కె.సుబ్రమణ్యం]] ఇతడిని తన సినిమాపాటలలో వీణ వాయించడానికి మద్రాసుకు తీసుకువచ్చాడు. ఇతడు 1941లో జుపిటర్ స్టూడియోలో వీణ కళాకారుడిగా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో ఇతడు ఎందరికో వీణలో పాఠాలు చెప్పాడు. వారిలో ఎ.వి.ఎం. స్టూడియో అధినేత ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి భార్య రాజేశ్వరి కూడా ఉంది. ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి ఇతడి ప్రతిభను గుర్తించి తన స్టూడియోలో పర్మనెంటు ఉద్యోగం ఇచ్చాడు. తరువాత ఇతడు ఎ.వి.ఎం. నిర్మించిన అనేక సినిమాల పాటలలో వీణావాదనను చేశాడు.
 
ఇతడు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఏ గ్రేడు ఆర్టిస్టుగా అనేక జాతీయ కార్యక్రమాలలో, సంగీత సమ్మేళనాలలో పాల్గొన్నాడు.
 
==పురస్కారాలు, గుర్తింపులు==
* 1970లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడికి [[కళైమామణి]] పురస్కారాన్ని ప్రదానం చేసింది.
"https://te.wikipedia.org/wiki/ఆర్.పిచ్మణి_అయ్యర్" నుండి వెలికితీశారు