తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
చి చిన్న సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 93:
తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. రాష్ట్రంలో 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి
 
చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన [[అశ్మక జనపదం]] విలసిల్లిన ప్రాంతమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణ కర్త [[గోన బుద్ధారెడ్డి]]{{ఆధారం}} , సహజకవి [[బమ్మెర పోతన]], దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు [[రుద్రమదేవి]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహారావు]] ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు.
 
మహబూబ్‌నగర్ జిల్లా [[ఆలంపూర్]]లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీ స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, [[భద్రాచలం]]లో శ్రీ సీతారామాలయం, [[బాసర]]లో జ్ఞానసరస్వతీ దేవాలయం, [[యాదగిరిగుట్ట|యాదగిరి గుట్టలో]] శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, [[వేములవాడ]]లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ముఖ్య పర్యాటక ప్రాంతాలు.<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358</ref>
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు