గంగారాం ఆర్య: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''గంగారాం ఆర్య''' (Gangaram Arya) [[మహబూబ్ నగర్ జిల్లా]] పాలుమాకులలో 1922లో ఒక సాధారణ [[కుటుంబం]]లో జన్మించాడు. మొదటి నుంచి ఇతనికి [[ఆర్యసమాజం]]తో అనుబంధం ఉంది. అక్కడే తెలుగు, హిందీ భాషలలో ప్రావీణ్యం సాధించాడు. [[హైదరాబాదు]]లో హిందువులపై ముస్లింపాలకులు, రజాకార్లు చేస్తున్న దుండగాలు, దుర్మాగాలు, అత్యాచారాలు చూసి చలించిపోయాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ, 2006, పేజీ 243</ref> [[నారాయణరావు పవార్]], [[జగదీశ్ ఆర్య]] లతో కలిసి పోరాటం కొనసాగించారు. వీరు ముగ్గురు హైదరాబాదు స్వాతంత్ర్య పోరాట [[త్రిమూర్తులు]]గా కీర్తిగడించారు. పవార్, జగదీస్, గంగారాం ముగ్గురు కలిసి నిజాం మీద బాంబులు విసరాలని పథకం రూపొందించారు. 1947 డిసెంబరు 4న సాయంత్రం కింగ్‌కోఠి ప్రాంతంలో ఆల్‌సెయింట్స్ స్కూలు మలుపులో కారులో ప్రయాణిస్తున్న నిజాంపై నారాయణరావు పవార్ బాంబు విసిరి చంపే ప్రయత్నం చేశాడు. బాంబు విసరడం సఫలమైనా గురి తప్పడంతో నిజాం ప్రాణాలు కోల్పోలేడు. గంగారాం ఆర్యకు పట్టుకొని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసు కస్టడీకి, తదుపరి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇతనికి యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. ఆ తర్వాత పోలీసు చర్య జరగడంతో భారత ప్రభుత్వం నిజాం కాలంలో అరెస్టు అయి జైళ్ళలో ఉన్నవారందరినీ విడుదల చేసింది. 1949లో గంగారాం కూడా విడుదలైనాడు. జైలు నుంచి వచ్చిన పిదప ఘనంగా సత్కరించబడ్డాడు.
 
== మూలాలు Gangaram arya an Indian independence activist and member of Arya Samaj. He became popular after plotting to kill the Last Nizam of Hyderabad, Mir Osman Ali Khan. Wikipedia ==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/గంగారాం_ఆర్య" నుండి వెలికితీశారు