టంగుటూరి సూర్యకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
==గాయనిగా==
[[దస్త్రం:Mudamuga - CHANDRAHASA 1941 - SURYAKUMARI.ogg|thumb|చంద్రహాస (1941) సినిమాలో టంగుటూరి సూర్యకుమారి పాడిన ముదముగ పాట]]
ప్రముఖ సంగీత విద్వాంసులు అరియకూడి రామానుజ అయ్యంగార్ వద్ద సంగీతం అభ్యసించారు.
నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేది. ఆంధ్రలోని చాలా ఊళ్ళలో లలిత సంగీత కచ్చేరీలు చేసింది. పేరు ప్రతిస్టలు, ప్రజాదరణ ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ప్రత్యేక కృషి చెయ్యాలన్న తపన, మూడు నాలుగేళ్ళపాటు కరతాళ ధ్వనులకు, ప్రశంసలకు దూరంగా ఉండి, చదువుమీద దృష్టి కేంద్రీకరించి, ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి, ప్రథమశ్రేణిలో పాసైంది.<ref>స్వాతి డిశంబరు 2008 మాసపత్రికలో పాతకెరటాలు శీర్షిక లో శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గురించి శ్రీమతి [[మాలతి చందూర్]] పరిచయ వ్యాసం</ref>
 
Line 50 ⟶ 51:
 
తెలుగు, తమిళము, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో ''[[మా తెలుగు తల్లికి మల్లెపూదండ|మా తెనుగు తల్లికి మల్లెపూదండ]]'', ''దేశమును ప్రేమించుమన్నా'' మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించాడు. శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితో పాటు'స్వప్నజగతిలో ఛాయావీణ' మొదలైన లలిత గీతాలు, [[అడవి బాపిరాజు]] గారి 'ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ', 'రావోయి చిన్నవాడా' మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. [[హెచ్.ఎం.వి.]] తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ప్రముఖ గాయనిగా పేరుతెచ్చుకుంది.
== మరి కొన్ని విషయాలు==
1937 లో తన పదమూడవఏట "విప్రనారాయణ"(తమిళం)చిత్రం ద్వారా సినిమా రంగానికి పరిచయం చేయబడ్డారు. ఈమె 1944 లో "గీతాప్రకాష్ "అనే సంస్ధ స్ధాపించి, పలుప్రాంతాలలో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన ధనాన్ని క్షయ వ్యాధి వైద్యశాలకు, రెడ్ క్రాస్ సంస్ఢకు విరాళంగా అందజేసారు. 1952 లో ఈమె "మిస్ మద్రాసు"గా ఎంపిక అయారు.అమెరికా చలనచిత్ర పర్యటనకు 14 భారతీయులులను ఎంపిక చేయగా అందులో ఈమె ఉన్నారు. ఈమె 1953 అక్టోబర్ 1 న ఆంధ్రరాష్ట్ర అవతరణ సభలో నెహ్రు,రాజాజి,ప్రకాశం గారి సమక్షంలో 'వందేమాతరం' గీతంతో పాటు 'మాతెలుగు తల్లికి మల్లెపూదండ' గీతాన్ని తొలి సారి ఆలపించారు. అలా ఎన్నో లలిత గీతాలు గ్రాంఫోన్ రికార్టులుగా వెలువడ్డాయి. మెత్తం 26 తెలుగు, తమిళం, హిందీ, గుజరాతి, సంస్కృతం, ఇంగ్లీషు చిత్రాలలో నటించారు. ఈమె 1956 లో ఈమె నిర్మించిన 'చిత్రార్జున' చిత్రప్రదర్మన చూసిన నెహ్రు, సర్వేపల్లి రాధాకృష్ణ గార్ల అభినందనలు పొందారు. ఈమె 1960 లో లండన్ వెళ్ళి అక్కడ 'ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్' అనే సంస్ధ స్ధాపించి భారతీయ కళలు ప్రదర్మించి పేరు పొందారు. ఈమె 1968 లో గాంధీ శతజయంతి ఉత్సవాలకు నివాళులు అర్పిస్తూ సెయింట్ పాల్ కెథీడ్రల్ లో గానం చేసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. నార్వే, స్వీడన్, స్పెయిన్, కెనడా, అమెరికా వంటి దేశాలలో సంగీత శిక్షణాలయాలు స్ధాపించి వందలమంది కళాకారులకు శిక్షణ యిచ్చారు. అమెరికాలో బ్రాడ్వే ధియోటర్ లో విశ్వకవి రవీంద్రుని 'కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్' నాటకంలో రాణి పాత్ర ధరిచి బ్రాడ్వే అవార్డు పొందిన తొలి భారతీయు మహిళగా గుర్తింపు పొందారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిధ్యాలయంలో బోధకురా లుగా నియామకం పొందారు. ఈమె 1961 లో అమెరికాలో 'OBPE' అవార్డు అందుకున్నారు. లండన్ లో స్థిరపడి అక్కడి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారుడు 'హెరాల్డ్ ఎల్విన్' గారిని వివాహం చేసుకున్నారు. ప్రాచ్య, పాశ్యాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్బావ సేతువుగా అంతర్జాతీయ కీర్తిని పొందిన ఈమె 1985 లో తన జీవిత భాగస్వామిని కోల్పోయారు. తన శేష జీవితాన్ని వ్యాధిగ్రస్తుల సేవలో గడిపిన మన ఈ తెలుగు కీర్తి శిఖరం 2005 ఏప్రిల్ 24 న కళామతల్లి వీణావాణి పాదసేవకై అంబరర వీధిన పయనించారు.<ref>Bellamkonda Nageswara Rao, Facebook Post on 11 June 2021</ref>
 
==ఇతర దేశాలలో వ్యాపించిన ఖ్యాతి==