దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

→‎దేవదాసి - కఠిన జీవనం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి clean up, replaced: గుడిగుడి
పంక్తి 1:
[[File:Devadasi 1920s.JPG|right|thumb|250px|తమిళనాడులోని 1920లలోని ఇద్దరు దేవదాసీల చిత్రపటం.]]
 
'''దేవదాసి''' అంటే [[దేవాలయం|గుడి]] లోని దేవుడి [[ఉత్సవాల]]లో నాట్య [[సేవ]] చేస్తూ జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండే [[స్త్రీ]]. [[సతి]], [[బాల్యవివాహాలు]], [[గణాచారి]], లాంటి సాంఘిక దురాచారం. భారతదేశంలో ప్రధాన సాంఘిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థ తెలంగాణ సమాజంలో కూడా కనపడుతుంది. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళలో తప్ప అన్ని రాష్ట్రాలలో విభిన్న రూపాల్లో కొనసాగుతున్నది. నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారమే దేవదాసి వ్యవస్థ. గ్రామంలో అన్ని అరిష్టాలు, అనర్థాలకు మూల కారణం గ్రామ దేవతలకు ఆగ్రహం కలగడమే అని నమ్మి గ్రామ దేవతలను శాంతింపచేయడానికి అమ్మాయిలను దేవుళ్లకు అర్పించడం జరిగేది. మతం ముసుగులో ఉన్నత కులస్తులు ఆధీన వర్గంలోని స్త్రీలను దోపిడీ చేసే ప్రక్రియ ఇది. స్వాములు వివాహేతర లైంగికవాంఛలను తీర్చడం కోసం పూజారులకు లైంగిక సంతృప్తి చేకూర్చడం కోసం ఏర్పడ్డ సామాజిక దురాచారమే ఈ దేవదాసి వ్యవస్థ.
 
'''చారిత్రక నేపథ్యం:''' మత సంబంధిత వ్యభిచారం భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనపడుతుంది. దక్షిణ ఐరోపా, ఏషియా మైనర్, ఈజిప్టు, మెసపటోమియాలో ఈ దురాచారం ఉంది. గ్రీసు చరిత్రకారుడు హెరిడోటస్ బాబిలోనియాలోని మైలిట్టా దేవాలయంలో స్త్రీల శీలాన్ని అర్పించారని తన రచనల్లో తెలిపారు. లూసియన్ అనే రోమన్ రచయిత ఫోనియాలో ఇటువంటి ఆచారం ఉన్నట్లు రాశాడు. పొనీషియా, కానన్, పేఫస్, సైప్రస్ మొదలైన దేశాల్లో మాతృదేవతారాదన ప్రధానంగా అమల్లో ఉంది. ఈ దేవతను ఎస్టార్ట్, అఘారెత్, ఎస్ట్రేట్ వంటి పేర్లతో పిలుచుకొంటారు. అరేబియాలో అలాట్, ఆల్-ఉజ్జా వంటి సామాజిక దురాచారాలు మత సంబంధిత వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయని టాని పెంజర్ పేర్కొన్నాడు. పశ్చిమాఫ్రికాలోని అనేక దేశాల్లో మతపరమైన వ్యభిచారం ఉన్నట్లు హెరిడోటస్ తన రచనల్లో పేర్కొన్నాడు.
పంక్తి 17:
==దేవదాసి - కఠిన జీవనం==
మంజులవాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం '''మాతంగకన్యాం మనసా స్మరామి''' అని కాళిదాసు కీర్తించిన మాతంగి మహావిద్య సరస్వతీ అవతారం. అటువంటి దేవదాసీల ఉన్నత స్థానం క్రమక్రమంగా దిగజారింది. ఈ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొక్కరి చొప్పున గుడిలోని దేవుడికి "పెళ్ళి" చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి, దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం ప్రదర్శిస్తూ గడపాలి. జోగినులు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి కడగాలి. పూజలు చేయాలి. ఆ రెండు రోజులు ఒక్కపూటే భోజనం చేయాలి. మాంసం ముట్టుకోరాదు. వారంలో ఆరెండు రోజులే ఊర్లో యాచించి, వారమంతా గడపాలి. బస్వినులు సోమవారం, శనివారం పూజ చేయాలి.వికలాంగులు, అత్యాచారానికి గురైన వారిని జోగినులుగా మారుస్తున్నారు.
ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్ళి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నిండి, ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగినీ తల్లి అయితే ఆమె పెద్దకోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకుని, ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి.జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని పాఠశాలలో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలున్నారు.<ref>{{Cite web |url=http://www.prajasakti.com/socialjustice/article-18165 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-09-23 |archive-url=https://web.archive.org/web/20090902090759/http://www.prajasakti.com/socialjustice/article-18165 |archive-date=2009-09-02 |url-status=dead }}</ref>
 
* దేవదాసికి ఉండాల్సిన లక్షణాలను పూజారులు నిర్ణయించేవారు.
పంక్తి 61:
* ఇతర వ్యసనాలకు అలవాటు పడుతున్నారు.
* ఆకాశంలో నివాసాన్ని ఏర్పాటుచేసుకొనే సాంకేతిక పరిజ్ఞానమున్న నేటి ఆధునిక సమాజంలో జోగిని, దేవదాసి వ్యవస్థల రూపంలో స్త్రీని నీతి బాహ్యమైన, అతి దీనమైన జుగుప్సాకర వేశ్యావృత్తిలో కొనసాగించడం సమాజానికి అవమానకరం. కాబట్టి ఈ వ్యవస్థలను పూర్తిగా నిషేధించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది.
 
 
 
'''జోగిని వ్యవస్థ'''
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు