విశ్వబ్రాహ్మణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విశ్వకర్మ ఎవరు ?: AWB తో "మరియు" ల తీసివేత
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 249:
 
'''5.పాకము:-'''
 
==విశ్వబ్రాహ్మణ కవులు==
 
'''మమ్మన''': ఈయన శ్రీనాధుని కాలమువారు.ప్రౌఢదేవ రాయల ఆస్థానమున ధర్మాధికారి, విద్యాధికారి పదవులను రెండింటిని అతి దక్షతతో నిర్వహించి ప్రశస్తి గన్నవాడు. ఈయన గాయత్రీ పీఠాధిపతికూడాను. ఆనాడే కాదు, అంతకు మునుపు ముక్కిలి పూర్వము నుండియు గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ పీఠములు మూడును విశ్వబ్రాహ్మణుల పాలనముననే ఉండేవి.మమ్మన ఇంతటి పండితిడు కనుకనే శ్రీనాధుడు గౌడడిండిమ భట్టును జయించుటకు పూనినప్పుడు ఈతని సాయము నర్ధించవలసి వచ్చినది. రాజాస్థానమున ప్రవేశము లభింపక ఇబ్బంది పడుచున్న శ్రీనాధుడు మమ్మన వద్దకు వచ్చి రాజదర్సనం గౌడడిండినభట్టు తోపోటీకి అనుమతికోరినాడు. మమ్మనకవి వంశకర్త యజుర్వేద ప్రస్తుడైన అహభూన ఋషి.ఇతడు సృష్టికర్త అయిన త్వష్ట సంప్రదాయమునకు చెందినవాడు.విశ్వకర్మ పురాణములో అహభూన శబ్దము కలదు.కావున ఈయన విశ్వబ్రాహ్మణుడని రుజువగుచున్నది.
 
'''విశ్వకర్మ పురాణకర్త: వేంకటాచార్యుడు''': ఈయన మమ్మనాచార్యునికి అయిదవ తరమునకు చెందినవాడు.ఈయన విశ్వకర్మ పురాణకర్త. దీనిని పాటూరును పాలించిన విశ్వబ్రాహ్మణరాజగు పాటూరి బోడన్న కొండనార్యులు శ్రోతలుగా రచించబడినది.ఈ పాటూరి ప్రభువు చరిత్రను ఈ పురాణములో సవిస్తరముగా వివరించబడినది. ఇది 16వ శతాబ్దము చివర రచితమైనట్లు తెలియుచున్నది. ఈ కావ్యమున పది అశ్వాసములలో విశ్వకర్మ మహిమాభివర్ణనము చేయబదినది.
 
'''కొమ్మూరి సోమనాధకవి''': ఈయన కీ.శే.శ్రీ కొమ్మూరి సంగమేశ్వర కవిగారి పూర్వపురుషుడు.విచిత్ర రామాయణమను పేర రామచరితమును రచించినాడు.దానిని వడ్డెపాటి నిరంజనశాస్త్రిగారు ప్రాచీన విచిత్ర రామాయణము అనుపేర ప్రకటించినారు.ఈయన 17వ శతాబ్దపు కవి.
 
'''గద్దె చంద్రశేఖరకవి''': ఈతని ఉత్తర హరిశ్చంద్ర చరిత్ర ఇది ఒక ద్విపద కావ్యము.ఈ కవి దేశకాలములు తెలియరాలేదు. ఇతడు మహావీర శైవుడు. సానగ గోత్ర పవిత్రుడు.గద్దె వీరభద్రాచార్యుని కుమారుడు.సాహిత్య రసపోషణుడని బిరుదము నొందిన వాగ్దేవి కటాక్ష సంపన్నుడు. ఈతడు తనకావ్యముని చెంగల్వరాయుని (కుమారస్వామి) కి అంకితము చెశినానని చెప్పుకున్నాడు.1950 లో మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారములో దీనిని ప్రధమముగా లభించినది. ఇది హరిశ్చంద్రుని పూర్వ వృత్తాంతమును తెలుపు కధ.
 
'''కిన్నెర చంద్రశేఖరకవి''': ఈ కవీశ్వరుడు కంచర్ల ప్రధమాచార్యులవారి పుత్రుడు.ఇతడు భాసు కల్యాణమను పేర సంజ్ఞా సూర్యుల వివాహకధను ద్విపదగా వ్రాసియున్నాడు. ఈతడు విశ్వబ్రాహ్మణ వంశీయుడు కిన్నెర బ్రహ్మయ్య వంశములో జన్మించాడు.కిన్నెర బ్రహ్మయ్య శైవ సాంప్రాదాయములో మహనీయుడని పాల్కూరికి సోమనాధుని బసవ పురాణము తెలుపుచున్నది.ఈయన గురుంచి కర్ణాటకాంధ్ర రాష్ట్రములలో పెక్కు కధలవు ప్రచారములో ఉన్నవి.
 
 
lopintisri14:56, 17 september 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/విశ్వబ్రాహ్మణ" నుండి వెలికితీశారు