శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==ఆరాధనా పద్ధతులు దేవీ నామాలు==
సింధూ నాగరికతలో శివుని పశుపతిగానూ లింగమూర్తిగానూ ఆదిశక్తిని లోకమాతగానూ జన్మకారిణిగానూ భావించి ఆరాధించినట్లు పురాతన అవశేషాలు చెప్తున్నాయి.ఊరి పొలిమేర్లను కాచే దేవిగానూ పెద్ద అమ్మవారుగా పిలువబడే అంటు వ్యాది మసూచి నివారిణిగా భావించే అమ్మగా రేణుకాదేవి తెలుగునాట పోలేరమ్మగానూ తమిళనాడులో ఎల్లమ్మ మరియు ఎట్టమ్మగానూ ఉరూరా వెలసి పూజింపబడుతుంది.ఉడుపుచలమ అని చెప్పబడే ప్రత్యేక వాయిద్య సహాయంతో చెప్పబడే కథలో రేణుకాదేవి వృత్తాంతం చెప్పడం జమదగ్ని భార్య రేణుకాదేవి రోగాలబాధ నుండి విముక్తి కలిగించే మారెమ్మ అని నిర్ధారణ చేస్తుంది.ఈమె మూర్తి తలవరకు మాత్రమే ఉంటుంది.తలకు మాత్రమే పూజలు చేస్తారు.
===నామాలు===
పల్లెలూ,గ్రామాలూ,ఊర్లూ, పట్టణాలూ ఒక్కో ప్రదేశానికీ ఒక్కో రూపంలో పూజింపబడే అమ్మవార్ల నామాలు కోకొల్లలు.వాటిలో కొన్ని విజయవాడ కనకదుర్గ,కంచి కామాక్షీ,మధుర మీనాక్షి,ముంబాయిలోని మాబాదేవి,కలకత్తా కాళీ,మసూరు చాముంఢీ,మూగాంబికా,వైష్ణవీమాత,క్శీ విశాలాక్షీ,శ్రీశైలం భ్రమరాంబ,ప్రముఖ నామాలలో కొన్ని.గ్రామదేవతలైన పోలేరమ్మ, ఎల్లమ్మ, పైడితల్లి, బతుకమ్మ, రేణుకా, కాకతమ్మా, మాహురమ్మా,శ్రీనాధుని రచనలలో వర్ణింపబడిన మూలగూరమ్మ .పిఠా పురం పీటలమ్మ,సామర్లకోట చామలమ్మ,దాక్షారామం మాణిక్యాలమ్మ లాటి రూపాలు మరికొన్ని
 
మూలగూరమ్మ లాటి రూపాలు మరికొన్ని.
దేశదిమ్మరులూ లైన కొండ దొరలు భవిష్యత్తు చెప్పడం చెప్పించుకోవడం ఒక అలవాటు.వారు చెప్పే ముందు "అంబ పలుకు,జగదంబ పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు కాశీవిశాలాక్షి పలుకు" అని ముందుగా దేవి ఆనతి తీసుకుని దేవి పలుకులుగా బవిష్యత్తు చెప్పడం అలవాటు.ఈ అలవాటు ఎరుకలసానులు అనబడే సోది చెప్పే ఆడవారిలో కూడా ఉంది.గంగిరెద్దును తీసుకు వచ్చి బిక్షాటన సాగించే బుడబుక్కల వాళ్ళు అమ్మపేరుతో ఆశీర్వచనాలు గృహస్తులకు ఇస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు