శృంగేరి శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
== చరిత్ర ==
[[దస్త్రం:Vidyashankara Temple at Shringeri.jpg|thumb|శృంగేరిలో విద్యాశంకర దేవాలయం|alt=|240x240px]]
శృంగేరీ పీఠాధిపతియైన విద్యారణ్యస్వామి భారతదేశ చరిత్రలో ముఖ్యమైన [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] స్థాపింపజేసి [[హరిహర రాయలు (అయోమయ నివృత్తి)|హరిహర రాయలు]], [[బుక్కరాయలు (అయోమయ నివృత్తి)|బుక్కరాయలకు]] మార్గదర్శనం చేశారు. విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నగరానికి విద్యానగరం అని పేరు పెట్టారు. క్రమంగా ఈ నగరానికి విజయనగరమనే పేరు కూడా వచ్చింది. సామ్రాట్టులకు కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తులనే పేరుతో పాటుగా విద్యానగర చక్రవర్తులనే పేరు కూడా వ్యాప్తిలో ఉంది. సా.శ.1336 రాగి ఫలకం ఆధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది. విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరీ శారదా పీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.
 
1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు [[హైదర్ అలీ]], అతని కుమారుడు [[టిప్పు సుల్తాన్]]లకు శృంగేరీ శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద కూడా దాడిచేసి ఊరినీ, పీఠాన్ని కూడా దోచుకున్నారు. స్వామివారికి, వారి శిష్యులకు అన్నవస్త్రాలకే లోటువచ్చింది. టిప్పుసుల్తాన్ ఈ సంగతి తెలుసుకుని వారికి ఆహారపదార్థాలు, బట్టలు, ధనం, మరెవరైనా దోచుకోబోతే అడ్డుకుందుకు సైన్యాన్ని ఇచ్చి పంపారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/శృంగేరి_శారదా_పీఠం" నుండి వెలికితీశారు