పంక్తి 35:
తత్వశాస్త్రం చాలా క్లిష్టమైనది. సామాన్య వికీ సభ్యులకు ఇవి చాలావరకు అర్ధంకావు. కానీ వీనికి మూలకారకులైన తత్వవేత్తలను, వారు జీవించిన కాలాన్ని ఆనాటి సాంఘిక పరిస్థితులను కూడా తెలియజేసి వివరిస్తే మంచిదని నా అభిప్రాయం. మతంతో లింకు పెట్టద్దు. మత విషయాలను వదలిపెట్టి మనుషుల నమ్మకాలతో విమర్శిస్తూ లేదా సమర్ధిస్తూ వ్యాసాలు రచిస్తే ఎవరికీ కష్టం కలిగించదు. ములాలు తప్పకుండా చేర్చాలి. లేకపోతే వాటిని మీ స్వంత వ్యక్తిగత అభిప్రాయాలుగా అపోహ కలిగిస్తాయి.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 05:04, 10 డిసెంబర్ 2008 (UTC)
 
హెగెల్ తత్వశాస్త్రం పై క్రైస్తవ మత ప్రభావం ఉంది కాబట్టే ఆ విషయం వ్రాసాను. సంప్రదాయవాద హెగెలీయులు క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. వామపక్ష హెగెలీయులు మతాన్ని తిరస్కరించారు. హెగెలీయవాదానికి, మతానికి మధ్య ఎంత వరకు సంబంధం ఉందో తెలుసు కోవడం అవసరమే. టాల్స్టాయ్ ఒక మూఢ భక్తుడని తెలిసి కూడ లెనిన్ అతన్ని అభిమానించేవాడు. మతంతో సంబంధం లేని ప్రగతి నిరోధక భావాలు ఉన్న వారు కూడా ఉంటారు. హెగెల్ లో ప్రగతివాద తత్వం, ప్రగతి నిరోధక తత్వం రెండూ ఉండేవి. అయితే హెగెల్ లో ఉన్న జడతత్వ భావాలనీభావాలన్నీ మతానికి సంభందిచినవి అని నేను అనుకోను. కనుక సంప్రదాయ హెగెలీయవాదాన్ని విమర్శించడమంటే మతాన్ని విమర్శించడం కాదు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు