కంప్యూటర్ చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==కంప్యూటర్ అంటే ఏమిటి?==
కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్‌ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలు. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.<br />
* కన్సైజ్‌ ఆక్స్ఫర్డు ఇంగ్లీష్‌ డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధరించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.<ref>The Concise Oxford English Dictionary, http://www.askoxford.com/concise_oed/computer?view=uk, Accessed on 08.01.2009</ref>
* వెబ్స్టర్స్ ఇంగ్లీష్ డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.<ref> Merriam Webster's Online Dictionary, http://www.merriam-webster.com/dictionary/computer, Accessed on 08.01.2009</ref>
"https://te.wikipedia.org/wiki/కంప్యూటర్_చరిత్ర" నుండి వెలికితీశారు