చర్చ:తుల్జాబాయి: కూర్పుల మధ్య తేడాలు

సంఘటనల ఆధారంగా వ్రాయబడ్డ వ్యాసాన్ని తొలగించటమే ఉత్తమం
తొలగింపు కోవలోకి తేవలసిందే
పంక్తి 23:
 
::వ్యాస రచన పూర్తిగా పత్రికలలో వ్రాసినట్టున్నది గాని వికీ శైలిలో లేదు. ఏతా వాతా చూస్తే, వ్యాసం వ్రాసింది ఒక సంఘటన గురించి. వికీలో ఇటువంటి సంఘటనల గురించి వ్రాసే అవకాశం ఉన్నదా? లేదా? అన్న అంశం నిర్వాహకులు ఒకసారి పరిశీలించాలి. నామటుకు నాకు అనిపించేది ఏమంటే, ఇలా సంఘటనలగురించి వికీలో వ్రాసుకుంటూ పోతే, ఎవరికి తోచిన సంఘటనలగురించి వారు వ్రాసిపడేసే ప్రమాదమున్నది. ఆ తరువాత అటువంటి వ్యాసాలను ఏమి చెయ్యాలో తెలియక తలపట్టుకోవాలి! ఎంతటి ఉదాత్త సంఘటన అయినా సరే అది వార్త అవుతుందిగాని, వికీలో అంశమవుతుందనుకోను. కాబట్టి, ఇలా సంఘటనల ఆధారంగా వ్రాయబడ్డ వ్యాసాన్ని తొలగించటమే ఉత్తమం అనుకుంటున్నాను. --[[వాడుకరి:Vu3ktb|S I V A]] 17:59, 9 జనవరి 2009 (UTC)
 
* అవునండి, ఈ వ్యాసం వికీ శైలిలో ఎంతమాత్రమూ లేదు. ఈ వ్యాసం ఒక సంఘటనా "రిపోర్టు" లాగ వున్నది. "మతకలహాలు జరిగినపుడు ఈమె తన పొరుగువారికి ఆదుకొన్నది", "ప్రభుత్వంచే ప్రశంశలు పొందినది" అనే రెండు వాక్యాలు తప్పితే, మిగతా సంఘటనలన్నీ తొలగింపుకోవలోకి రావాల్సిందే. ఈ రెండు వాక్యాలకొరకు వ్యాసం అవసరమా ? లేదా మానవత్వం ప్రకటించిన వారికొరకు ఏదైనా వ్యాసంలో జాగా వుంటే, అక్కడ ఆమె పేరును ప్రస్తావించవచ్చు. స్థూలంగా వ్యాసం తొలగింపు వైపుకు మొగ్గాల్సిందే. లేదా చంద్రకాంతరావు గారు చెప్పినట్టు 'మారిన హృదయపు గాయాలకు అధికం చేయడమే' అవుతుంది. ఇలాంటి వ్యాసాలకు మొదట్లోనే తొలగించాల్సిన అవసరం తెవికీకి వున్నది. [[వాడుకరి:అహ్మద్ నిసార్|నిసార్ అహ్మద్]] 18:41, 9 జనవరి 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:తుల్జాబాయి" నుండి వెలికితీశారు
Return to "తుల్జాబాయి" page.