పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
పంక్తి 15:
}}
[[బొమ్మ:parasurama.jpg|thumb|right|200px|పరశురామావతారము]]
[[శ్రీమహావిష్ణువు]] దశావతారములలో '''పరశురామావతారము''' (Parasurama Incarnation) ఆరవది.<ref name="Shah">Shahjahanpur&nbsp;– Etihasik Evam Sanskritik Dharohar</ref> [[చతుర్యుగములు|త్రేతాయుగము]] ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని '''భార్గవరాముడు''', '''జామదగ్ని''' అని కూడా అంటారు.<ref name="Amar">{{cite book|last = Pai| first = Anant| authorlink = | coauthors = | title = Parashurama&nbsp;– Sixth Incarnation of Vishnu | publisher = Amar Chitra Katha&nbsp;– Volume 764 | date = November 29, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B004EEORZW/| doi = | id = }}</ref>
 
==పరశురాముని జన్మవృత్తాంతం==
పంక్తి 22:
==కార్తవీర్యునితో వైరం==
[[File:Paraśurāma fighting King Kartavirya Arjuna..jpg|thumb|కార్త్యవీరునితో పోరాడుతున్న పరశురాముడు.]]
హైహయ వంశజుడైన [[కార్తవీర్యార్జునుడు]] శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు.<ref name="Parsh">{{cite book|last = Rai| first = Kayyara Kinhanna| authorlink = | coauthors = | title =BhargavaParashurama| publisher = Litent ePublishing | date = June 13, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B003RWS7O4/| doi = | id = }}</ref> గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు.<ref name="Parsh"/> ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
 
కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు