కుతుబ్ షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: az:Qütbşahlılar sülaləsi
చి యంత్రము కలుపుతున్నది: tr:Kutbşahlar; cosmetic changes
పంక్తి 51:
'''కుతుబ్ షాహీ వంశము''' (ఈ వంశస్థులను '''కుతుబ్ షాహీలు''' అందురు) [[దక్షిణ భారతదేశము]] లోని [[గోల్కొండ]] రాజ్యము యొక్క పాలక వంశము. ఈ వంశస్థులు [[తుర్కమేనిస్తాన్]]-[[ఆర్మేనియా]] ప్రాంతములోని [[తుర్కమేన్]] తెగకు చెందిన [[షియా]] [[ముస్లిం]]లు.
 
== స్థాపన ==
 
కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు '''[[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]],''' [[16వ శతాబ్దము]] ప్రారంభములో కొందరు బంధువులు మరియు స్నేహితులతో కలసి [[ఢిల్లీ]]కి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన [[దక్కన్ పీఠభూమి]]కి వచ్చి [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సుల్తాన్]] [[మహమ్మద్ షా]] కొలువులో పనిచేసినాడు. అతడు గోల్కొండను జయించి [[తెలంగాణ]] రాజ్యానికి అధిపతి అయ్యెను. [[1518]]లో [[బహుమనీ సామ్రాజ్యము]] పతనమై ఐదు [[దక్కన్ సల్తనత్]] ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించినాడు.
 
== పరిపాలన ==
 
ఈ వంశము [[తెలుగులు|తెలుగు వారిని]] పరిపాలించిన తొలి ముస్లిం వంశము. ఇది అంధ్ర దేశమును ముస్లింలు పరిపాలి‌చిన (తెలంగాణ ప్రాంతము) మరియు హిందూ పరిపాలనలో ఉన్న ఇతర ప్రాంతములుగా విభజించినది. ఈ వంశము [[1687]] లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[ఔరంగజేబు]] యొక్క సైన్యాలు [[దక్కన్]]ని జయించేవరకు, 171 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించినది. ఆ తరువాత కూడా, తెలంగాణ [[1948]]లో [[హైదరాబాదు రాజ్యము]], [[న్యూఢిల్లీ]] యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో [[భారత దేశము]] లో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉన్నది.
 
కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా మరియు శాస్త్ర పోషకులు. వీరు [[పర్షియన్ సంస్కృతి]]ని పోషించడమే కాకుండా, ప్రాంతీయ [[దక్కన్]] సంస్కృతికి చిహ్నమైన [[తెలుగు భాష]] మరియు కొత్తగా అభివృద్ధి చెందిన [[ఉర్దూ]]([[దక్కనీ]]) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత [[హైదరాబాదు]] రాజ్యమునకు రాజధానులుగా ఉండేవి మరియు ఉభయ నగరములును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.
 
== వంశ క్రమము ==
 
ఈ వంశము యొక్క ఎనిమిది రాజులు క్రమముగా:
పంక్తి 68:
# '''[[జంషీద్ కులీ కుతుబ్ షా]]''' ([[1543]]-[[1550]])
# '''[[సుభాన్ కులీ కుతుబ్ షా]]''' ([[1550]])
# '''[[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కులీ కుతుబ్ షా]]''' ([[1550]]-[[1580]])
# '''[[మహమ్మద్ కులీ కుతుబ్ షా]]''' ([[1580]]-[[1612]])
# '''[[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]]''' ([[1612]]-[[1626]])
పంక్తి 74:
# '''[[అబుల్ హసన్ కుతుబ్ షా]]''' ([[1672]]-[[1687]])
 
== బయటి లింకులు ==
* [http://www.vepachedu.org/golconda.html కుతుబ్ షాహీల పరిపాలనలో తెలుగు సాహిత్యము మరియు సంస్కృతి]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:భారతదేశాన్ని పరిపాలించిన వంశములు]]
Line 87 ⟶ 88:
[[lt:Kutubšachai]]
[[ru:Голконда (султанат)]]
[[tr:Kutbşahlar]]
"https://te.wikipedia.org/wiki/కుతుబ్_షాహీ_వంశం" నుండి వెలికితీశారు