చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''చెలికాని వెంకట రామారావు''' (Chelikani Ramarao) (1901-1985) 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీకగా నిలుస్తారు. మానవత, నిజాయితీ, వినమ్రత,విస్పష్టమైన నిబద్ధత మొదలైన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. వివేకానందుని బోధనలు, బ్రహ్మ సమాజ ఉద్యమం, [[రఘుపతి వెంకటరత్నం]] గారి శిష్యరికం, స్వతంత్ర పోరాటం, జైలు జీవితం, హరిజనసేవ, స్త్రీ జనోద్దరణ, [[కమ్యూనిస్టు]] ఉద్యమం, [[పార్లమెంటు]] సభ్యత్వం, వైద్యసేవ మొదలైన అంశాలకు ఆయన ఒక వాహిక లాగా నిలవడమే గాక వాటిపై తనదైన ముద్ర వేశారు.[[హేతువాది]] [[సోషలిస్టు]].
 
=== బాల్యం ===
ఈయన [[జులై 15]], 1901లో నారయణస్వామి, సూరమ్మ దంపతులకు జన్మించాడు. 1921, జనవరి 26న కార్యదీక్షకై గృహపరిత్యాగం చేసాడు. 1921 లోనే చదువుకు స్వస్తి చెప్పి జాతీయ ఉద్యమంలో చేరాడు. 1922లో [[రాజమండ్రి]]లో మొదటిసారి జైలు శిక్షను అనుభవించాడు. 1924లో [[కాకినాడ]]లో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసాడు. 1926-30 [[నిజాం సంస్థానం]]లో lM &S చదివి, అక్కడి, సంస్కరణోద్యమాలతో సంబంధాలు నెలకొల్పాడు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నాడు. 1931లో [[డాక్టరు]] డిగ్రీ పట్టా పొందారు. 1934 లో కమలమ్మగారితో పరిచయం. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించాడు. ఇంకా జిల్లా హరిజన సంఘ అద్యక్షులుగా 1935 లో వ్యవహరించాడు. ఈయన డాక్టరుగా 1937 నుండి [[రంగూన్]]లో ఉన్నాడు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించాడు. 1952లో కాకినాడ [[పార్లమెంటు]] సభ్యునిగా తొలి లోక్‌సభకు సి.పి.ఐ ([[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]]) అభ్యర్ధిగా ఎన్నికైనాడు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి [[సెప్టెంబరు 25]],[[1985]]న దివంగతులైనాడు.
 
 
 
==='''మంచి కమ్యూనిస్టు డా. చెలికాని రామారావు'''===
రచన : '''అదృష్ట దీపక్'''
"పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అని కవివాక్కు.ఇటీవల మరణించిన స్వాతంత్ర్య సమరయోధుడు, మహోన్నత మానవతావాది డాక్టర్ చెలికాని రామారావు అలాంటి పుణ్యపురుషులలో ఒకరు. తాను నమ్మిన ఆశయాలను మనసా వాచా కర్మణా ఆచరించి తరువాత తరాలకు ఆదర్శప్రాయుడైన మహానుభావుడు ఆయన.తన దగ్గర వైద్యం చేయించుకున్న బీదసాదల నుంచి ఏవిధమైన రుసుమూ తీసుకోకుండా ఖర్చులకోసం తిరిగి వారికే కొంత డబ్బు ముట్టచెప్పేవారు. మూర్తీభవించిన సౌజన్యంతో జీవితంలో కడదాకా కష్టజీవుల అభ్యున్నతికోసం కృషిచేసిన డాక్టర్ రామారావు గారు చరిత్రలో ఒక "లిజెండరీఫిగర్" గా నిలిచిపోతారు.
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు