మధ్య ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ar:مدية برديش
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ar:ماديا براديش; cosmetic changes
పంక్తి 21:
districts=48 |
website=www.mp.nic.in |
seal=[[బొమ్మఫైలు:MPseal.png|center]] |
Official Portal=www.mponline.gov.in |
 
పంక్తి 27:
footnotes = |
}}
'''మధ్య ప్రదేశ్''' (Madhya Pradesh) ([[హిందీ]]:मध्यमध्य प्रदेशप्रदेश) - పేరుకు తగినట్లే [[భారతదేశం]] మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం [[భోపాల్]]. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
 
== భౌగోళికం ==
మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో [[నర్మదా నది]], [[వింధ్య పర్వతాలు]], [[సాత్పూరా పర్వతాలు]] ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా విస్తరించిన ఈ రెండు పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ప్రవహిస్తున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు తరతరాలుగా ఈ కొండలు, నది హద్దులుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన [[గుజరాత్]], వాయువ్యాన [[రాజస్థాన్]], ఈశాన్యాన [[ఉత్తర ప్రదేశ్]], తూర్పున [[ఛత్తీస్‌గఢ్]], దక్షిణాన [[మహారాష్ట్ర]] రాష్ట్రాలతో హద్దులున్నాయి.
 
పంక్తి 40:
* [[మహాకోషల్]] (మహాకౌశాల్): ఆగ్నేయ ప్రాంతం - నర్మదానది తూర్పు భాగం, తూర్పుసాత్పూరా పర్వతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మహాకోషల్‌లో ముఖ్యనగరం [[జబల్‌పూర్]].
 
== జిల్లాలు ==
మధ్య ప్రదేశ్‌లోని 48జిల్లాలను 9 డివిజన్‌లుగా విభజించారు. ఆ డివిజన్లు: [[భోపాల్]], [[చంబల్]], [[గ్వాలియర్]], [[హోషంగాబాద్]], [[ఇండోర్]], [[జబల్‌పూర్]], [[రేవా]], [[సాగర్]], [[ఉజ్జయిన్]].
{{:భారతదేశ జిల్లాల జాబితా/మధ్య ప్రదేశ్}}
 
== చరిత్ర ==
 
=== ప్రాచీన చరిత్ర ===
 
[[ఉజ్జయిని]] ("అవంతీ నగరం" అనికూడా పేరు) ఒకప్పటి "మాల్వా" రాజ్యానికి రాజధాని. క్రీ.పూ. 6వ శతాబ్దిలోనే భారతదేశంలో నగరాలు, నాగరికత రూపుదిద్దుకొటున్న సమయంలో ఇది ఒక ప్రధాన నాగరిక కేంద్రంగా వర్ధిల్లింది. ధానికి తూర్పున బుందేల్‌ఖండ్ ప్రాంతంలో "ఛేది" రాజ్యం ఉండేది. క్రీ.పూ. 320లో [[చంద్రగుప్త మౌర్యుడు]] ఉత్తరభారతాన్ని అంతటినీ [[మౌర్య సామ్రాజ్యం]] క్రిందికి తెచ్చాడు. అందులో ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా కలిసి ఉంది. క్రీ.పూ. 321 నుండి 185 వరకు సాగిన మౌర్యసామ్రాజ్యం [[అశోక చక్రవర్తి]] అనంతరం పతనమయ్యింది. అప్పుడు మధ్యభారతంపై ఆధిపత్యంకోసం [[శకులు]], [[కుషాణులు]], స్థానిక వంశాలు పోరుసాగించాయి.
పంక్తి 54:
4, 5 శతాబ్దాలలో ఉత్తరభారతదేశం [[గుప్త సామ్రాజ్యం]]లో [[స్వర్ణ యుగం]]గా వర్ధిల్లింది. అప్పుడు [[బంగాళాఖాతం]], [[అరేబియా సముద్రం]] మధ్యభాగమైన [[దక్కన్ పీఠభూమి]]ని పాలించే [[వాకాటకులు|వాకాటకుల]] రాజ్యం గుప్తుల రాజ్యానికి దక్షిణపు హద్దు. 5వ శతాబ్దాంతానికి ఈ సామ్రాజ్యాలు పతనమయ్యాయి.
 
=== మధ్యయుగం చరిత్ర ===
"[[హూణులు|తెల్ల హూణుల]]" (Hephthalite) దండయాత్రలతో గుప్తసామ్రాజ్యం కూలిపోయింది. దానితో భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. 528లో [[యశోధర్ముడు]] అనే మాళ్వా రాజు హూణులను ఓడించి, వారి రాజ్యవిస్తరణకు అడ్డుకట్టవేశాడు. [[తానేసార్]]‌కు చెందిన [[హర్షుడు]] అనే రాజు ఉత్తరభారతాన్ని కొద్దికాలం ఒకటిగా చేయగలిగాడు. ఆయన 647లో మరణించాడు. తరువాతికాలంలో [[రాజపుత్రులు|రాజపుత్ర వంశాల]] ప్రాభవం మొదలయ్యింది. మాళ్వా [[పారమారులు]], బుందేల్‌ఖండ్ [[చందేలులు]] వీరిలో ముఖ్యులు. సుమారు 1010-1060 మధ్య పాలించిన పారమఅర రాజు [[భోజుడు]] గొప్ప రచయిత, విజ్ఞాని (polymath). 950-1050 మధ్యలో చందేలులు [[ఖజురాహో]] మందిరాలను నిర్మించారు.
 
పంక్తి 60:
మహాకోసలలోని "గొండ్వానా"లో [[గోండ్]] రాజ్యాలు నెలకొన్నాయి. 13వ శతాబ్దంలో [[ఢిల్లీ సుల్తానులు]] మధ్యప్రదేశ్‌ను జయించారు. ఢిల్లీ సుల్తానుల పతనం తరువాత మళ్ళీ కొంతకాలం స్థానిక స్వతంత్రరాజుల పాలన సాగింది. గ్వాలియర్‌లో [[తోమారులు|తోమార]] రాజపుత్రులు, మాళ్వాలో ముస్లిం సులతానులు (వీరి రాజధాని "మండూ") రాజ్యం చేశారు. 1531లో మాళ్వా సులతానులను గుజరాత్ సుల్తానులు జయించారు.
 
=== ఆధునిక యుగ చరిత్ర ===
 
 
పంక్తి 69:
ఆ కాలంలో [[బ్రిటిష్‌వారు]] [[బెంగాల్]], [[బొంబాయి]], [[మద్రాసు]]లలో స్థావరాలు ఏర్పరచుకొని భారతదేశంలో తమ అధీనాన్ని విస్తరించుకొనసాగారు. తత్కారణంగా 1775 - 1818 మధ్య మూడు [[ఆంగ్ల-మరాఠా యుద్ధాలు]] జరిగాయి. మూడవ యుద్ధం తరువాత బ్రిటిష్‌వారి అధిపత్యానికి దాదాపు ఎదురులేకుండా పోయింది. మహాకోసల ప్రాంతం (సౌగార్, నెర్బుద్ద విభాగాలు) బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయింది. దీనిని మధ్య పరగణాలు (Central Provinces) అని పిలచేవారు. ఇండోర్, భోపాల్, నాగపూర్, రేవా, మరి చాలా చిన్న సంస్థానాలు బ్రిటిష్‌వారికి లోబడిన రాజ్య సంస్థానాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఉత్తరభాగరాజసంస్థానాలు Central India Agency పాలనలో నడచేవి.
 
=== స్వాతంత్ర్యానంతర చరిత్ర ===
 
1950లో [[నాగపూర్]] రాజధానిగా - మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి - మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. Central India Agency ప్రాంతాన్ని [[మధ్యభారత్]], [[వింధ్యప్రదేశ్]]‌రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. [[మరాఠీ భాష]] మాట్లాడే దక్షిణప్రాంతమైన [[విదర్భ]]ను , నాగపూర్‌తో సహా, వేరుచేసి [[బొంబాయి రాష్ట్రం]]లో కలిపారు.
పంక్తి 76:
200 నవంబరులో మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Madhya Pradesh Reorganization Act) క్రింద, మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగం కొంత విడదీశి, [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాన్ని ఏర్పరచారు.
 
== చారిత్రిక నిర్మాణాలు<!--Heritage and Architecture --> ==
 
మధ్యప్రదేశ్‌లో ఎన్నో ప్రదేశాలు సహజసౌందర్యానికి, అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. మూడు స్థలాలు [[ప్రపంచ వారసత్వ స్థలాలు]]గా (World Heritage Sites) [[ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక సంస్థ]] (UNESCO)చే గుర్తింపబడ్డాయి. అవి
పంక్తి 100:
మధ్యప్రదేశ్‌లో పర్యటనకు సంబంధించిన వివరాలకోసం [http://wikitravel.org/en/article/Madhya_Pradesh వికిట్రావెల్] చూడండి.
 
== ప్రకృతి దృశ్యాలు ==
 
మధ్యప్రదేశ్‌లో ఎన్నో [[జాతీయ ఉద్యానవనాలు]](National Parks)ఉన్నాయి. వాటిలో కొన్ని:
పంక్తి 129:
* నొరాదేహి
 
== సంస్కృతి ==
==భాష==
 
మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా మాట్లాడే భాష [[హిందీ]]. ప్రామాణికమైన హిందీతోబాటు ఒకోప్రాంతంలో ఒకో విధమైన భాష మాట్లాడుతారు. ఈ భాషలను హిందీ మాండలికాలు అని కొందరూ, కాదు హిందీ పరివారానికి చెందిన ప్రత్యేకభాషలని కొందరూ భావిస్తారు. ఇలా మాట్లాడే భాషలు (యాసలు): మాళ్వాలో [[ఙాల్వి భాష|మాల్వి]], నిమర్‌లో [[నిమడి భాష|నిమడి]], బుందేల్‌ఖండ్‌లో [[బుందేలి భాష|బుందేలి]], బాగెల్‌ఖండ్‌లో [[బాఘేలి భాష|బాఘేలి]]. ఇంకా మధ్యప్రదేశ్‌లో మాట్లాడే భాషలు - [[భిలోడి భాష]], [[గోండి భాష]], [[కాల్తో భాష]]; ఇవన్నీ ఆదిమవాసుల భాషలు. [[మరాఠీ భాష]] మాట్లాడేవారు కూడా మధ్యప్రదేశ్‌లో గణనీయంగా ఉన్నారు.
 
== ఇవికూడా చూడండి ==
 
== బయటి లింకులు ==
* [http://www.mp.nic.in/ మధ్య ప్రదేశ్ పోర్టల్]
* [http://www.mpgovt.nic.in/ మధ్యప్రదేశ్ ప్రరభుత్వం]
* [http://www.mptourism.com/ మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ]
* [http://www.mppolice.gov.in/ మధ్యప్రదేశ్ పోలీసు]
* [http://www.mapsofindia.com/maps/madhyapradesh/madhyapradesh.htm మధ్యప్రదేశ్ మ్యాపు]
 
 
పంక్తి 153:
[[ta:மத்தியப் பிரதேசம்]]
[[ml:മധ്യപ്രദേശ്‌]]
[[ar:مديةماديا برديشبراديش]]
[[be:Мадх'я-Прадэш]]
[[bg:Мадхя Прадеш]]
"https://te.wikipedia.org/wiki/మధ్య_ప్రదేశ్" నుండి వెలికితీశారు