వికీపీడియా:3RR నియమం: కూర్పుల మధ్య తేడాలు

56 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: glk:Wikipedia:سه دفأ واگردؤنئن మార్పులు చేస్తున్నది: en:Wikipedia:Edit warring#The three-revert rule; cosmetic changes
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Wikipedia:Edit war#The Three revert rule, ro:Wikipedia:Regula celor trei reveniri)
చి (యంత్రము కలుపుతున్నది: glk:Wikipedia:سه دفأ واگردؤنئن మార్పులు చేస్తున్నది: en:Wikipedia:Edit warring#The three-revert rule; cosmetic changes)
'''మూడు తిరుగుసేతల నియమం''' ('''3RR''' అని అంటూ ఉంటారు) విధానం [[వికీపీడియా:వికీపీడియనులు|వికీపీడియనులందరికీ]] వర్తిస్తుంది. ఇది దిద్దుబాటు యుద్ధాలను నివారించేందుకు ఉద్దేశించబడింది:
 
:ఒక రచయిత ఒక పేజీలో, 24 గంటల వ్యవధిలో, పూర్తిగా గానీ పాక్షికంగా గానీ, మూడు కంటే ఎక్కువ తిరుగుసేతలు చెయ్యరాదు. తిరుగుసేత అంటే వేరే సభ్యుడు చేసిన దిద్దుబాటును రద్దు చేసి, వెనక్కు తీసుకుపోవడం. రద్దు చేసే భాగం ఒకటే కావచ్చు, వేరు వేరైనా కావచ్చు.
 
అతిక్రమణదారును 24 గంటల పాటు నిరోధించవచ్చు. మళ్ళీ మళ్ళీ చేస్తే ఇంకా ఎక్కువ కాలం పాటు చెయ్యవచ్చు.
ఈ నియమం ఒక ''రచయిత''కు వర్తిస్తుంది. ఒకే వ్యక్తి అనేక ఖాతాలు, లేక ఐపీఅడ్రసుల నుండి చేస్తే వాటన్నిటినీ ఒకే రచయిత చేసినవిగానే భావిస్తాం.
 
ఈ నియమం ఒక పేజీకి వర్తిస్తుంది. ఒక రచయిత రెండు వేరు వేరు పేజీల్లో చేరో రెండు తిరుగుసేతలు చేసాడనుకుందాం. ఈ రచయిత చేసే పనులు వికీపీడియాకు అడ్డంకులుగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, అవి రెండు వేరు వేరు పేజీల్లో జరిగాయి కాబట్టి 3RR నియమం వర్తించదు.
 
అయితే రోజుకు మూడు సార్లు తిరుగుసేతలు చెయ్యొచ్చని ఈ నియమం అనుమతి ఇచ్చినట్లు కాదు. రచయిత చేసిన తిరుగుసేతలు వికీపీడియాకు నష్టకరంగా, అడ్డుకునేలా ఉన్నాయని స్పష్టంగా తెలిస్తే మూడు సార్లకు మించకున్నా నిరోధించవచ్చు. మరీ ముఖ్యంగా తిరుగుసేతలను ఒక ఆటగా చేసేవారికి ఇది వర్తిస్తుంది. ఓసారి నిరోధానికి గురైన వారి విషయంలో నిర్వాహకులు మరింత నిక్కచ్చిగా ఉంటారు. వాళ్ళు మూడు కంటే ఎక్కువ సార్లు తిరుగుసేత చెయ్యకపోయినా, నిరోధానికి గురయ్యే అవకాశం ఎక్కువ. అలాగే, సాంకేతికంగా మూడు కంటే ఎక్కువ సార్లు తిరుగుసేత చేసిన రచయితలను కూడా సందర్భాన్ని బట్టి నిరోధించక పోవచ్చు.
 
 
ఏతావాతా తేలిందేమంటే: ఇంగితాన్ని వాడండి, దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనవద్దు. పదే పదే తిరుగుసేత చేసేకంటే ఇతర రచయితలతో చర్చించడం మేలు. వ్యాసం లోని విషయం తిరుగుసేత చేసి తీరాల్సినదే అయితే ఎవరో ఒకరు చేస్తారు — దానివలన సముదాయపు విస్తృతాభిప్రాయం కూడా వెలుగులోకి వస్తుంది. తిరుగుసేత కంటే [[వికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] కోసం ప్రయత్నించడమో లేక పేజీ సంరక్షణ కోసం అర్ధించడమో నయం.
 
== తిరుగుసేత అంటే ఏమిటి? ==
[[వికీపీడియా:తిరుగుసేత|తిరుగుసేత]] అంటే, ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్లను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ రద్దు పరచడం. పేజీలో చేసిన దిద్దుబాట్ల రద్దు, పేజీ తరలింపుల రద్దు, నిర్వాహకత్వానికి సంబంధించిన మార్పుల రద్దు, తొలగించిన పేజీని పదే పదే సృష్టించడం మొదలైనవన్నీ ఈ కోవలోకి వస్తాయి.
 
ఒక రచయిత వెంటవెంటనే చేసే తిరుగుసేతలన్నిటినీ ఒకే తిరుగుసేతగా ఈ నియమం గుర్తిస్తుంది.
 
== మినహాయింపులు ==
ఈ నియమం దిద్దుబాటు యుద్ధాలను నివారించేందుకు ఉద్దేశించింది కాబట్టి, యుద్ధాల్లో భాగం కాని తిరుగుసేతలు ఈ నియమాన్ని అతిక్రమించినట్లు కాదు. దిద్దుబాటు యుద్ధాలు అవాంఛనీయం కాబట్టి, మినహాయింపులకు అతి తక్కువ విలువ ఉంటుంది.
 
అలాగే మరికొన్ని సందర్భాల్లో జరిగే తిరుగుసేతలు కూడా ఈ నియమం పరిధిలోకి రావు:
 
* పేజీలో కంటెంటును పూర్తిగా తొలగించి వెల్ల వెయ్యడం వంటి '''[[వికీపీడియా:దుశ్చర్య#దుశ్చర్యల్లో రకాలు|స్పష్టంగా తెలిసిపోతూ ఉండే దుశ్చర్యలను]]''' తొలగించే సందర్భాల్లో చేసే తిరుగుసేతలు ఈ నియమం పరిధిలోకి రావు. అయితే, దుశ్చర్య చూడగానే ఎవరికైనా స్పష్టంగా తెలిసిపోయే సందర్భాల్లో ''మాత్రమే'' ఈ మినహాయింపు వర్తిస్తుంది.
* స్పష్టమైన [[వికీపీడియా:కాపీహక్కు ఉల్లంఘనలు|కాపీహక్కు ఉల్లంఘనలు]] జరిగినపుడు చేసే తిరుగుసేతలు;
* జీవించి ఉన్నవారి గురించి రాసిన వ్యాసాల్లో సరైన ఆధారాలు లేని, వివాదాస్పద విషయాల తిరుగుసేతలు;
దుశ్చర్యలు గానీ, కాపీహక్కులు గల టెక్స్టును పదే పదే చేర్చడం గానీ జరిగితే తిరుగుసేతల కంటే సభ్యులను నిరోధించడం, పేజీని సంరక్షించడం వంటివి మెరుగైన చర్యలు.
 
== అమలు ==
మూడు తిరుగుసేతల నియమాన్ని ఉల్లంఘించే సభ్యులను 24 గంటల వరకు, పదే పదే జరిగినపుడు అంతకంటే ఎక్కువ కాలం పాటు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధించవచ్చు]]. సభ్యునిపై నిరోధాలు పెరిగే కొద్దీ నిరోధ కాలం పెంచుతూ పోతారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఈ నియమాన్ని ఉల్లంఘించినపుడు, నిర్వాహకులు అందరితోటీ ఒకే విధంగా వ్యవహరించాలి.
 
* తమ ప్రవర్తనతో సాటి వారికి ఉదాహరణగా నిలవడం ద్వారా
 
== నేను మూడు తిరుగుసేతల నియమాన్ని అతిక్రమించాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ==
పొరపాటున మీరీ నియమాన్ని అతిక్రమించి, తరువాత గ్రహించారనుకోండి, లేదా మరొకరు చూసి చెప్పాక గ్రహించారనుకోండి - అప్పుడు మీరు చేసిన తిరుగుసేతను మళ్ళీ పూర్వపు కూర్పుకు తీసుకెళ్ళాలి. మామూలుగా అయితే మీమీద నిరోధం పడగూడదు, అయితే ఖచ్చితంగా తప్పించుకున్నట్టే అని చెప్పలేం.
 
వ్యాసం మీరనుకున్న పద్ధతిలోనే ఉండాలని అనుకుంటున్నది మీరొక్కరే అయితే, దాన్ని మిగతా వాళ్ళనుకున్న పద్ధతిలో ఉండనిస్తేనే మేలు.
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం]]
* [[వికీపీడియా:నిరోధ విధానం]]
 
[[వర్గం:వికీపీడియా సభ్యుల నడవడి]]
 
[[en:Wikipedia:Edit warwarring#The Three three-revert rule]]
[[ml:വിക്കിപീഡിയ:മൂന്നു മുന്‍പ്രാപന നിയമം]]
[[ar:ويكيبيديا:قاعدة الثلاثة استرجاعات]]
[[fa:ویکی‌پدیا:قانون سه برگردان]]
[[fr:Wikipédia:Règle des trois révocations]]
[[glk:Wikipedia:سه دفأ واگردؤنئن]]
[[he:ויקיפדיה:חוק שלושת השחזורים]]
[[hu:Wikipédia:A három visszaállítás szabálya]]
22,026

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/475874" నుండి వెలికితీశారు