భూగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: new:भूगोल
చి యంత్రము కలుపుతున్నది: pcd:Jéografie; cosmetic changes
పంక్తి 10:
* 110 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒకే ఒక మహా ఖంఢము ఉండినది. దానిని రొదీనియా (''rodinia'') అని పిలుస్తాము.
* సుమారు 75 కోట్ల సంవత్సరాల క్రితం రొదీనియా రెండు ముక్కలై మధ్యలో పాంథలాస్సిక్ మహాసముద్రము (''Panthalassic Ocean'') ఆవిర్భవించింది.
* [[ఉత్తర అమెరికా]] హిమ పూరితమైన [[దక్షిణ ధృవము]] వైపు పయనించింది. [[అంటార్కటికా]],[[ఆస్ట్రేలియా]],'''భారతదేశం''',అరేబియా మరియు భావ్య కాలమున చైనాగా మారు ఖంఢ భాగాలతోనున్న రోదినియా యొక్క ఉత్తర సగ భాఘము ప్రతి గడియారపు దిక్కులో తిరిగి ఉత్తర దృవమునకేగినది.
* రొదినియా యొక్క రెండు భాగాల మధ్య ఉత్తర-మాద్యమ ఆఫ్రికచే నిర్మితమైన కాంగో క్రేటను (''Congo Craton'') మహాఖంఢము ఉండినది.55 కోట్ల సంవత్సరాల క్రితం రొదినియా రెండు సగ భాగములు కాంగో క్రేటనుతో సహా కలసి పనోషియా ([[Panotia]]) అను క్రొత్త మహాఖంఢముగా ఆవిర్భవించెను. పూర్వ కేంబ్రియన్ కాలపు జీవ లక్షణముల కల్పిత అంచనాల చార్టు. [http://www.scotese.com/images/precamb_events.jpg పూర్వ-కేంబ్రియన్ ఘటనలు].
=== కాంబ్రియన్ ===
పంక్తి 16:
* ప్రాచీన ఖంఢాలైన లోరెన్షియా (Laurentia), బాల్టికా (Baltica) మరియు సైబేరియా మధ్య ఐయాపెటస్ (Iapetus) మహాసంద్రము ఉద్భవించినది.
* పాన్ ఆఫ్రికా(Pan-African) పర్వతాకార ఆవిరభం జరిగినప్పడు సమూహమైన గొండ్వానా (gondwana) మహాఖండము నాడీమండలము నుండి దక్షిణ ధృవము వరకు విస్తరించుకొని ఆ కాలపు అతి పెద్ద మహాఖండమైనది.
* అర్డోవిషియన్ (ordovician) శకములో గొండ్వానా యొక్క నాడీమండల ప్రాంతాలైన ఆస్ట్రేలియా,భారతదేశము,చైనా మరియు అన్టార్కటికా ప్రదేశాలలో వెచ్చని నీటి బంధకములు అనగా సున్నపురాయి మరియు ఉప్పు దొరికినవి. అదలా ఉండగా గొండ్వానా (gondwana) దక్షిణ ధృవ ప్రాతాలైన ఆఫ్రిక మరియు దక్షిణ అమెరికాలలో మంచు మరియు ఐసుకు సంభందంచిన పథార్థాలు దొరికినవి.
=== సిలురీన్ ===
* 40 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోజోయిక్ శకం మధ్యలో లోరెన్షియా మరియు బాల్టికా ఖండములు కలుస్తూ ఐయాపిటస్ మహాసముద్రమును మూసివేసినవి.
* ఈ మహాఖండముల సంఘట్టనము వలన అక్కడ అంచున ఉన్న ద్వీప వాలువంపులు ఒక దాని మీద ఒకటిగా ఏర్పడినవి, తద్వారా కాలెడొనైడ్ (Caledonide) పర్వతాలు స్కాండినేవియా (Scandinavia)లో, ఉత్తర మహా బ్రిటన్,గ్రీన్లాండ్,మరియు ఉత్తర అమెరికా యొక్క తూర్పు సముద్రపు ప్రాంతాలలో ఉత్తర అప్లాచియన్ ([[Appalachian]]) పర్వతాలు ఏర్పడినవి.
* బహుశా పాలియోజోయిక్ శకం మధ్యలో, ఉత్తర దక్షిణ ఛైనా గొండ్వానా యొక్క ఇండో-ఆస్ట్రేలియన్ అంచును విదిలి, పాలియో-తెథిస్ (''paleo-tethys'') మహాసముద్రము మీదగా ఉత్తర దిశకు ఏగినది. పాలియోజోయిక్ శకము ఆరంభము మొదలుగొని మధ్య వరకు, ఉత్తర అర్ధగోళములో ఎక్కువ శాతం పాంథలాస్సిక్ మహాసముద్రము విస్తరించి ఉండినది.
* ఈ మహాసముద్రమును చుడుతూ, రెండు భూతల పొరలు ఒక మధ్య పొరపై ఆధారడుతూ ఇప్పటి పసిఫిక్ మహాసముద్రమును చుట్టిన "రింగ్-ఆఫ్-ఫైర్" పద్ధతిని అనుకరించు రీతిలో ఉండినది. [http://www.scotese.com/images/425.jpg మధ్య సిలూరియన్ 42.5 కోట్ల సం.కృ]
 
=== కార్బోనిఫెరస్ ===
* 39 కోట్ల సంవత్సరాల క్రితం డెవోనియన్ (Devonian) శకారంభమైనది. ఈ శక ప్రారంభంలో పాలియోజోయిక్ నాటి మహాసముద్రాలు మూసుకు పోతూ పూర్వ పాంజియా తయారవటం మొదలైనది. ఈ శకం ప్రముఖముగా చేపలు జీవించిన కాలం.
* డెవోనియన్ ప్రారంభ దశలో చేపల దవడలు క్రమేణ వృద్ధి చెంది, శకాంతము వచ్చు సమయానికి చేపలు వేటాడు జీవులలో ఉత్తమ శ్రేణి లోకి చేరెను. మొక్కలు భూమిని విస్తరించుకొని మొట్ఠమొదటి బొగ్గు బంధకములు ఎండ మెండుగా మండే పర్రలతో (swamps) కనడియన్ ఆర్కటిక్ ద్వీపాలు, ఉత్తర గ్రీన్ లాండ్, మరియు స్కాన్డినావియాలను కప్పి వేసినవి.ఆర్కటిక్ కెనడాలోని నాడీమండల ప్రదేశాలలో మొదటిసారిగా అడవులు పెరిగినవి.
* పాలియోజోయిక్ శకాంతములో, పన్నోషియా విభజన జరిగినప్పుడు తెరుచుకున్న అనేక మహాసముద్రములు మూసుకుపోయినవి. నాడీమండలము మధ్యగా ఉండి పాంజియా (Pangea) దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవం వరకు విస్తరించుకుని ఉండినది. దీనికి తూర్పు ప్రక్క పాలియో-తెథిస్ మహాసముద్రము పశ్చిమము వైపు పాంథలాస్సిక్ మహాసముద్రము ఆనుకొని ఉండినవి.
[[ఫైలు:Pangio continent.jpg|right|thumb|250px|పేంజియా మహాఖండము]]
[[ఫైలు:Laurasia-Gondwana.png|right|thumb|250px|ట్రైయాస్సిక్ శకములో భూగోళము]]
* కార్బోనిఫెరస్(Carboni-ferous) శకాంతము అగు సమయము పర్మియన్ (Permian) శకారంభంలో పేంజియా యొక్క దక్షిణ భాగములు (దక్షిణ 'దక్షిణ అమెరికా', దక్షిణ ఆఫ్రికా, అంటార్కటికా, భరత ఖండము, దక్షిణ భరత ఖండము మరియు ఆస్ట్రేలియా) హిమపూరిత ప్రదేశాలుగా మారినవి.
* కార్బోనిఫెరస్ (Carboniferous) శకాంతములో నడీమండలము నడికట్టున మధ్య పేంజియా పర్వతములు బొగ్గు గనులకు కేంద్రమై ఉండెను.
 
=== పర్మియన్ ===
* పర్మియన్ శకమధ్య దశలొ మధ్యమ పేంజియా పర్వతములు ఉత్తర దిశగా కదిలి పొడి ప్రదేశముల వైపు జరుగుతూ తేమభరితమైన నాడీమండల గాలికి అడ్డు నిలిచి ఉత్తర అమెరికా ఉత్తర యూరోప్ ఆంతర్య ప్రదేశములు ఎడారి మాదిరిగా తయారగుటకు హేతువైనది.
* పేంజియా అనగా "సర్వమైన ప్రదేశము", పేంజియాను మనము మహామహాఖండముగా గుర్తించినను, అది ఆ కాలపు అన్ని ఖండములతో నిండినది కాదు.పూర్వార్ధ గోళములో పాలియో-తెథిస్ మహాసముద్రపు ఇరువైపుల కొన్ని ఖండములు దీని నుండి వేరుగా ఉండినవి.
* ఈ ఖండములలో ఉత్తర దక్షిణ చైనా మరియు కారు యొక్క 'windshield wiper' అనగా అద్దము శుభ్రపరుచు చువ్వ ఆకారములో సిమ్మీరియా (cimmeria) మహాఖండము ఉండినవి.
* టర్కీ,ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్,టిబెట్,ఇండో-చైనా మరియు మలయ భాగాలతో నిండిన సిమ్మీరియా కార్బోనిఫెరస్ శకాంతములో గోండ్వానా యొక్క ఇండో-ఆస్త్రేలియన్ అంచునుండి కదిలి పోయింది .
* ట్రైయాస్సిక్ (Triassic) శకాంతములో సిమ్మీరియా చైనా ఖండంతో కలసి ఉత్తర దిశగా యూరేశియా వైపు జరిగి సైబీరియా దక్షిణ అంచుతో సంఘటించెను. ఈ సంఘటణ తరువాతనే ప్రపంచములోని అన్ని ఖండములు కలసి పేంజియా అను మహామహాఖంఢముగా పిలువబడినవి. [http://www.scotese.com/images/342.jpg కార్బోనిఫెరస్ శకారంభం 35 కోట్ల సం.క్రితం].
 
=== ట్రైయాస్సిక్ మరియు జురాస్సిక్ ===
* పేంజియా మహాఖండము ఆవిర్భవించటానికి హేతువైన ఖండముల సంఘట్టనములు డెవోనియన్ శకమునుండి ట్రైయాస్సిక్ శకాంతము వరకు కొనసాగినవి.
పేంజియా ఒక్కసారిగా ముక్కలుగా చీలలేదు, దాని చీలిక మూడు ముఖ్య ఉపాఖ్యానములుగా నడిచినది.
* మొదటి చీలిక ఉపాఖ్యానము 18 కోట్ల సం.క్రి. మధ్య జురాస్సిక్ (Jurassic)లో మొదలైనది. ఉత్తర అమెరికా తూర్పు కోస్తా ప్రాంతాలలో మరియు ఆఫ్రికా ఉత్తర-పశ్ఛిమ ప్రాంతాలలో జరిగిన అగ్నిమయమైన చురుకు చర్యల తరువాత ఉత్తర అమేరిక ఉత్తర-పశ్ఛిమ దిశలో కదులుతూ మధ్యమ అట్లాంటిక్ మహాసముద్రమును తెరిచినది. అదే సమయములో ఆఫ్రికా అవతల ప్రక్కన తూర్పు ఆఫ్రికా అంచులలో, అంటార్కటికాలో, మడగాస్కర్లో భీకరముగా జ్వాలాముఖులు పేలి భారత మహాసముద్ర ఆవిర్భవించుటకు సూచకమైనవి.
*# మెసోజోయిక్(Mesozoic) కాలమునందు ఉత్తర అమెరికా మరియు యూరేసియా కలసి లౌరేసియా అను భాగముగా పిలువబడినవి. క్రమేణా మధ్య అట్లాంటిక్ తెరుచుకోవటంవలన లౌరేసియా గడియార దిశలో తిరిగి ఉత్తర అమెరికాను ఉత్తరమునకు, యూరేసియా దక్షిణమునకు పంపివేసినది.
*# జురాస్సిక్ శకాంతములో ఆసియా తేమ భరిత ప్రదేశములనుండి పొడి ప్రదేశాలకు కదలడంతో, బొగ్గు గనులతో సంపన్నమైన పూర్వ ఆసియా ఎడారులతో, ఉప్పు బంధకములతో నిండిపోయింది. లౌరేసియా కదలికలవల్ల గోండ్వానాకు లౌరేసియాకు మధ్యనున్న తెథిస్ మహాసముద్రము మూసుకుపోయినది.
పంక్తి 63:
=== ఆఖరి మంచు శఖము ===
* సముద్ర మట్టం తక్కువున్నప్పుడు భూఖండాలు అత్యావశ్యకమై,భూచరాలు క్రమముగా పెరిగి,ఖండాల మథ్య వలస దారులు తెరుచుకొని,వాతావరణం చాలా ఋతుపక్షంగా ఉంటుంది,ముఖ్యంగా ప్రపంచ వాతావరణం చల్లబడుతుంది.దీనికి కారణం భూమి సూర్యుని శక్తిని ఆకాశములోకి తిప్పి వెనుకకి పంపివేసేది,కాని సముద్రాలు ఆ శక్తిని పీల్చుకొనేవి.
* అంతేగాక భూభాగాల మీద తెల్లటి శాశ్వతమైన మంచు రేకులు పెరిగి మరింత శక్తిని ఆకాశంలోకి తిప్పి పంపివేస్తాయి.ఖండాల మీద మంచు తయారవటం వలన సముద్ర మట్టం ఇంకా తగ్గి భూభాగాలు పెరిగి,భూమిని చల్లగా చేసి,మరింత మంచు తయారవుతోంది,ఇలా కొనసాగుతూనే ఉంటుంది.
* ఇక్కడి సారాశం ఏమిటంటే: ఒక్కసారి భూమి చల్లబడటం(లేదా వేడెక్కట్టం) మొదలైతే నిశ్చయమైన బిస భూమి వాతావరణ సిద్ధాంతమును మరింత చల్లగా(లేదా వేడిగా) మార్చేస్తాయి.సెనోజోయిక్ శకాంతంలో భూమి చల్లబడటం మొదలైనది.మంచు రేకులు మొదట అంటార్క్టికాలో తయారై ఉత్తర అర్ధగోళమునకు వ్యాపించ సాగింది.గత 50 లక్షల సంవత్సరాలగా భూమి ఒక పెద్ద మంచు శకంలో ఉంది.ఇంత చల్లగా ఉండటం భూమి చరిత్రలో చాలా కొద్ది సార్లు మాత్రమే జరిగింది.
 
=== ప్రస్తుతం భూమి ===
పంక్తి 77:
 
== బయటి లింకులు ==
{{Link FA|lmo}}
{{Link FA|sl}}
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
 
{{Link FA|lmo}}
{{Link FA|sl}}
 
[[en:Geography]]
Line 205 ⟶ 206:
[[os:Географи]]
[[pam:Geografia]]
[[pcd:Jéografie]]
[[pl:Geografia]]
[[pnt:Γεωγραφίαν]]
"https://te.wikipedia.org/wiki/భూగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు