తెలుగువారు పలికే ఉర్దూ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు''' :
 
[[తెలుగు]] ప్రజల మాటల్లో ఎన్నో [[సంస్కృతం|సంస్కృత]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] [[పర్షియన్ భాష|పార్శీ భాష]]ల పదాలు దర్శనమిస్తుంటాయి. ఈ అన్య దేశ్య పదాలను తెలుగు తనలో దాదాపు పూర్తిగా కలుపుకొని సుసంపన్నమయ్యింది. పరభాషా దురభిమానము, మొండితనములేని సరళమైన భాష తెలుగు. తెలుగువారి కున్నంత పరభాషా సహనం, ఈ దేశంలో మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సహనం వలనే అనేక పరభాషా పదాలు తెలుగులోకివచ్చి స్థిరపడి దాని స్వంతమే అన్నట్లయిపోయాయి. సంస్కృత, ఆంగ్ల పదాలు మన అనుదిన జీవితంలో ఎన్నోవాడుతున్నాము. అవి మనకు తెలిసినవే. అయితే మనం రోజూ మాట్లాడే తెలుగులో దొర్లే కొన్ని పదాలు ఉర్దూ పదాలని మనకు తెలియదు.గత 700 సంవత్సరాలుగా ఉర్దూపదాలు తెలుగులో విఱివిగా వాడబడుతున్నాయి. శ్రీనాథుడు కూడా ఉర్దూపదజాలాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణదేవరాయలకు తెలిసిన భాషల్లో ఉర్దూ ఒకటని చరిత్రల ద్వారా తెలియవస్తున్నది. ఉర్దూపదాల ప్రత్యేకత ఏమంటే అవి ఉన్నతెలుగుపదాల్ని చంపేసి పాదుకున్నవి కావు. తెలుగులో నిజంగా లేని వ్యక్తీకరణల్నే అవి అందించాయి. ఆ విధంగా అవి కొన్ని అభివ్యక్తి-శూన్యాల్ని సముచితంగా భర్తీ చేశాయి.
 
==తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో [[సి.పి.బ్రౌన్]]‌ పేర్కొన్న ఉర్దూ పదాలు==