"గౌతమిపుత్ర శాతకర్ణి" కూర్పుల మధ్య తేడాలు

చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ഗൗതമിപുത്ര ശതകർണി)
== వ్యక్తిత్వం ==
గౌతమీపుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైంది. ఈయన మూర్తి ఉన్న నాణేలనుబట్టి ఈయన ధృడకాయుడని, స్ఫురద్రూపియని తెలుస్తున్నది. పరవార విక్రముడు, శత్రుభయంకరుడు, సమరశిరసివిజితరిపుసంఘాతకుడు, ఉదార పాలకుడు, పౌరజన సుఖదు:ఖాలలో భాగస్వామి, వైదికవిద్యాతత్పరుడు, ఆగమనిలయుడు, వర్ణసాంకర్యాన్ని ఆపినవాడు, విద్వద్బ్రాహ్మణ కుటుంబాలను పోషించినవాడు, పరమధార్మికుడు, ధర్మార్థకామ పురుషార్థాలపట్ల శ్రద్ధ వహించినవాడు, ఏకబ్రాహ్మణుడని కీర్తిపొందినాడని ఆయన తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి వల్ల తెలుస్తున్నది. ఇందులో ఉన్న అంశాలు కొన్ని అతిశయోక్తులుగా అనిపించవచ్చు. తల్లి బాలశ్రీ దృష్టిలో పురాణపురుషునితో సమానుడైనా బ్రాహ్మణులను పోషించాడనడానికిగానీ, వర్ణసాంకర్యం మాన్పిన నిదర్శనాలు గానీ లేవు. గౌతమీపుత్ర శాతకర్ణి రాజకీయ కారణాల వల్ల పరమత సహిష్ణుత ప్రదర్శించి బౌద్ధులకు సైతం ధానధర్మాలు చేసాడు.
గౌతమీ పుత్రుని బిరుదులు:
వినివర్తిత ఛాతుర్వర్న సన్కర
ఆగమనిలయ
త్రిసముద్రతొయపీతవాహన
సర్వమన్దల వాదిత
 
 
{| align="center" cellpadding="2" border="2"
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/492411" నుండి వెలికితీశారు