ముహమ్మద్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 117.204.67.12 (చర్చ) చేసిన మార్పులను, TXiKiBoT వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 1:
[[ఫైలు:Aziz efendi-muhammad alayhi s-salam.jpg|thumb|right|[[ఇస్లామీయ లిపీ కళాకృతులు]] లో ''ముహమ్మద్'' పేరు. కళాకారుడు 'హత్తాత్ అజీజ్ ఎఫెందీ'.<ref>Muhittin Serin: ''Hattat Aziz Efendi'', Istanbul (1988, 1999), ISBN 975-7663-03-4, {{OCLC|51718704}}</ref>]]
'''ముహమ్మద్‌''' {{ఆడియో|Ar-muhammad.ogg|విను}} ([[అరబ్బీ భాష|అరబిక్]] : محمد), (''మొహమ్మద్‌'', ''మహమ్మద్'' అని కూడా పలకవచ్చు), [[అరబ్ ప్రజలు|అరబ్బుల]] మత మరియు రాజకీయ నాయకుడు మరియు [[ఇస్లాం]] యొక్క చివరి [[ప్రవక్తలు|ప్రవక్త]]. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర [[ఆదమ్]] ప్రవక్తతో ప్రారంభమయినది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివారు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందస్తుగా [[మూసా|మోజెస్]] మరియు [[యేసు]] యొక్క బోధనలు ఉన్నవి. ముస్లిమేతరులు సాధారణముగా ఇతనిని [[ఇస్లాం]]మత స్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం మతం ప్రారంభమయినది ఆదిపురుషుడయిన [[ఆదమ్]] ప్రవక్తతో. సాంప్రదాయిక ముస్లిం జీవితకర్తల ప్రకారము c.[[570]] [[మక్కా]]లో జన్మించాడు మరియు [[జూన్‌ 8]], [[632]] లో [[మదీనా]]లో మరణించాడు. మక్కా మరియు మదీనా నగరములు రెండూ [[అరేబియన్‌ ద్వీపకల్పము]]లో కలవు.
 
== పేరు ==
 
[[ఖురాన్]] లో " ముహమ్మద్ " అని వ్రాయబడినది.
ముహమ్మద్ అనే పదానికి మూలం [[అరబ్బీ భాష|అరబ్బీ]] పదం "హమ్ద్" (హ మ్ ద్), అర్థం: "శ్లాఘన" లేదా "కీర్తించుట". ఈ "హమ్ద్" అనే పదానికి Prefix 'ము' (మ్ ఉ) చేర్చిన "ము హ మ్ మద్" ('మ్' ను వత్తి పలికి) అగును. అర్థం "శ్లాఘించబడినవాడు" లేదా "కీర్తించబడిన వాడు". ఈ పేరును, ముహమ్మద్, మొహమ్మద్, మహమ్మద్, మరియు మహమ్మదు (తెలుగులో సాధారణంగా నకారం పొల్లు వచ్చినచో, దానిని 'కొమ్ము' చేరుస్తారు.) వ్రాస్తారు. అరబ్బీ లో సరియైన గ్రాంధిక పదము 'ముహమ్మద్'. వ్యావహారికంలో 'మొహమ్మద్' అని కూడా పలుకుతారు. అరబ్బీ, ఉర్దూ భాషేతరులూ, ఈ పేరును 'మహమ్మద్' అని పలకడం వ్యావహారికంగా సాధారణం. [[టర్కీ]] వాసులు ముహమ్మద్ ను ''Mahmet'' (మహ్మెట్ లేదా మహమెట్) అని, అహ్మద్ ను Ahmet అనీ పలుకుతారు. ఇది మధ్య యూరప్ లో ఉచ్ఛారణా శైలి. English Wikipedia లోని "Muhammad" వ్యాసంలో " Names and appellations in the Quran " చూడండి.
 
== సారాంశము ==
 
ముహమ్మద్‌ విస్తృతముగా ప్రయాణించిన వర్తకుడు. తొలి ముస్లిం మూల నివేదికల ప్రకారము [[611]] లో, 40 ఏళ్ళ వయసులో [[మక్కా]] కు సమీపములోని [[హిరా గుహ]] లో ధ్యానము చేయుచుండగా, దివ్య దృష్టిని పొందాడు. తరువాత తన అనుభూతిని సమీప వ్యక్తులకు వర్ణిస్తూ [[మలాయిక|దేవదూత]] [[జిబ్రయీల్]], తనకు కనిపించి [[ఖురాన్]] ప్రవచనాలను గుర్తుపెట్టుకొని ఇతరులకు బోధించమని [[అల్లాహ్]] ఆదేసించినాడని చెప్పాడు. తదనంతరం తన విద్యుక్తధర్మాన్ని మతపర కర్తవ్యాన్ని వ్యాప్తి చేస్తూ, దైవ సందేశాలను ప్రజలకు ఉపదేశిస్తూ, కఠోర [[ఏకేశ్వరోపాసన]], [[విగ్రహారాధన]] విడనాడడం, [[ప్రళయదినం]] పై విశ్వాసం, విశ్వాసుల ప్రథమకర్తవ్యమని బోధించాడు. అతను [[అరబ్ ప్రజలు|అరబ్బు]]లకు తెలిసిన ఇతర రెండూ ఏకేశ్వరోపాసక మతములు [[జుడాయిజం|జుడాయిజము]] (యూదమతము) ను కానీ [[క్రైస్తవ మతము]]ను గానీ పూర్తిగా తిరస్కరించలేదు; [[ఇబ్రాహీం]] ప్రవక్త అవలంబించిన ఈ మతముల చివరి మెట్టైన [[ఇస్లాం]] మతమును ప్రకటిస్తున్నానని చాటెను. అతి తక్కువ సమయంలోనే అనేకుల విశ్వాసం పొందిననూ విగ్రహారాధనావలంబీకులైన అరబ్ తెగల ద్వేషాన్ని తప్పించుకొనుటకు, తాత్కాలికంగా [[622]]లో [[హిజ్రత్|మక్కా నుండి వలసపోయి]] తన సహచరులతో కలసి ''యస్రిబ్‌'' (ఇప్పుడు [[మదీనా]]అని పిలవబడే) లో స్థిరపడినాడు. ఇక్కడ ఆయన తొలి ముస్లిం సముదాయము స్థాపించి దానికి నాయకుడయ్యెను. తరువాత [[ఖురేషులు]] (అరబ్బు జాతి తెగ) మరియు మదీనాకు చెందిన విశ్వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో మహమ్మద్‌ మరియు అతని అనుచరులు విజయం సాధించారు. ఈ పోరాటములో సంపాదించిన యుద్ధ ప్రావీణ్యాణ్ణి ఇతర [[అరేబియా]] పాగాన్ తెగలను జయించడానికి ఉపయోగించారు. మహమ్మద్‌ చనిపోయే నాటికి అరేబియా ద్వీపకల్పమును సమైక్యము చేసి ఉత్తరమున సిరియా మరియు పాలస్తీనా ప్రాంతములలో ఇస్లాంను వ్యాపింపజేశాడు.
 
ముహమ్మద్‌ తర్వాత వచ్చిన [[ఖలీఫా]]ల నేతృత్వములో ఇస్లామీయ సామ్రాజ్యము [[పాలస్తీనా]], [[సిరియా]], [[ఇరాక్]] [[(మెసపొటేమియా)]], [[ఇరాన్]], [[ఈజిప్టు]], [[ఉత్తర ఆఫ్రికా]], మరియు [[స్పెయిన్]] లకు వ్యాపించినది. ఈయన తరువాత జరిగిన దండయాత్రలు, ముస్లింలు మరియు ముస్లిమేతరుల మధ్య వర్తక సంబంధాలు, మతప్రచారణా కార్యకలాపాలు మహమ్మద్ ప్రవచించిన మతాన్ని భూమి నలుమూలలా వ్యాప్తి చెందడానికి దోహదపడ్డాయి.
 
== ముహమ్మద్ (స అ సం) గురించి మనకెలా తెలిసినది? ==
 
ముహమ్మద్ జీవితాన్ని గురించి మనం ఉన్న వనరులలో [[ఖురాన్]], [[సీరా|సీరత్]] జీవితచరిత్రలు మరియు [[హదీసులు|హదీస్]] సేకరణలు ముఖ్యమైనవి. ఖురాన్ ముహమ్మద్ జీవితచరిత్ర కానపట్టికీ ఇందులో కొంతసమాచారము ఈయన జీవితం గురించి తెలుపుతుంది. ఇప్పటివరకు లభ్యమైన జీవిత చరిత్రలలో [[ఇబ్నె ఇస్ హాఖ్]] (మ.[[768]]) రచించిన, [[ఇబ్నె హిషాం]] (మ.[[833]]) చే కూర్చబడిన ''దైవప్రవక్త యొక్క జీవితం'', మరియు [[అల్-వఖీదీ]](మ. [[822]]) రచించిన ''ముహమ్మద్ జీవితచరిత్ర'' అత్యంత పురాతన మైనవి. ఇబ్నె ఇస్ హాక్ ముహమ్మద్ మరణించిన 120 నుండి 130 సంవత్సరాల తర్వాత జీవితచరిత్రను రచించాడు. ఇక మూడవ వనరైన హదీసుల సేకరణలు ఖురాన్ లాగే ఆయన జీవితచరిత్ర కాదు కానీ అందులో ముహమ్మద్ మరియు ఆయన శిష్యుల మాటలు, చేసిన పనులను గురించిన కథనాలు ఉన్నాయి.
 
కొంతమంది <!-- skeptical -->పండితులు ([[ఇగ్నాజ్ గోల్డ్ జిహర్|గోల్డ్ జిహర్]], ష్కాట్, [[జాన్ వాన్స్ బరో|వాన్స్ బరో]], కుక్, [[పెట్రీషియా క్రోనే|క్రోనే]], రిప్పిన్, బెర్గ్ తదితరులు) ఈ మూలాలు, ముఖ్యంగా హదీసుల సేకరణల యొక్క నిబద్ధత గురించి సందేహాలు లేవనెత్తారు. మౌఖిక సాంప్రదాయాలు సేకరించేనాటికే ముస్లిం సమాజము అనేక పరస్పరవిరుద్ధ తెగలు, సాంప్రదాయ శాఖలుగా ముక్కలైనదని; ముహమ్మద్ మరియు అతని అనుచరులు ఏమి చెప్పారు? ఏమి చేశారు అన్న విషయాలపై ప్రతి తెగకు లేదా శాఖకు తమదైన సొంత, కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన సాంప్రదాయాలు ఉన్నాయని వీరి వాదన. ఈ సంప్రాదాయాలు రానురాను పెరిగిపోయినాయి. సాంప్రదాయ ముస్లిం పండితులు వారు ఉబుసుపోక కథలుగా భావించిన వాటిని ఏరివేయటానికి కఠోరకృషి చేశారు. సాంప్రదాయవాదులు ఈ ముస్లిం పండితుల కృషిపై ఆధారపడతున్నారు కానీ విమర్శకులు ఈ సమస్యను ఆధునిక పద్ధతులతో తిరిగి పరిష్కరించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు.
 
హదిత్ ([[హదీసులు|హదీసుల]]) సేకరణలలో ముహమ్మద్ జీవితానికి సంబంధించి అనేక అప్రామాణికమైన సాంప్రదాయాలు<!--inauthentic traditions--> ముస్లిం మరియు ముస్లిమేతర పండితులందరూ ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. (ముస్లిం పండితగణము ఈ సాంప్రదాయాలలో చాలా మటుకు ప్రామాణికము కావనీ, కేవలం కొన్ని హదీస్ సేకరణలు మాత్రమే ''సహీ'' లేదా నమ్మదగివని ఒప్పుకుంటారు). "ఖురాను మాత్రమే ముస్లింలు"<!--"[[Quran Alone]] Muslims"--> అనే ఒక అల్పసంఖ్యాక వర్గము హదిత్ మొత్తం నమ్మదగినద కాదని భావిస్తారు.
అయితే పై సారాంశపు విభాగములో ఉన్న ముహమ్మద్ యొక్క చారిత్రక మరియు జీవిత విశేషాలు మాత్రం సాధారణంగా అందరూ అంగీకరిస్తారు. ముస్లిం మరియు ముస్లిమేతర సాంప్రదాయ వాదులు మాత్రము ముహమ్మద్ యొక్క జీవిత విశేషాలను మరింత వివరణాత్మకముగా ఈ క్రింద విధముగా వర్ణిస్తారు.
 
== సీరా ([[సీరత్]]) ప్రకారము ముహమ్మద్ జీవితము ==
=== ముహమ్మద్ వంశము ===
Line 19 ⟶ 29:
* [[ఇబ్రాహీమ్]] నుండి ముహమ్మదు వరకు
ఇబ్రాహీమ్ + [[హాజరా]] - [[ఇస్మాయిల్]] - కేదారు - అద్నాను - ఖుసై -అబ్దుల్ మునాఫ్ - [[అబ్దుల్ ముత్తలిబ్]] - [[అబ్దుల్లా (ముహమ్మద్ ప్రవక్త తండ్రి)|అబ్దుల్లా]] - ముహమ్మద్.
 
=== బాల్యం ===
[[మక్కా]] లోని ఒక సంపన్నమైన ఇంట్లో జన్మించాడు. ఇతని జన్మ తారీఖు [[20 ఏప్రిల్]], [[570]], [[షియా ముస్లిం|షియాల]] ప్రకారం [[26 ఏప్రిల్]], ఇతరత్రా [[571]] అని భావిస్తారు. సాంప్రదాయాల ప్రకారం "ఏనుగు యొక్క సంవత్సరం" ఈ సంవత్సరమే జరిగినది. [[మహమ్మదు ప్రవక్త]] పుట్టకమునుపే తండ్రి అబ్దుల్లా కళ్ళు మూసాడు, తన తాతయైన [[అబ్దుల్ ముత్తలిబ్]] (ఖురైష్ తెగల నాయకుడు), వద్ద పెరుగుతాడు. బెదూయిన్ దాయి అనటువంటి [[హలీమా]] వద్ద పాలపోషణ జరుగుతుంది. 6 సంవత్సరాల వయసులో తల్లి [[ఆమినా]] పరమదిస్తుంది. 8 సంవత్సరాల వయస్సులో తాత అబ్దుల్ ముత్తలిబ్ మరణిస్తాడు. తన పినతండ్రి, [[హాషిమ్ కుటుంబం|హాషిమ్ కుటుంబ]] నాయకుడైన [[అబూ తాలిబ్]] (మక్కాలో శక్తిమంతమైనవాడు) వద్ద పెరుగుతాడు.
 
మక్కా అరేబియాలోనే ప్రముఖ వాణిజ్యకేంద్రం. [[కాబా]] గృహం కలిగివున్నందున ధార్మికపరంగాకూడా ప్రముఖక్షేత్రం. పుణ్యక్షేత్రదర్శనాకాలంలో దూరప్రాంతాలనుండి ధర్మపారాయణులూ, వర్తకులూ తరచూ మక్కాను సందర్శిస్తూవుండేవారు. అన్నిరంగాల్లోను [[మక్కా]] విరాజిల్లుతూయుండేది.
 
యుక్త వయస్సులో ముహమ్మద్ తన పినతండ్రితో వాణిజ్య ప్రయాణాలెన్నో చేశారు. 'షామ్' ([[సిరియా]]) వరకూ ప్రయాణాలు చేశారు. అంతర్జాతీయ వ్యాపారాలు, ప్రయాణాలను బాగా ఔపోసనపట్టారు.
 
=== మధ్య కాలం ===
 
[[ఖదీజా]] మక్కానగరానికి చెందిన సంపన్నురాలు విధవ, 40 సంవత్సరాలవయస్సు, ఈమెదగ్గర వర్తకసామాగ్రితీసుకొని చాలామంది వర్తకాలు చేసేవారు, ప్రముఖంగా దుస్తులవ్యాపారం, మహమ్మదు ప్రవక్తకూడా ఈమెదగ్గర దుస్తులు గైకొని అమ్మేవారు. మహమ్మదు ప్రవక్త వయస్సు 25 సంవత్సరాలు, మహమ్మదు ప్రవక్త గుణగణాలు తెలుసుకొని ఖదీజా (ఖతీజా) పెళ్ళిప్రస్తావన [[595]] తీసుకురాగా ముహమ్మదు ప్రవక్త అందుకు అంగీకరించారు.
ఇబ్న్ ఇస్ హాఖ్ ఈ విధంగా రాశాడు: మహమ్మదు ప్రవక్త మరియు ఖదీజాల సంతానం ఐదుగురు, అందులో ఒక కుమారుడు నలుగురు కుమార్తెలు. వీరందరూ ముహమ్మదు [[ఇస్లాం]] గురించి ప్రకటనకు మునుపు పుట్టారు. కుమారుడు ''ఖాసిం'' తన రెండో యేటయే మరణించాడు. నలుగురు కుమార్తెలు ''[[జైనబ్ బిన్తె ముహమ్మద్|జైనబ్]]'', ''[[రుఖయా బిన్తె ముహమ్మద్|రుఖయా]]'', [[ఉమ్-ఎ-కుల్సుమ్ బిన్తె ముహమ్మద్|ఉమ్-ఎ-కుల్సుమ్]]'', మరియు ''[[ఫాతిమా జహ్రా|ఫాతిమా]].
 
ముహమ్మదు ప్రవక్త జీవితంలో ముఖ్యమైన ప్రదేశాలు మరియు తేదీలు
{| align="right" style="border:1px solid #ddd; margin:0 0 1em 1em; padding:0 0 1em 1em; vertical-align:right;"
!colspan="2" align="center"|<big>ముహమ్మద్ కాలపట్టిక</big>
|-
|colspan="2" align="center"|<small>ముహమ్మదు ప్రవక్త జీవితంలో ముఖ్యమైన ప్రదేశాలు మరియు తేదీలు
|-
|align="right">|''c''. [[570]]
|జనన తేదీ ([[ఏప్రిల్ 20]]): [[మక్కా]]
|-
|align="right">|[[570]]
|దక్షిణ అరేబియా నాగరికతల అంతము
|-
|align="right">|[[570]]
|[[మక్కా]] పై అబిసీనియన్ ల దండయాత్ర
|-
|align="right">|[[576]]
|తల్లి మరణం
|-
|align="right">|[[578]]
|తాత మరణం
|-
|align="right">|''c''. [[583]]
|[[సిరియా]] కు వాణిజ్య ప్రయాణాలు
|-
|align="right">|''c''. [[595]]
|[[ఖదీజా]] తో పెళ్ళి
|-
|align="right">|[[610]]
|[[అల్లాహ్]] నుండి "''మొదటి వార్త''": [[మక్కా]] లో
|-
|align="right">|''c''. [[610]]
|[[ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్త గా]] ప్రకటన: మక్కా
|-
|align="right">|''c''. [[613]]
|మక్కా : ప్రజలవద్ద ఉపదేశాలు
|-
|align="right">|''c''. [[614]]
|మక్కా : ప్రజాసమూహాల కూడళ్ళ చేరిక
|-
|align="right">|''c''. [[615]]
|[[అబిసీనియా]] కు ముస్లింల వలస
|-
|align="right">|[[616]]
|[[బనూ హాషిం]] తెగల నిషేధం మొదలు
|-
|align="right">|''c''. [[618]]
| మదీనావాసుల అంతర్యుధ్ధాలు: [[మదీనా]]
|-
|align="right">|[[619]]
|బనూ హాషిం తెగ నిషేధం పరిసమాప్తి
|-
|align="right">|''c''. [[620]]
|తెగల [[ఇస్లాం]] స్వీకరణ : మదీనా
|-
|align="right">|[[622]]
|[[మదీనా]] కు వలస ([[హిజ్రత్]])
|-
|align="right">|[[622]]
|మదీనాలో నాయకత్వ స్వీకరణ
|-
|align="right">|''c''. [[622]]
|కాబాలో గల బహువిగ్రహారాధన సరికాదనే ఉపన్యాసాలు : మక్కా
|-
|align="right">|[[622]]
|మక్కావాసులు ముహమ్మదు ప్రవక్తపై యుధ్ధప్రకటన
|-
|align="right">|''c''. [[622]]
|ముస్లిం మరియు ఇతర తెగల సామూహీకరణ
|-
|align="right">|''c''. [[623]]
|[[మదీనా రాజ్యాంగం]]
|-
|align="right">|[[624]]
|[[బద్ర్ యుధ్ధం]] ముస్లింలు మక్కావాసులకు ఓడించుట.
|-
|align="right">|[[625]]
|[[ఉహద్ యుధ్ధం]]
|-
|align="right">|''c''. [[625]]
|బనూ నాదిర్ యూదతెగల బహిష్కరణ
|-
|align="right">|[[626]]
|దూమత్ అల్-జందాల్ దండయాత్ర : [[సిరియా]]
|-
|align="right">|''c''. [[627]]
|వ్యతిరేకుల విజయములేని ఆక్రమణ : మదీనా
|-
|align="right">|[[627]]
|[[ఖందఖ్ యుధ్ధం]]
|-
|align="right">|[[627]]
|బనూ ఖురైజా నిర్మూలన
|-
|align="right">|''c''. [[627]]
|బనీ కల్బ్ అణచివేత : ''దూమత్ అల్-జందాల్''
|-
|align="right">|''c''. [[627]]
|ఇస్లాం ఏకీకరణ : మదీనా
|-
|align="right">|[[628]]
|[[హుదైబియా సంధి]]
|-
|align="right">|''c''. [[628]]
|మక్కాయాత్ర సుగమనం [[కాబా]]
|-
|align="right">|[[628]]
|యూద ఒయాసిస్సులపై విజయాలు : [[ఖైబర్ యుధ్ధం]]
|-
|align="right">|[[629]]
|మొదటి [[హజ్]] యాత్ర
|-
|align="right">|[[629]]
|[[బైజాంటియన్ సామ్రాజ్యం]] పై సమరం విఫలం : [[ముతా యుధ్ధం]]
|-
|align="right">|[[630]]
|మక్కా పై రక్తరహిత ఆక్రమణ
|-
|align="right">|''c''. [[630]]
|[[హునైన్ యుధ్ధం]]
|-
|align="right">|''c''. [[630]]
|తాయిఫ్ కైవసం
|-
|align="right">|[[630]]
|ధర్మపరమైన రాజ్యస్థాపన : మక్కా
|-
|align="right">|''c''. [[631]]
|అరేబియన్ ద్వీపకల్ప తెగల అణచివేత
|-
|align="right">|''c''. [[632]]
|ఘజనీడులపై ఆక్రమణ : [[తబూక్]]
|-
|align="right">|[[632]]
|వీడ్కోలు [[హజ్]] యాత్ర
|-
|align="right">|[[632]]
|మరణం ([[జూన్ 8]]): [[మదీనా]]
|-
|align="right">|''c''. [[632]]
|అరేబియా మొత్తం తెగల తిరుగుబాట్లు
|-
|align="right">|''c''. [[632]]
|[[అబూబక్ర్]] ([[ఖలీఫా]]) ధర్మపరమైన రాజ్య పునస్థాపన
|}
 
=== మొదటి అవతరణలు ===
 
[[మక్కా]] పొలిమేరల్లో [[హిరా గుహ]] యందు ముహమ్మద్ ప్రవక్త ధ్యానముద్రలో గడపడం సాధారణం. [[610]] లో తన దైనందినచర్యలో భాగంగా హిరా గుహయందు ధ్యానం చేయుచుండగా [[జిబ్రయీల్]] దూత ప్రత్యక్షమై సందేశమిచ్చాడు "చదువుము అల్లాహ్ పేరున, మీ ప్రభువు మరియు సృష్టికర్త అతడే. అల్లాహ్ మానవుణ్ణి గడ్డకట్టిన రక్తపు ముద్దనుండి సృష్టించాడు. చదువుము, మీ ప్రభువు పరమదయాళువు, కలంతో మానవుణ్ని (తెలియని) విద్యను నేర్పాడు." [[ఖురాన్]] 96:1-6.
 
జిబ్రయీల్ మొదటిసారి ప్రత్యక్షమైనందున ముహమ్మదు ప్రవక్త కలవరపడ్డారు, పత్నియైన [[ఖదీజా]] ముహమ్మదు ప్రవక్తకు 'ఇవి అల్లాహ్ వాక్కులు, ఇది సత్య దృష్టి' యని చెప్పి తన సంపూర్ణవిశ్వాసాన్ని ప్రకటించింది. తన పినతండ్రి కుమారుడైన [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]] (10 సంవత్సరాల వయస్సు) మరియు [[అబూబక్ర్]] కూడా తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి [[ఇస్లాం]] ను స్వీకరించారు.
 
మరణాంతము వరకూ 'అవతరణలను' పొందుతూనేవచ్చారు. మొదటి అవతరణ తరువాత రెండో అవతరణకు చాలా సమయం పట్టింది. ఈ విషయమూ మహమ్మద్ కు కలవరపరచింది, చివరికి [[అద్-దుహా]] [[సూరా]] అవతరించింది, అపుడు మాత్రమే ముహమ్మదు ప్రవక్త మనస్సు కుదుటపడింది.
 
[[613]] లో, ముహమ్మదు ప్రవక్త తన సందేశాన్ని ప్రజలవద్దకు చేర్చడం ప్రారంభించారు. చాలా మంది ఇతని సందేశం చెవినవేసుకోలేదు. కొందరు మాత్రమే గంభీరంగా స్వీకరించారు. కొద్దిమంది మాత్ర విశ్వాసాన్ని ప్రకటించి ముహమ్మద్ ప్రవక్త [[సహాబా]] లయ్యారు.
 
=== తిరస్కారము ===
 
ముహమ్మదు ప్రవక్త అనుయాయులు పెరిగేకొద్దీ, ఈవిషయం ప్రాంతీయ తెగలవారికి మరియు నగర పరిపాలకులకు సింహస్వప్నంగా మారింది. వీరి సంపద అంతా [[కాబా]] గృహంలోనే వుండినది, ఈ కాబా గృహం 'విగ్రహ స్థలి' మరియు మక్కా ప్రజల ధార్మిక కేంద్రం. ముహమ్మదు ప్రవక్త ప్రవచించినట్లు విగ్రహాలను త్యజిస్తే [[కాబా]] గృహ ప్రాశస్తం పోతుంది, తీర్థయాత్రికులు ఉండరు, మక్కా వ్యాపారకేంద్ర ప్రాముఖ్యత తగ్గిపోతుంది, ఆఖరుకు సంపద లేకుండా పోతుంది. ముహమ్మదు ప్రవక్త ప్రవచనం అయిన ''బహుదేవతారాధనా'' మరియు ''విగ్రహారాధన'' ల నిషేధం వారి తెగలలోనే ([[ఖురేషులు]]) భయాందోళనలు తెచ్చిపెట్టింది, కారణం [[కాబా]] గృహానికి వారే పోషకులు మరియు పాలకులు కూడా. ముహమ్మదు ప్రవక్త మరియు అనుయాయులు వీరి కోపానికి గురయ్యారు, కొందరైతే ([[సహాబా|సహాబీలు]]) సత్యవాక్కులు మరియు విశ్వాసాలు త్యజించలేక, ఖురేషులు పెట్టే బాధలు భరించలేక [[అబిసీనియా]] కు వలస వెళ్ళారు. అచట కాలనీలు ఏర్పాటు చేసుకొని జీవించసాగారు.
 
[[619]] లో ముహమ్మదు ప్రవక్త పత్ని [[ఖదీజా]] మరియు పినతండ్రి [[అబూ తాలిబ్]] మరణించారు; ఈ సంవత్సరాన్ని ''శోక సంవత్సరం'' గా అభివర్ణించారు. ముహమ్మదు ప్రవక్త తెగలే మహమ్మదు ప్రవక్తకు రక్షణ కల్పించడానికి వెనుకడుగు వేశాయి. ముస్లింలు పస్తులుంటూ బాధలకు తట్టుకుంటూ హృదయవిదారకంగా జీవించారు. ఈ సమయం వీరికి చారా కఠోరంగా మారినది.
 
[[620]] లో మహమ్మదు ప్రవక్త తన [[ఇస్రా మరియు మేరాజ్]] ప్రయాణం గూర్చి ప్రకటించారు. ఈ ప్రకటన ఇంకనూ శత్రువులను తయారుచేసింది.
 
=== హిజ్రత్ ===
[[622]] లో మక్కానగరంలో ముస్లింల జీవనం కఠినంగా మారింది, అందుకొరకు మహమ్మదు ప్రవక్త తన అనుచరగణంతో వలస వెళ్ళడానికి నిశ్చయించారు. మక్కా నగరం వీడి మదీనాకు వలస వెళ్ళారు. మదీనా ఆ కాలంలో 'యస్రిబ్' గా పిలువబడుతూండేది. ఈవలసవెళ్ళిన తేదీతోనే [[ఇస్లామీయ కేలండర్]] యొక్క మొదటి సంవత్సరం ప్రారంభమౌతుంది. ఈ శకానికే ''హిజ్రీ శకం'' అంటారు.
 
మహమ్మదు ప్రవక్త మదీనా నగరానికి వెళ్ళి అక్కడి తెగలైన 'బనూ ఆస్' మరియు 'బనూ ఖజ్రజ్' ల మధ్య వైషమ్యాలను తొలగించారు. ముస్లింల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందించారు. ఈ కాలంలోనే ప్రథమ ఖిబ్లా [[బైతుల్-ముఖద్దస్]] మరియు రెండవ ఖిబ్లా [[కాబా]] ఏర్పడింది.
 
=== యుధ్ధములు ===
 
[[మక్కా]] లోని [[ఖురేషులు]] మరియు [[మదీనా]] లోని ముస్లింల మధ్య యుధ్ధవాతావరణం నెలకొన్నది. మక్కా వాసులకు మదీనా వాసుల ఇస్లామీయ సరళి నచ్చలేదు. అందుకే యుద్దాలైన [[బద్ర్ యుధ్ధం]], [[ఉహద్ యుధ్ధం]], [[ఖందఖ్ యుధ్ధం]], [[హునైన్ యుధ్ధం]] జరిగాయి. కొద్ది ఫలితాలు మక్కావాసులు పొందగా సంపూర్ణవిజయాలు మదీనావాసుల వశమయ్యాయి.
 
=== మహమ్మద్ పరిపాలనా స్థిరత్వం ===
[[బద్ర్ యుధ్ధం]] లో లభించిన విజయం నిజంగానే ఆశ్చర్యజనకమైనది, కొద్దిపాటి ముస్లింలు పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడం, ఈ అసాధారణ విజయం ముస్లింలందరూ మహమ్మదు యొక్క ప్రవక్తగారి ప్రవక్తా ప్రకటనను అంగీకరించడానికి సందేహంలేకుండా చేసింది. అందరూ అమితానందపరులయ్యారు. దీని పర్యంతం యూదులతో జరిగిన ఒప్పందం యూదులు నిలుపుకోలేదు, యూదతెగ యైన బనూ ఖైనుఖాను బహిష్కరించారు. దాదాపు మదీనా అంతటా ప్రజలు ఇస్లాం స్వీకరించారు.
[[ఖదీజా]] మరణం తరువాత మహమ్మదు ప్రవక్త [[అబూబక్ర్]] (మహమ్మద్ మరణం తరువాత మొదటి రాషిదూన్ ఖలీఫా అయ్యాడు) కుమార్తె [[ఆయెషా సిద్దీఖా]] తో వివాహం చేసుకొన్నారు. మదీనాలో [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] (అబూబక్ర్ మరణం తరువాత రెండవ రాషిదూన్ ఖలీఫా అయ్యాడు) కూతురైన [[హఫ్సా బిన్తె ఉమర్]] తో వివాహం చేసుకొన్నారు. ఈ వివాహాలతో మహమ్మదు ప్రవక్త మరియు ఇతర ప్రముఖ సహాబాలతో సంబంధబాంధవ్యాలు బలీయమైనాయి.
 
మహమ్మదు ప్రవక్త కుమార్తె [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]] యొక్క వివాహం [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]] (ఉస్మాన్ మరణం తరువాత నాలుగవ రాషిదూన్ ఖలీఫా అయ్యారు) తో జరిగింది. ఇంకో కుమార్తె [[ఉమ్-ఎ-కుల్సుమ్]] యొక్క వివాహం [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]] (ఉమర్ మరణం తరువాత మూడవ రాషిదూన్ ఖలీఫా అయ్యాడు) తో జరిగింది. మహమ్మదు ప్రవక్త అనుయాయులు సహాబీలు, వారసులు చాలా పలుకుబడి, స్థితిమంతులు, మరియు శక్తిమంతులైనందున పరిపాలన స్థిరమైంది. వీటన్నిటికంటే మహమ్మదు ప్రవక్తను ప్రాణాలకంటే మిన్నగా చూసుకొనే అనుయాయులు, మహమ్మదు ప్రవక్త ప్రకటించిన సత్యవచనాల బలం, అల్లాహ్ కారుణ్యంవల్ల ఈ స్థిరత్వం ఏర్పడింది.(అని ముస్లింలు భావిస్తారు)
 
=== సమరాల పరంపర ===
[[625]] లో [[మక్కా]] నాయకుడు [[అబూ సుఫియాన్]] 3,000 మందీమార్బలంతో [[మదీనా]] వైపు దండయాత్రకు సాగాడు. [[మార్చి 23]] న [[ఉహద్ యుధ్ధం]] జరిగింది. ఈ యుధ్ధంలో మక్కావాసులకు విజయం, మదీనా వాసులకు అపజయం కలిగినది. కాని అబూసుఫియాన్ కు తీరని నష్టం జరిగింది. పెక్కుమంది మరణించారు. మక్కా నుండి మదీనా కు తరలి వచ్చి విజయం సాధించికూడా వట్టి చేతులతో మక్కా తిరుగుప్రయాణమయ్యాడు.
 
[[ఏప్రిల్]] [[627]] లో అబూ సుఫియాన్ ఇంకో సారి మదీనా పై దండయాత్ర చేశాడు. మదీనాలో అబూసుఫియాన్ సానుభూతిపరులు (యూదులు) బనూ ఖురైజా తెగ, మహమ్మదు ప్రవక్తతో ఒడంబడిక చేసుకొనికూడా కట్టుబడక, అబూసుఫియాన్ తో కుమ్మక్కై, మదీనాలోని ముస్లింలకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యింది. ఈ విషయం తెలుసుకొన్న మహమ్మదు ప్రవక్త మరియు ముస్లింలు ముందు జాగ్రత్తచర్యగా మదీనా నగరం చుట్టూ కందకం "ఖందఖ్" ను తవ్వారు. అందుకే ఈ యుధ్ధానికి [[ఖందఖ్ యుధ్ధం]] అని అంటారు. అబూసుఫియాన్ సేనను సునాయాసంగా తిప్పికొట్టారు.
ఈ యుధ్ధం తరువాత, బనూఖురైజా తెగవారు యుధ్ధఖైదీలుగా పట్టుబడ్డారు. వీరిలో ముదుసలులకు, స్త్రీలకు, పిల్లలకు క్షమాభిక్షప్రసాదించి, సేవకులుగానుంచారు. వెన్నుపోటుదార్లందరికీ [[సాద్ ఇబ్న్ ముఆద్]] ఆదేశాన మృత్యుదండన విధించబడింది.
 
ఖందఖ్ యుధ్ధం తరువాత ముస్లింల శక్తి బలీయమైనది, ధార్మికపరంగా ప్రజలంతా తండోపతండాలుగా [[ఇస్లాం]] ను స్వీకరించారు. సైన్యం బలీయమైంది. ప్రాంతాలపై పట్టు ఏర్పడింది. ప్రముఖంగా వివిధ తెగలమధ్య వైషమ్యాలు తొలగాయి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిశాయి.
 
=== మక్కా వశం ===
[[628]] లో ముస్లింల పరిస్థితి కుదుటబడింది, మహమ్మదు ప్రవక్త [[మక్కా]] నగరానికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించారు, ఈ సారి తీర్థయాత్రికులుగా ముస్లింలందరూ మక్కా వెళ్ళాలని నిర్ణయించారు. మార్చినెలలో మక్కానగరానికి బయలు దేరారు. తీర్థయాత్రికుల సమూహం 1,600 సంఖ్యగలది. మూర్ఖులైన మక్కా వాసులు ఈ తీర్థయాత్రికులకు మక్కానగరంలో ప్రవేశం నిషిధ్ధపరచి, మక్కానగర పొలిమేరల్లోనే ఓ ఒడంబడిక చేసుకొన్నారు. దీనిని [[హుదైబియా సంధి]] అంటారు. తీర్థయాత్ర మరుసటి సంవత్సరానికి వాయిదా పడింది.
 
ఈ ఒడంబడిక రెండు సంవత్సరాలు మాత్రం నిలువగలిగినది, [[630]] లో ఒప్పందం నీరుగారింది. మహమ్మదు ప్రవక్త 10,000 మంది ముస్లింలను తీసుకొని మక్కా వైపు ప్రయాణమయ్యారు. మక్కావాసులు ఈ భారీ సమూహాలను, మందీ మార్బలాన్ని, ముస్లింల మరియు ఇతర తెగల మధ్య సౌభ్రాతృత్వాలను చూసి, అచేతనంగా వుండిపోయారు. ఎలాంటి నిలువరింపూ లేకుండా ముస్లింలు మక్కాలో ప్రవేశించారు. నిజానికి మక్కావాసులు ముస్లింలను చూసి భయపడ్డారు, వారు మక్కానగరాన్ని కొల్లగొడతారనీ, మక్కావాసులను చీల్చి చెండాతురాని, పగతీర్చుకొంటారని భావించారు. కానీ అంతా దీనికి భిన్నంగా జరిగింది. మక్కా వాసులందరూ క్షమింపబడ్డారు, ఒక్క రక్తపు చుక్కా పారలేదు. అంతటా శాంతి వెల్లి విరిసింది. ఇస్లాం అనగా శాంతి అనే బోధనే గాక ఆచరణా జరిగింది. దీనిని చూసి ఇస్లాంపట్ల ద్వేషంతోవున్నవారు నిశ్చేష్టులయ్యారు, తమ కీడు భావనలపట్ల పశ్చాత్తాప పడ్డారు. మహమ్మదు ప్రవక్త [[కాబా]] లో గల విగ్రహాలన్నీ తొలగించారు. కాబాను తన ప్రాశస్తం కోల్పోకుండా చూశారు. కాబా ముస్లింల పవిత్రక్షేత్రమైనది. మక్కావాసులందరూ విశాలతత్వాన్నీ, శాంతినీ చూసి ఆనందపడ్డారు. బహువిగ్రహారాధనా, మరియు ఇతర సాంఘీక దురాచారాలలో తామెంత కోల్పోయినదీ మక్కావాసులు గ్రహించారు. మక్కావాసులందరూ ఇస్లాంను స్వీకరించారు. మహమ్మదు ప్రవక్త తమను గాఢాంధకారాలనుండి విముక్తి ప్రసాదించినందుకు అతనిపై గర్వపడ్డారు.
 
=== అరేబియా ఏకీకరణ ===
[[మక్కా]] పై రక్తరహిత విజయం, హునైన్ యుద్ధ విజయాలు ముస్లింలకు అరేబియాలో సంపూర్ణ ఇస్లామీయ సామ్రాజ్యం ఏర్పాటు చేయుటకు దోహదపడ్డాయి. చిన్న చిన్న తెగల ప్రాంతాలన్నీ ఏకీకృతమై అరేబియా దేశం ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ మహమ్మదు ప్రవక్త నాయకత్వంలోనే జరిగాయి.
[[ఫైలు:ArabianpeninsulaAL.PNG|thumb|right|మహమ్మద్ ప్రవక్త తన మరణం [[632]] నాటికి, మొత్తం అరేబియా ద్వీపకల్పం బలమైన రాజ్యంగా ఏర్పరచారు.]]
ముస్లింలు అరేబియా మొత్తం పై అధికారం చెలాయించే స్థాయికి చేరుకొన్నారు. మిగతా తెగలన్నీ మహమ్మదు ప్రవక్త ముందు తలదించాయి.
 
=== యోధుడిగా మహమ్మద్ ===
{{see details | యోధుడిగా మహమ్మద్}}
63 సంవత్సరాల వయస్సు పొందిన మహమ్మదు ప్రవక్త, చాలా సంవత్సరాలు వర్తకుడుగాను, ప్రబోధకుడి గానూ గడిపారు. తాను కరవాలాన్ని చేబట్టింది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అదియూ స్వీయ మరియు ముస్లింల రక్షణకొరకు మాత్రమే యుధ్ధాలు చేశాడు. కొద్దిమంది గల సేనతో, అదియూ అరకొర ఆయుధాలతో యుధ్ధాలు చేసి విజయం పొందడం వీరి విశ్వాస పటుత్వానికి మరియు అల్లాహ్ దయకు ప్రతీక.
 
గుర్తుంచుకోవలసిన విషయాలు:
 
* మక్కావాసులు మాత్రమే మదీనాపై దండెత్తారు గాని మదీనావాసులు మక్కాపై దండయాత్ర చేయలేదు
* [[బద్ర్ యుధ్ధం]], [[ఉహద్ యుధ్ధం]], [[ఖందఖ్ యుధ్ధం]], [[హునైన్ యుధ్ధం]] మరియు ఇతరాలు మదీనాకు దగ్గరలో జరిగాయి, మక్కా దగ్గర జరగలేదు. అనగా మక్కావాసులు మదీనా దగ్గరకు వచ్చి యుధ్ధాలు చేశారు గానీ మదీనా వాసులు మక్కా దగ్గర పోయి యుధ్ధాలు చేయలేదు.
Line 68 ⟶ 249:
* మదీనావాసులు ఇంకో సారి మక్కా వైపు వెళ్ళారు ఈ సారి ఏలాంటి రక్తపాతం లేకుండా, అసలు యుధ్ధమనేదే లేకుండా మక్కాను స్వాధీనం చేసుకొన్నారు.
* పశ్చిమ దేశపు విమర్శకులు ఉబుసుపోక పోకడలతో మహమ్మదు ప్రవక్తపై విమర్శించేందుకు ఎల్లప్పుడూ సిధ్ధంగా వుంటారు. 20 మరియు 21 వ శతాబ్దంలో ఈ పోకడ ఇంకా ఎక్కువైంది. పశ్చిమదేశాలలోనే ఈ వైఖరి ఎక్కువ కనిపిస్తోంది. తూర్పుదేశాలు ఆధ్యాత్మికతను కలిగిన దేశాలు, పశ్చిమ దేశాలు భౌతిక వాద దేశాలు. భౌతికవాదం తీవ్రమైన పోకడలతోనూ, దైనందిన జీవితాలలో ఎలాంటి కళ్ళేలూ లేకుండా జీవించడంలో ఆనందం పొందుతున్నాయి. తూర్పు దేశాలు ఆధ్యాత్మిక వాదం, శాంతి, ధర్మం, మరియు భగవంతుని యెడ భయం భక్తి గల్గి వున్నాయి. ఈ దేశాలలో భూతదయ, జీవితంలో కట్టు బాట్లు ఎక్కువగా కానవస్తాయి. ఇవి రుచించని వారు, ఈ విషయాల బోధకుల పట్ల ఎల్లప్పుడూ విమర్శనాత్మక వ్యంగ్య దృష్టితోనే చూస్తారు. కాలమే అందరి కళ్ళూ తెరిపిస్తుంది. భగవంతుడు (అల్లాహ్) అందరినీ గమనిస్తుంటాడు, సహనంతో వేచి చూడడం సత్యసంధుల పని.
 
=== ముహమ్మదు భార్యలు పిల్లలు ===
* ''' పదకొండుమంది భార్యలు''' :
Line 85 ⟶ 267:
* నలుగురు ఆడపిల్లలు: 1.[[జైనబు]] 2.[[రుఖయ్యా]] 3.[[ఉమ్మెఖుల్సూమ్]] 4. [[ఫాతిమా]]
* ముగ్గురు మగ పిల్లలు:1.[[ఖాసిం]] 2.[[అబ్దుల్లా]] 3.[[ఇబ్రహీం]] .ఈ ముగ్గురు మగ పిల్లలు చిన్నవయసులోనే చనిపోయారు.
 
=== ముహమ్మదు సహాబాలు (అనుయాయులు) ===
{{see details|సహాబా}}
 
సహాబి అనగా ముహమ్మద్ ను చూసినవారిలో, అతని సహచరులలో ఎవరయితే అతనిపై విశ్వాసముంచి, ఇస్లామును స్వీకరించి, ముస్లిముగా మరణించారో వారే సహాబీలు. వేలకొలది సహాబీలు గలరు గాని వారిలో అతిముఖ్యమైన సహాబీల సంఖ్య 50 నుండి 60 వరకూ గలదు.
 
హదీసులలో గల ఉల్లేఖనాలన్నీ ఈసహాబీలద్వారా చేరినవే. హదీసుల ఉల్లేఖనాలు నమ్మకస్తులైన సహాబాల ఇస్ నద్ ద్వారా ఇస్లామీయ సాంప్రదాయాలకు లభ్యమయినవి.
కొందరు సహాబాల పేర్లు క్రింద ఇవ్వబడినవి.
 
* [[ఆమిర్]]
* [[అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్]]
Line 104 ⟶ 290:
* [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]]
* [[జుబేర్]]
 
=== ముహమ్మదు మరణము ===
[[ఫైలు:Green Dome of the Holy Prophet.jpg‎|thumb|left|మహమ్మదు ప్రవక్తగారి ''సబ్జ్ గుంబద్'']]
 
ముహమ్మదు ప్రవక్త కొన్నిరోజులు అనారోగ్యం పాలయ్యారు, తదనంతరం 63 సంవత్సరాల వయస్సులో [[మదీనా]] నగరంలో [[8 జూన్]] [[632]] సోమవారం పరమదించారు.
 
=== ముహమ్మదు వారసులు ===
 
కుమారుడు ''ఖాసిం'' తన రెండో యేటయే మరణించాడు. నలుగురు కుమార్తెలు ''[[జైనబ్ బిన్తె ముహమ్మద్|జైనబ్]]'', ''[[రుఖయా బిన్తె ముహమ్మద్|రుఖయా]]'', [[ఉమ్-ఎ-కుల్సుమ్ బిన్తె ముహమ్మద్|ఉమ్-ఎ-కుల్సుమ్]]'', మరియు ''[[ఫాతిమా జహ్రా|ఫాతిమా]].
ముహమ్మదు ప్రవక్త వారసులు [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]] మరియు [[జైనబ్ బిన్తె ముహమ్మద్|జైనబ్]] లు.
 
== ముహమ్మదు యొక్క చారిత్రక ఆవశ్యకత ==
 
మరణానికి ముందు [[632]] లో ముహమ్మదు ప్రవక్త అరేబియా అంతటా సుస్థిరమైన సామాజిక రాజకీయ ఇస్లామీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరిమరణం తరువాత ఇతని వారసులు అరేబియా అంతటినీ ఏకీకరించారు, మరియు [[ఇరాన్]], [[ఇరాక్]], [[ఈజిప్టు]], [[పాలస్తీనా]], [[సిరియా]], [[ఆర్మీనియా]] మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలను జయించారు. 750 లో [[ఇస్లాం]] ఏకేశ్వరవాద మతధార్మిక వాదనగల మతంగా దక్షిణ [[స్పెయిన్]], మరియు మధ్యాసియా లోను విస్తరించింది.
 
ఘజ్ఞవీడుల కాలంలో 10 వ శతాబ్దంలో భారతదేశంలోనూ ఆగ్నేయాసియాలోనూ విస్తరించింది. 150 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండవస్థానంలో నిలుస్తూంది.
 
== ముహమ్మదుపై ముస్లింల గౌరవం ==
 
[ఫైలు:Muhammad callig.gif|thumb|right|మానవాకృతుల కళాకృతులు [[ఇస్లాం]] లో నిషేధం, అందుకే [[ఇస్లామీయ లిపీ కళాకృతులు]] విశేష ఆదరణ పొందాయి. ముహమ్మద్ పేరును చూడండి.]]
[[ఫైలు:Muhammad callig.gif|thumb|right|మానవాకృతుల కళాకృతులు [[ఇస్లాం]] లో నిషేధం, అందుకే [[ఇస్లామీయ లిపీ కళాకృతులు]] విశేష ఆదరణ పొందాయి. ముహమ్మద్ పేరును చూడండి.]]
 
దాదాపు ప్రతిముస్లిం మహమ్మదు ప్రవక్త పట్ల అమిత ప్రేమ గౌరవాలు ప్రకటిస్తాడు, ఈ ప్రకటించడం అనేక విధాలుగా కానవస్తుంది.
 
* ముహమ్మదు ప్రవక్త పేరు ఉచ్ఛరించినపుడుగాని వ్రాయునపుడు గాని వినినపుడుగాని; ముహమ్మదు ప్రవక్త పేరు తరువాత "సల్లల్లాహు అలైహి వసల్లమ్" (అతనిమీద శాంతికలుగునుగాక) అని పలుకుతారు.
* ముస్లింల కార్యక్రమాలలో ముఖ్యంగా [[సూఫీ]] ధార్మిక సంగీతంలో ముహమ్మదు ప్రవక్త ప్రాశస్తాన్ని వివరిస్తూ కవితలు, పాట ([[నాత్|నాతేషరీఫ్]])లు [[ఖవ్వాలీ]] రూపంలో పాడుతారు.
Line 124 ⟶ 321:
* అమూర్తీకృతులు (మూర్తుల, చిత్రాల ద్వారా కాకుండా) [[ఇస్లామీయ లిపీ కళాకృతులు]] ద్వారా ఉదాహరణకు ప్రవక్తగారి నామం గల చిత్రం, మస్జిద్ ఎ నబవి చిత్రం, వారి వంశవృక్ష చిత్రం వగైరాలు కూడా అమితంగా గౌరవింపబడుతాయి.
* [[హదీసులు|హదీసుల]] ద్వారా తెలిసిన ముహమ్మదు ప్రవక్త జీవనగాధను మరియు కథలను గౌరవంగా ఆలకిస్తారు.
 
== ఇవీ చూడండి ==
* [[ఇస్లాం మరియు ముహమ్మదు పట్ల గౌరవం]]
* [[సీరా|సీరత్]]
* [[ఇస్లాం]]
* [[హదీసులు]]
* [[ముహమ్మద్ ప్రవక్త వంశవృక్షం]]
* [[మత స్థాపకులు]]
* [[ఇస్లామీయ ప్రవక్తలు]]
 
 
{{ఇస్లాం}}
{{ఖురాన్‌లో ఇస్లామీయ ప్రవక్తలు}}
 
== మూలాలు ==
<references/>
== బయటి లింకులు ==
{{Commons|Muhammad}}
{{wikiquote}}
 
Non-sectarian biography:
* [http://www.pbs.org/muhammad Public Broadcasting System program on Muhammad]
* [http://encarta.msn.com/encyclopedia_761553918/Muhammad_(prophet).html/ Encarta Encyclopedia]
* [http://31.1911encyclopedia.org/M/MA/MAHOMET.htm 1911 Encyclopedia article of Muhammad]
 
Sunni biography:
* [http://www.al-sunnah.com/nektar/ Ar-Raheeq Al-Makhtum (The Sealed Nectar)- Memoirs of the Noble Prophet]
* [http://www.witness-pioneer.org/vil/Books/MH_LM/default.htm The Life of Muhammad] Muhammad Husayn Haykal Translated by Isma'il Razi A. al-Faruqi
* [http://www.islamonline.net/English/In_Depth/mohamed/1424/index.shtml Islamonline]
* [http://www.usc.edu/dept/MSA/fundamentals/prophet/ About Muhammad]
* [http://www.muhammad.net/ Muhammad Biography and more]
 
Shia biography:
* [http://www.al-islam.org/restatement/ A Restatement of the History of Islam and Muslims by Sayed Ali Asgher Razwy]
* [http://al-islam.org/lifeprophet/ The Life of Muhammad The Prophet by Syed Saeed Akhtar Rizvi]
* [http://al-islam.org/beacons/title.htm Beacons of Light by Abu Ali al Fadl]
 
Critical perspectives:
* [http://www.answering-islam.org.uk/Books/Jeffery/historical_mhd.htm The Quest for the Historical Mohammed]
* [http://debate.org.uk/topics/theo/muhbiog.htm Trends in Biographies of Muhammad]
 
Miscellaneous:
* [http://faculty.washington.edu/wheelerb/swords/swords_index.html Swords of the Prophet Muhammad]
 
[[వర్గం:ఇస్లామీయ ప్రవక్తలు]]
[[వర్గం:ముస్లింలు]]
[[వర్గం:అరబ్ ప్రజలు]]
[[వర్గం:ఇస్లాం]]
[[వర్గం:ముహమ్మద్]]
[[వర్గం:570 జననాలు]]
[[వర్గం:632 మరణాలు]]
[[వర్గం:మత స్థాపకులు]]
 
{{Link FA|ur}}
 
[[en:Muhammad]]
[[hi:मुहम्मद]]
[[kn:ಮೊಹಮ್ಮದ್]]
[[ta:முகம்மது நபி]]
[[ml:മുഹമ്മദ്]]
[[ace:Muhammad]]
[[af:Mohammed]]
[[als:Mohammed]]
[[an:Mahoma]]
[[ar:محمد]]
[[ast:Mahoma]]
[[az:Məhəmməd peyğəmbər]]
[[ba:Мөхәммәт]]
[[bat-smg:Mahuomets]]
[[bcl:Muhammad]]
[[be:Магамет]]
[[be-x-old:Мухамад]]
[[bg:Мохамед]]
[[bi:Muhammed]]
[[bn:মুহাম্মাদ]]
[[br:Mohammed]]
[[bs:Muhamed]]
[[ca:Mahoma]]
[[ce:Мухьаммад]]
[[ceb:Muhammad]]
[[ckb:موحەممەد]]
[[cs:Mohamed]]
[[cy:Muhammad]]
[[da:Muhammed]]
[[de:Mohammed]]
[[diq:Hz. Mıhemmed]]
[[dv:މުޙައްމަދުގެފާނު]]
[[el:Μωάμεθ]]
[[eo:Mohamedo]]
[[es:Mahoma]]
[[et:Muḩammad]]
[[eu:Muhammad]]
[[fa:محمد]]
[[fi:Muhammad]]
[[fiu-vro:Muhammad]]
[[fr:Mahomet]]
[[fy:Mohammed]]
[[gan:穆罕默德]]
[[gd:Muhammad]]
[[gl:Mahoma]]
[[gu:મુહંમદ]]
[[haw:Mohameka]]
[[he:מוחמד]]
[[hif:Muhammad]]
[[hr:Muhamed]]
[[hu:Mohamed próféta]]
[[ia:Mahomet]]
[[id:Muhammad]]
[[io:Muhamad]]
[[is:Múhameð]]
[[it:Maometto]]
[[ja:ムハンマド・イブン=アブドゥッラーフ]]
[[jv:Muhammad]]
[[ka:მაჰმადი]]
[[kaa:Muxammed]]
[[kk:Мұхаммед пайғамбар]]
[[ko:무함마드]]
[[ku:Mihemed Pêxember]]
[[kw:Mahomm]]
[[la:Machometus]]
[[lmo:Maumèt]]
[[lt:Mahometas]]
[[lv:Muhameds]]
[[mhr:Мохаммад]]
[[mk:Мухамед]]
[[mn:Мухамэд]]
[[mr:मोहम्मद पैगंबर]]
[[ms:Nabi Muhammad s.a.w.]]
[[mt:Muħammed]]
[[mwl:Maomé]]
[[nds-nl:Mohammed]]
[[nl:Mohammed]]
[[nn:Muhammed]]
[[no:Muhammed]]
[[oc:Maomet]]
[[pag:Muhammad]]
[[pl:Mahomet]]
[[pnb:محمد]]
[[ps:محمد صلی الله عليه وسلم]]
[[pt:Maomé]]
[[qu:Muhamad]]
[[ro:Mahomed]]
[[ru:Мухаммед]]
[[sa:मुहम्मद]]
[[sah:Муhаммед]]
[[scn:Maumettu]]
[[sco:Mohammad]]
[[sd:محمد]]
[[sh:Muhamed]]
[[simple:Muhammad]]
[[sk:Mohamed]]
[[sl:Mohamed]]
[[sq:Muhammedi]]
[[sr:Мухамед]]
[[su:Muhammad]]
[[sv:Muhammed]]
[[sw:Muhammad]]
[[szl:Mahůmet]]
[[tg:Муҳаммад]]
[[th:มุฮัมมัด]]
[[tk:Muhammet pygamber]]
[[tl:Muhammad]]
[[tr:Muhammed bin Abdullah]]
[[tt:Мөхәммәт пәйгамбәр]]
[[ug:مۇھەممەد ئەلەيھىسسالام]]
[[uk:Мухаммед]]
[[ur:محمد صلی اللہ علیہ و آلہ و سلم]]
[[uz:Muhammad]]
[[vi:Muhammad]]
[[wa:Mawoumet]]
[[war:Muhammad]]
[[wo:Muhammad]]
[[wuu:穆罕默德]]
[[yi:מוחמד]]
[[yo:Muhammed]]
[[za:Muhammad]]
[[zh:穆罕默德]]
[[zh-min-nan:Mohammed]]
[[zh-yue:模罕默德]]
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_ప్రవక్త" నుండి వెలికితీశారు