బ్రహ్మపుత్రా నది: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: eo:Bramaputro
చి యంత్రము తొలగిస్తున్నది: simple:Brahmaputra; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మఫైలు:Brahmaputra-verlaufsgebiet.jpg|thumb|240px|బ్రహ్మపుత్రా నది ఉపగ్రహ చిత్రం.]]
[[బొమ్మఫైలు:Chitwan_dugout.jpg|thumb|240px|చిత్వాన్‌‌లో ఒక పడవ.]]
'''బ్రహ్మపుత్ర''' (Brahmaputra river) ([[అస్సామీ భాష]]: ব্ৰহ্মপুত্ৰ, [[బెంగాలీ భాష]]: ব্রহ্মপুত্র} [[హిందీ భాష]]: ब्रम्हपुत्र, [[టిబెటన్ భాష]]ཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) [[ఆసియా]]లోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం.
 
[[టిబెట్]]లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నది గా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది. నైఋతిలో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్ లో జమునగా పారుతుంది. అక్కడా [[గంగా నది]]తో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. సుమారు 2900 కిలోమీటర్లు (1800 మైళ్ళు) పొడవున్న ఈ నది వ్యవసాయానికి జల మార్గాలకు ఉపయోగకరంగా ఉన్నది. దీని ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు గుప్తంగా ఉన్నది. దీనికి జాంగ్ బో పెనులోయతో గల సంబంధం 1884-86 అన్వేషణ వల్లనే కనుగొనబడినది.
పంక్తి 7:
ఈ నది దిగువ ప్రాంతము [[హిందూమతం|హిందువు]]లకు పవిత్రమైనది. ఈ నది మెరుపు వరదలకు ప్రసిద్ధి. సాధారణంగా అలలు కేవలం సముద్రంలలోనే వస్తాయి. కానీ ప్రపంచంలో [[టైడల్ బోర్]] (అలలపోటు)ను ప్రదర్శించే అరుదైన నదులలో ఇది ఒకటి.
 
== నదీ ప్రవాహ మార్గం ==
=== టిబెట్‌లో ===
 
ఉత్తర హిమాలయాలలోని [[కైలాస పర్వతం]] <ref>[http://www.100gogo.com 100gogo.com]'']</ref> దగ్గర ''జిమా యాంగ్ జాంగ్'' హిమానీనదం<ref>''[http://www.100gogo.com/canyon.htm The New Largest Canyon in the World]''from [http://www.100gogo.com 100gogo.com]''</ref> లో పుట్టింది ''యార్లుంగ్ త్సాంగ్ పో'' నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత నంచా బార్వ పర్వతాన్ని చుడుతూ ''యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయ'' ను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడినది. <ref>''[http://www.canyonsworldwide.com/tibet/mainframe2.html Canyonlands of Tibet and Central Asia]'', from [http://www.canyonsworldwide.com canyonsworldwide.com].</ref>
 
=== భారతదేశంలో ===
అరుణాచల్ ప్రదేశ్లో నది ప్రవేశించిన చోట ఈ నది పేరు ''సియాంగ్'' అక్కడ చాలా ఎత్తు నుంచి చాల వేగంగా కిందికి దిగుతుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని [[దిహంగ్]] అంటారు. అక్కడ నుండి 35 కిలోమీటర్లు ప్రవహించాక [[దిబంగ్]], [[లోహిత్]] అనే మరో రెండు నదులతో సమాగమం అవుతుంది. ఈ సంగమ కేంద్రం నుండి ఈ నది చాలా వెడల్పు అవుతుంది, ఇక్కడ నుండి ఈ నది బ్రహ్మపుత్రగా పేరొందింది. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమైనవి. భారత ప్రభుత్వం వీటి మీద ఆనకట్టలు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాంలో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలోమీటర్లు దాకా ఉంటుంది. జోర్హాత్ కి దగ్గరలో రెండు పాయలుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన కలవడం ద్వారా ఈ నది [[మజూలి]] అనే ద్వీపాన్ని ఎర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. గౌహతి దగ్గర్లో [[హజో]] అనే గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోసుకుంటూ ప్రవహించడంవల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. ఎన్నో శత్రు దాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే [[సరాయ్ ఘాట్]] యుద్ధము జరిగింది. ఇక్కడ నదిపై నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు [[సరాయ్ ఘాట్ వంతెన]] అని పేరు పెట్టారు.
 
బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం ''లౌహిత్య''. దీనినుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు ''లుయిత్'' వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే [[బోడో]] లు ఈ నదిని ''భుల్లం - బుతుర్'', అని పిలుస్తారు. అంటే బోడో భాషలో 'గర గర శబ్ధం చేసేది' అని అర్ధం. దీన్నే ''బ్రహ్మపుత్ర'' అని సంస్కృతీకరించారు.
 
=== బంగ్లాదేశ్‌లో ===
[[బొమ్మఫైలు:Bangladesh LOC 1996 map.jpg|right|thumb| బంగ్లాదేశ్‌లో ముఖ్యమైన నదులను చూపే చిత్రపటం. ఇందులో బ్రహ్మపుత్రకు ఉపనదులైన 'జమున', 'దిగువ బ్రహ్మపుత్ర'లను చూడవచ్చును.]]
[[బంగ్లాదేశ్]] లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి [[మేఘ్నా]] నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని [[చాంద్ పూర్]] అనే ప్రదేశంలో కలిసి బంగాళా ఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగ, బ్రహ్మపుత్ర నదీ జలాలు [[గంగ - బ్రహ్మపుత్ర డెల్టా]] ని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది.
 
== బ్రహ్మపుత్రపై చైనా జలవిద్యుత్‌ ప్రాజెక్టు ==
బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో ఓ భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రను [[టిబెట్‌]] లో [[త్సాంగ్‌పో]] నదిగా పిలుస్తారు. అక్కడ నామ్చా ప్రాంతంలో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతి పెద్దదైన జలవిద్యుత్‌ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. 26 టర్బైన్లతో పనిచేసే ఈ ఆనకట్ట గంటకు 40 మిలియను కిలోవాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. 2009 మార్చి 16న దీనికి శంకుస్థాపన జరగగా మార్చి 16న పనులు ప్రారంభమయ్యాయి. చైనాలోని ఐదు పెద్ద విద్యుత్తు కంపెనీలు ఓ వ్యాపారకూటమిగా ఏర్పడి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయి. ఇది పూర్తయితే ఇప్పటివరకు చైనాలో మొదటిస్థానంలో ఉన్న [[త్రీ గోర్జెస్‌ డ్యాం]] కంటే పెద్దదవుతుంది. బ్రహ్మపుత్ర నది భారత్‌, బంగ్లాదేశ్‌లకు ఎంతో ముఖ్యమైనది. భారతదేశంలో 40 శాతం జలవిద్యుత్తు అవసరాన్ని, 30 శాతం నీటి వనరుల అవసరాలని ఈ నది తీరుస్తోంది. బంగ్లాదేశ్‌లో అయితే మంచినీటికి, సేద్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. దీనిపై భారత్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చుతూ దీంతో తమకు సంబంధం లేదని అది పూర్తిగా ప్రైవేటు సంస్థల వ్యవహారమని పేర్కొంది. మరోవైపు ఆనకట్ట ఇంజనీర్లు మాత్రం ఇది పూర్తయితే భారత్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు చౌకగా విద్యుత్‌ సరఫరా చేయవచ్చని, బంగ్లాదేశ్‌కు వరదముప్పు తప్పుతుందని అంటున్నారు. (ఈనాడు16.10.2009)
 
== నదీ ప్రయాణ సౌకర్యాలు ==
1947లో భారత దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ, బ్రహ్మపుత్రా నది ఒక పెద్ద జలమార్గంగా ఉపయోగించబడినది. [[ఎగువ అస్సాం]] లఖింపూర్ జిల్లాలోని [[సదియా]] నుంచి దిగువ అస్సాంలోని [[ధుబ్రి]] వరకూ జాతీయ జలమార్గం - 2 గ ప్రకటించబడింది. సరుకుల రవాణాకు ఈ మార్గం అనుగుణంగా ఉండేది. అస్సాం రాష్ట్ర ప్రధాన నగరమైన గౌహతి, గౌహతి, ఉత్తర గౌహతిగ బ్రహ్మపుత్ర నది వల్ల విభజించబడినది. ఉత్తర గౌహతికి పోవుటకు అత్యంత సౌకర్యమైనది నదీ మార్గమే. ఈ మధ్య కాలంలో చాలా నదీ క్రూజ్‌లు కూడా పెరిగాయి. అస్సాం బెంగాల్ నేవిగేషన్ [[చరైద్యూ]] అనే క్రూజ్ షిప్ ని కూడా నడుపుతోంది.
 
== మూలాలు ==
{{reflist}}
 
 
== మరిన్ని వనరులు ==
* [http://banglapedia.search.com.bd/HT/B_0615.htm బంగ్లాపీడియా:బ్రహ్మపుత్రా నది]
* [http://banglapedia.search.com.bd/HT/O_0015.htm Banglapedia:Old Brahmaputra River]
* [http://banglapedia.search.com.bd/HT/B_0616.htm Banglapedia:Brahmaputra-Jamuna River System]
 
* [http://www.ppl.nl/bibliographies/all/?bibliography=water Bibliography on Water Resources and International Law] See ''Ganges and Brahmaputra Rivers'' section.
పంక్తి 44:
 
{{భారతదేశ నదులు}}
 
[[వర్గం:భారతదేశ నదులు]]
 
Line 85 ⟶ 86:
[[ru:Брахмапутра]]
[[sa:ब्रह्मपुत्र]]
[[simple:Brahmaputra]]
[[sk:Brahmaputra]]
[[sl:Brahmaputra]]
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మపుత్రా_నది" నుండి వెలికితీశారు