"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
===ఒంటి చేత్తో సిగముడవటం===
అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం
===ఒంటెత్తు పోకడ===
ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ
===ఒడిలోకొచ్చి పడడం===
దక్కడం, లభించడం
దక్కడం, లభించడం అనే అర్థాల్లో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏదైనా ఒడిలో ఉండడమంటే ఎవరికైనా అది సొంతమైందేనని అర్థం. ఈ అర్థాన్ని ఆధారంగా చేసుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'నువ్వంతగా కష్టించినా నీకు ఒడిలోకొచ్చి పడేదేమీలేదు, మరీ అంతగా శ్రమించకు' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
 
===ఒళ్లు మండడం===
అయిష్టం, కోపం రావడం
అయిష్టం, కోపం రావడం అనే అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శారీరకంగా కోపం వచ్చినప్పుడు కలిగే పరిణామాల ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. నిజంగా ఒళ్లు మండుతున్నట్టు అనిపించినా, అనిపించకపోయినా ఏదైనా విషయం ఇష్టంలేదని చెప్పాల్సి వచ్చినప్పుడు "నాకదంటే ఒళ్లు మంట" అనే సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
 
===ఒక పంటి కిందికి రావు===
ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.
ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.. అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా ఇష్టమైన పదార్థాన్ని నోటినిండా వేసుకొని తినడం అందరూ చేసే పనే. అయితే ఇష్టమైన పదార్థం మరీ కొద్దిగా ఉన్నప్పుడు దాన్ని నోట్లో వేసుకుంటే ఎంతో అసంతృప్తిగా ఉంటుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. 'పట్నం నుంచి మాకోసం తెచ్చిన మిఠాయిలు మాకు ఒక పంటి కిందికి కూడా రావు, ఇంత తక్కువ ఎందుకు తెచ్చావు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
 
===ఒకటికి ఐదారు కల్పించు===
===ఒక గుడ్డు పోయిననేమి?===
చాలా చిన్న గ్రామము
===ఒళ్ళో పెట్టటం===
స్వాధీన పరచటం చేతుల్లో పెట్టటం
స్వాధీన పరచటం ఓ వస్తువును లేదా పదార్థాన్ని ఇవ్వాల్సిన వ్యక్తికి పూర్తిగా ఇచ్చేస్తామని చెప్పటానికి మర్యాద పూర్వకంగా ఆ వ్యక్తిని కూర్చోపెట్టి వస్తువును ఆ వ్యక్తి చేతుల్లో పెడుతుండటం, చేతుల్లో పెట్టటం
 
==ఓ==
 
===ఓనమాలు తెలియనివాడు===
అనుభవం లేనివాడు
అనుభవం లేనివాడు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అక్షరాభ్యాస సమయంలో ఓనమాలను దిద్దిస్తారు. ఆ అక్షరజ్ఞానంతో క్రమంగా విద్యలన్నీ అభ్యసించి జీవితంలో ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతటి అనుభవ స్థితి ఆనాడు ఓనమాలు దిద్దబట్టే వచ్చిందనీ, ఆ ఓనమాలే దిద్దకపోతే జీవితం అంతా జ్ఞాన, అనుభవ శూన్యమేనన్నది భావం. ఈ భావాన్ని అనుసరించే ఎవరైనా అనుభవం లేని స్థితిలో కనిపించినప్పుడు "వాడికింకా ఈ విషయంలో ఓనమాలే తెలియవండీ, అందుకే అలా అయింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
 
 
===ఓడలు బండ్లగు===
దిగజారిన పరిస్తితి.
 
===ఒడలు చిదిమిన పాలు వచ్చు===
మిక్కిలి సుకుమారమైన.
 
===ఒడినిండటం===
సంతాన భాగ్యం కలగటం
సంతాన భాగ్యం కలగటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఆడ బిడ్డలకు తల్లిదండ్రులు చీర సార పెట్టేటప్పుడు ఒడిలో బియ్యం పోస్తారు. ఒడి నిండుగా ఉండాలని ఆశీర్వదిస్తారు. ఈ సందర్భానికి అర్ధం ఆ ఆడబిడ్డ సంపద, సౌభాగ్యాలతో విలసిల్లాలని. ఒడిబియ్యం ఆచారం అలాంటి అర్ధాన్ని చెబుతుంటే ఒడి నిండటం అనే ఈ జాతీయం అచ్చంగా సంతాన భాగ్యాన్ని కలిగి ఉండడం అనే దాన్ని చెబుతుంది. తల్లి ఒడిలో బిడ్డ ఉన్నప్పుడు ఆ ఒడి నిండుగా ఉంటుంది. ఈ భావనే ఈ జాతీయ ఆవిర్భావానికి మూలం. 'ఆ దేవుడు తొందరగా నీ ఒడి నింపాలి' అని ఆశీర్వదించే సందర్భాలలో ఈ ప్రయోగాన్ని గమనించవచ్చు.
 
([[హిందీ భాష]]లో "గోద్ భరనా" అన్న జాతీయం ఇదే అర్ధంలో వాడుతారు)
 
 
===ఓమనుగాయలు===
===ఓహరిసాహరి===
తండోపతండంబులు
===ఓ అనిన వ రాదు అన్నట్టు===
 
==ఔ==
 
 
[[వర్గం:జాతీయములు]]
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/498072" నుండి వెలికితీశారు