నారాయణ తీర్థ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నారాయణ తీర్థ అనబడు గోవింద శాస్త్రి క్రీ.శ. 17వ శతాబ్దములో గుంటూర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నారాయణ తీర్థ అనబడు గోవింద శాస్త్రి క్రీ.శ. 17వ శతాబ్దములో గుంటూరు జిల్లజిల్లా కాజ గ్రామములో తల్లావజ్జుల నీలకంఠశాస్త్రి, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. అతి చిన్న వయసులోనే సంగీతము, సంస్కృతము, శాస్త్రాలు అభ్యసించాడు. చిన్నవయసులోనే వివాహము జరిగింది.
 
 
నారాయణ తీర్థ చిన్నతనమునుందడేచిన్నతనమునుండే పూజలు, భగవన్నామస్మరణం చేస్తుండేవాడు. స్వామి శివానందతీర్థ పరిచయ భాగ్యముతో సన్యాస దీక్షాముఖముగా పయనించాడు. నారాయణ తీర్థ సంగీత సంస్కృత భాషాపరిజ్ఞానానికి శివానందతీర్థ మెరుగులు దిద్దాడు. భూపతి రాజపురములో స్థిర నివాసమేర్పరచుకొని "శ్రీ కృష్ణలీలాతరంగిణి" కావ్యము వ్రాశాడు. ఒక కావ్యానికి కావలిసిన మూడు ప్రధానాంశాలు పద్యము, గద్యము, వచనము కావ్యములో అతి చక్కగా చిత్రీకరించాడు. నాట్యానికి కావలిసిన జతులు, కృతులు పొందుపరచ బడ్డాయి. నృత్య సంగీత నాటకముగా యక్షగాన పద్ధతిలో వ్రాశాడు. మేళత్తూరు భాగవతులు ఈ నాటకాన్ని మేళా పద్ధతిలో ప్రదర్శించారు. నారాయణ తీర్థ సంగీత కృతులే తరువాత అనేకమంది సంగీత విద్వాంసులకు స్ఫూర్తిదాయకమయ్యాయి. నారాయణ తీర్థ ప్రభావమువల్లే తాను ప్రహ్లాద భక్తి విజయము, నావికా చరితము వ్రాసినట్లు త్యాగరాజు చెప్పుకున్నాడు.
 
 
తిరువయ్యారుకి 10 కి.మీ. దూరమున తిరుపూడి గ్రామములో శుక అష్ఠమి రోజున జీవసమాధి అయినట్లు నానుడి
==మూలాలు==
{{reflist}}
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/నారాయణ_తీర్థ" నుండి వెలికితీశారు