సభా పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
 
=== ద్రౌపతికి వరాలు రాజ్యాన్ని తిరిగి పొందటం ===
విదురుడు లేచి "అందరూ శాంతంగా ఆలోచించండి. వికర్ణుడు చిన్న అయినా బృహస్పతిలా ధర్మం చెప్పాడు.ధర్మం తెలిసి కూడా పక్షపాతంతో కాని ,లోభంతో కాని చెప్పక పోతే అసత్య దోషం అంటుకుంటుంది. పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, సుధన్వుడు అనే బ్రాహ్మణుడు ఒక కన్య కొరకు తగులాడుతూ ప్రహ్లాదుని వద్దకు తీర్పు కోసం వెళ్ళారు. కొడుకు విషయంలో తీర్పు చెప్పటానికి జంకి ప్రహ్లాదుడు కశ్యపుని సలహా అడిగాడు. న్యాయమూర్తి సాక్ష్యాన్ని ధర్మాన్ని అనుసరించి ధర్మ బద్ధమైన తీర్పు చెప్పాలి. అలా చెయ్యకపోతే న్యాయమూర్తికి సభాసదులకు పాపం వస్తుంది. కనుక కామక్రోధాలకు అతీతంగా తీర్పు చెప్పు " అని కశ్యపుడు చెప్పాడు. ప్రహ్లాదుడు సంతోషించి తన కొడుకు అని ఆలోచించక సుధన్వుడి కీనుకూలంగా తీర్పు చెప్పాడు. కనుక మనం ఈ నాడు ద్రౌపదికి న్యాయం చేయకుంటే అందరికి పాపం వస్తుంది" అన్నాడు. దుర్యోధనునికి భయపడి ఎవరూ బదులు చెప్పలేదు. ద్రౌపది సభాసదులను చూసి "నేను పాందవుల ఇల్లాలిని లోకారాధ్యుడైన శ్రీకృష్ణ సోదరిని. ఇలా అవమానింపబడ్డాను.నేను అడిగిన దానికి ఎందుకు బదులు చెప్పరు? నేను దాసినా కాదా చెప్పండి" అని దు॰ఖంతో అడిగింది . భీష్ముడు "అమ్మా! నీ ప్రశ్నకు ధర్మరాజు ఒక్కడే సమాధానం చెప్పగలడు " అని అన్నాడు. కర్ణుడు తరుణీ "ఐదుగు భర్తలకన్నా ఒక్క భర్త మేలు కదా ! జూదంలో భార్యను ఓడి పోని వ్యక్తిని భత్రగా ఎంచుకో " అని ఎగతాళి చేసాడు. సుయోధనుడు వచ్చి నా తొడపై కూర్చో. అని సైగ చేసాడు. అది చూసి భీముడు "రాజ్య సంపద వలన కలిగిన మదంతో ద్రౌపదిని తొడ మీద కూర్చోమని సైగ చేసిన ఈ దుర్మార్గుని నా గదతో తొడలు విరుగ కొడతాను " అని ముందుకు ఉరికాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఇది తగిన సమయం కాదిని శాంతింప చేసారు. అప్పటికి చలించిన గాంధారి విదురుని తీసుకుని దృతరాష్ట్రుని వద్దకు వచ్చి ద్రౌపదికి జరిగిన అవమానాన్ని వివరించింది.దృతరాష్ట్రుడు "సుయోధనా పాండవ పట్టమహిషిని ఇలా అవమానించడం తగునా? నీ కారణంగా పాండ్వులు దు॰ఖితులైయ్యారు". అని ద్రౌపదిని పిలిచి "అమ్మా! ద్రౌపది నాకోడళ్ళలో నీవు గౌరవించ తగిన దానివి. నీకు ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను" అన్నాడు.ద్రౌపది "ముందు నా భర్తను దాశ్యంనుండి విముక్తుని చేయండి " అని అడిగింది. ఇంకో వరం కోరుకో అన్నాడు. "ధర్మరాజు నలుగురు తమ్ములను దాస్యవిముక్తులను చేసి వారి వారి ఆయుధములను ఇప్పించండి "అన్నది. సరే ఇచ్చాను ఇంకో వరం కోరుకో న్నాడుకోరుకోన్నాడు. "వైస్యవైశ్య సతికి ఒక వరం, క్షత్రియ సతికి రెండు వరాలు కనుక ఇక వరాలు కోర రాదు " అన్నది. ద్రౌపది ధర్మనిరతికి దృతరాష్ట్ర్రుడు సంతోషించి పాందవులనుపాండవులను పిలిచి జూదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని సమస్త సంపదను తిరిగి ఇచ్చాడు.". నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను. వృద్ధుడను, అల్ప బుద్ధిని మీ తల్లి గాంధారి ముఖం చూసి దుర్యోధనాదులు మీ పట్ల చేసిన అపచారం క్షమించండి . మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళి హాయిగా రాజ్యం చేసుకోండి " అని దీవించాడు.
=== సతీసమేతంగా పాండుసుతులు అరణ్యములకు వెళ్ళుట ===
[[భీముడు]] " సతి కారణంగా పాండుసుతులకు రాజ్యం సంప్రాప్తించింది అనిపించుకోవడం కాంటే యుద్ధం చేసి పొందడం మేలు కదా " అన్నాడు. [[ధర్మరాజు]] వారించి ఇంద్రప్రస్థానికి తీసుకు వెళ్ళాడు. [[దుర్యోధనుడు]] [[కర్ణుడు]], [[శకుని]]తో ఆలోచించి దృతరాస్ష్ట్రుని వద్దకు వెళ్ళి " తండ్రీ శత్రువును చంపడం వివేకమని దేవగురువు బృహస్పతి చెప్పాడు. పాండవులు మనకు శత్రువులు ఎంత చేసినా మనం వారికి మంచి వాళ్ళము కాదు. మనం వాళ్ళను విడిచి పెట్టి తప్పు చేసాం. [[అర్జునుడు]] గాండీవం, [[భీముడు]] గదాయుధం , ధర్మరాజ, నకుల సహదేవులు వారి వారి ఆయుధాలు పడితే మనం వారిని గెలవడం సాధ్యం కాదు. కనుక పాండవులను తిరిగి జూదానికి పిలిచి జూదం ఆడించి నిర్వాసితులను చెయ్యడం తక్షణ కర్తవ్యం " అన్నాడు. [[ధృతరాష్ట్రుడు]] అంగీకరించాడు. మరల జూదానికి రమ్మని ప్రాతిగామిని పంపింవాడు. తండ్రి మాటమీరరాదని [[ధర్మరాజు]] జూదానికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. [[శకుని]] "ధర్మరాజా! దృతరాష్ట్ర మహారాజు మీరు పోగొట్టుకున్న సమస్త సంపదలు రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక అవి జూదంలో పెట్టడం తగదు. ఓడిన వారు వల్కలములు ధరించి కందమూలములు తింటూ పన్నెండేళ్ళు వనవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాత వాసం చేయాలి ఇదీ పందెం ఇందుకు మీరు అంగీకరిస్తే " అన్నాడు. [[ధర్మరాజు]] "సరే " అన్నాడు. జూదం ఆడాడు ఓడి పోయాడు. అరణ్యానికి పోవడానికి సిద్ధం అయ్యారు.పాండవులు [[భీష్ముడు]], [[ద్రోణుడు]], కృపాచార్యుల వద్ద శలవు తీసుకున్నారు. కుంతీ దేవి వద్దకు వచ్చారు.ఆమె "పుత్రులారా! పుత్రులారా ఇలాంటి దుస్థితి వస్తుందని ముందుగా ఊహించి మీ తండ్రి, మాద్రి స్వర్గానికి వెళ్ళారు. నేను దురదృష్టవంతురాలిని కృష్ణా నా కుమారులను కాపాడు " అని ప్రార్ధించింది. కొడుకులను కోడలిని దీవించి పంపింది. అందరూ అడవికి పయనమయ్యారు. కోపం నిండిన చూపులకు జనం దహించబడతారని [[ధర్మరాజు]] ముఖానికి వస్త్రం అడ్డం పెట్టుకుని వెళ్ళాడు, ఎట్టకేలకు యుద్ధంలో బాహు బలం ప్రదర్శించే అవకాశం వచ్చిందని [[భీముడు]] రొమ్ము విరుచుకుంటూ వెళ్ళాడు. ఇంత కంటే ఎక్కువగా అస్త్ర సంధానం చేసి శత్రు సంహారం చేస్తానని [[అర్జునుడు]] చేతితో ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. తమ అందచందాలు చూసి జనులు దు॰ఖిస్తారని నకులసహదేవులు మలిన వస్త్రాలతో వెళ్ళారు. తడిసినబట్టలతో విడిన కురులతో దు॰ఖిస్తూ యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు ఇలా రాజ్యం వదిలి వెళతారని సూచిస్తూ [[ద్రౌపది]] వెళ్ళింది. పాండవులతో [[ధౌమ్యుడు]], వేలాది బ్రాహ్మణులు పాండవులను అనుసరించారు. ఇలా పాండవులు అడవులకు బయలు దేరారు.