స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 144:
కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! [[అర్జునుడు]] భూరిశ్రవసుడి భుజము నరికాడు. [[సాత్యకి]] తల నరికాడు. అయినా ! కృష్ణా ! మహావీరులైన [[అర్జునుడు]], [[సాత్యకి]] మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంతావా ! సాధువు మంచి వాడు అయిన భూతిశ్రవసువును చంప్[ఇనందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణా ! [[సాత్యకి]] సాధించినది ఏమిటి అపకీర్తి మూటకట్టుకోవడం తప్ప. కృష్ణా ! ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు [[అర్జునుడు]] సిగ్గుమాలి అతడి చేయి నరకవచ్చునా ! అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా ! కృష్ణా ! " అని పరిపరి విధముల విలపించసాగింది గాంధారి.
==== గాంధారి శకునిని నిందించుట ====
[[కృష్ణుడు]] ఒక్క మాట కూడా మాటాడక కుండా [[గాంధారి]] ని అనుసరిస్తున్నాడు. ఇంతలో [[గాంధారికిగాంధారి]]కి [[శకుని]] కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. [[గాంధారి]] " కృష్ణా ! తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు [[శకుని]]ని చూసావా ! వీడొక మాయావి వీడి మాయలు నీ ముందు పని చేయ లేదు. నాడు మాయా జూదంలో [[ధర్మరాజు]] ను అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఒడిపోయాడు. కురు పాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణా ! మేలు చేస్తున్నానని నమ్మించి నాకుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది. పుత్ర పౌత్రులతో నాశనం అయ్యాడు. అసలు నాకొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా ! అందుకు తగిన ఫలితం అనుభవించారు
 
==== గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట ====