స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
 
==== గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట ====
కృష్ణా ! అదుగో కళింగ దేశాధిపతి, ఇదుగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ తమ రాజ్యాలలో సకల భోగములను అనుభవించిన వారు నేడు దిక్కులేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యా బిడ్డలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణా ! ఇరుగో కేకయ రాజులు.
ద్రోణాచార్యుని చేతిలో హతులైనట్లున్నారు. అడుగో పాంచాల రాజు [[ద్రుపదుడు]] తన సహాద్యాయి ద్రోణుడి చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా ! అతడి స్వేత చ్ఛత్రం ఇంకా అతడి మీద ఎండ పడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా !! కృష్ణా ! ఆ మహారాజుల భార్యలు కొడుకులూ వారికి దహనక్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళుతున్నారు. ఇంకా కొంత మంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్నారు. కృష్ణా ! ఇతడిని గుర్తు పట్టావా ! వీడే నీ మేనత్త కొడుకు శిశుపాలుని కుమారుడు దుష్టకేతువు. అతడి కుమారుడు సుకేతుడు. తాండ్రి కొడుకులిద్దరూ మరణించారయ్యా ! తండి కొడుకుల మరణానికి వారి భార్యలు తల్లులు బంధువులు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! అవంతీ పాలకులు విందానువిందులను చూడు. పెను గాలికి కూలిన వృక్షములవలె ఎలా కూలి పోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణా !
 
==== గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట ====
==== గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట ====