"మేషరాశి" కూర్పుల మధ్య తేడాలు

10,967 bytes added ,  11 సంవత్సరాల క్రితం
riki
(riki)
=== మేష లగ్నం ===
మేషలగ్నాధిపతి కుజుడు. కుజుడు లగ్నాధిపతే కాక అష్టమాధిపతి కూడా. సూర్యుడు, గురువు, చంద్రుడు ఈ లగ్నానికి కారక గ్రహములై శుభత్వాన్ని ఇస్తారు. శని, శుక్రుడు మరియు బుధుడు అకారక గ్రహములై ఆశుభాన్ని కలిగిస్తారు. మేషలగ్నస్థ గ్రహ ఫలితాలను క్రింద చూడవచ్చు.
* సూర్యుడు :- మేష లగ్నానికి సూర్యుడు కారక గ్రహము. పంచమ స్థానాధిపతి మరియు త్రికోణాధిపతి అయిన సూర్యుడు మేషలగ్న జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ సూర్యుడు ఈ జాతకునికి అందం, సౌందర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కలిగిస్థాడు. విద్యాభ్యాసం చక్కగా సాగుతుంది, జీవన సరళిలో తండ్రితో విభేదాలు కలిగే అవకాశం ఉంది. చక్కని ఆర్ధిక స్థితి కలిగి ఉంటారు. పాప గ్రహ సంబంధం లేకున్న ప్రభుత్వ పరమైన ప్రయోజనం ఉంటుంది. సంతాన సుఖం కలుగుతుంది. సూర్యుని సప్తమ దృష్టి ఫలితంగా అందమైన, సహాయ సహకారాలందించే భార్య లభిస్తుంది. అయినా వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.
* చంద్రుడు :- మేషలగ్నానికి చంద్రుడు చతుర్ధ స్థానాధిపతిగా కేంద్రాధి పత్యం వహిస్తాడు. కారక గ్రహమై శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వీరికి శాంతస్వభావం ఇచ్చినా వీరికి కోటెతనం ఎక్కువ. కల్పనాశీలత అధికం. భోగ, విలాసవంతమైన జీవితం మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి తల్లి నుండి తల్లి పక్షం నుండి దహాయ సహకారాలు అందుతాయి. భూమి, భవనం, వాహన ప్రాప్తి కలుగుతుంది. ప్రకృతి సౌందర్యానికి వీరు ఆకర్షితులై ఉంటారు. వీరు శితల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉండుట వలన చలి వలన కలిగే జలుబు, దగ్గులతో బాధ పడుతుంతుంటారు. ఆర్ధిక స్థితి బాగుంటుంది. ప్రభుత్వం నుండి వీరికి ఆదాయం ఉంటుంది. లగ్నస్థ చంద్రుడు శుక్రుడి స్థానమైన తుల మీద దృష్టి ప్రసరించడం వలన అందమైన సహకారం అందించే లభించగలదు. కొన్ని సమయాలలో వైవాహిక జీవితం బాధింస్తుంది.
*
* కుజుడు :- మేషలగ్నానికి కుజుడు ప్రధమ, అష్టమ స్థానాలకు అధిపతి ఔతాడు. లగ్నాధిపతిగా కుజుడు అష్టమ భావాధిపత్య దోషం నుండి విముక్తుడౌతాడు. మేష లగ్నస్థ కుజుడు వ్యక్తికి కండలు తిరిగిన, ఆరోగ్యవంతమైన శరీరం ప్రసాదిస్తాడు. వీరికి పరాక్రమం, సాహసంతో మొరటుతనం, కోపం కలిగి ఉంటారు. వీరి ఆత్మబలం కారణంగా కఠిన కార్యాలను సహితం సమర్ధవంతంగా నెరవేరుస్తారు. సమాజంలో వీరు గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. బలహీన్ముల పట్ల వీరికి సానుభూతి ఉంటుంది. కుజుడి చతుర్ధ భావ దృష్టి వీరికి మిత్ర స్థానమైన కటక రాశి కనుక వాహన సౌఖ్యం, భూమి సౌఖ్యం ఉంటుంది. దుర్ఘటన కలుగుటకు అవకాశం ఉంది. కుజుడి సప్తమ స్థానం అయిన తులారాసి మీద దృష్టి వలన జీవితభాగస్వామితో అభిప్రాయ భేదాలు కలిగి వైవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు.
* బుధుడు :- మేషలగ్నానికి బుధుడు తృతీయ, షష్టమాధిపత్యం వహిస్తూ అకారక గ్రహంగా అశుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానం, బుద్ధి కుశలత కలిగిస్తాడు.
వీరికి ఉపాద్యాయ వృత్తిలో అభిరుఛి ఉంటుంది. లేఖకునిగా, కళాకారుడిగా అవకాశం లభిస్తుంది. బుధ దశలో మనశాంతి లోపిచండం, బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ష్టమాధిపతి అయిన బుధుడు వీరికి ఉదర సంబంధ వ్యాదులు, మూర్ఛ వ్యాధి, మతిమరుపు కలిగిస్తాడు. వీరికి వ్యాపారంలో సఫలత ఉంటుంది. బుధుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం అయిన తుల మీద దృష్టి సారించడం వలన జీవిత గుణవంతుడైన భాగస్వామి లభిస్తాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడగలడు. సంతాన సౌఖ్యం లోపించే అవకాశం ఉంది. వైవాహిక సుఖం సాదారణంగా ఉంటుంది.
* గురువు :- మేష లగ్నానికి గురువు నవమాధిపతి, వ్యయాధిపతి అయి ఉంటాడు. త్రికోణ స్థానాధిపత్యం కారణంగా వ్యయాధిపత్య దోషం తొలగి కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తి విద్వాంసుడు, జ్ఞాని ఔతాడు. ప్రతిభావంతమైన సుశ్వరం వీరి సొత్తు. వీరు సమాజం నుండి సన్మానాలు, ప్రతిష్టను పొపందుతారు. గురువు పంచమ దృష్టి కారణంగా సంతాన సౌఖ్యం, ధార్మిక కార్యాలలో అభిరుచి కలిగి ఉంటారు. సప్తమ స్థానం గురువుకు శత్రు స్థానమైనందున సప్తమ స్థాన దృష్టి జీవిత భాగస్వామికి మానసిక అశాంతి కలిగిస్తాడు. నవమ స్థాన దృష్టి ధనస్సు మీద ప్రసరిస్తాడు కనుక భాగ్యం ప్రశస్తంగా ఉండి ధన ధాన్య సంపదలు కలిగి ఉంటాడు.
* శుక్రుడు :- మేషలగ్నానికి శుక్రుడు ధనస్థానం, సప్తమ స్థానాధిపతి ఔతాడు. శుక్రుడు శత్రు స్థానమైన మేషంలో ఉన్నందున వ్యక్తికి కష్టకారకుడు, రోగకారకుడౌతాడు. లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి అందమైన శరీరం ఇస్తాడు. అయినా రోగగ్రస్తుడిని చేస్తాడు. శుక్రుడి దశ వీరికి కష్టకారకమై ఉంటుంది. వ్యతిరేక లింగం మీద ఆకర్షితులై ఉంటారు.
ఈ ఆకర్షణ వీరికి ధన నష్టం , కష్టమును ఇస్తాడు. లగ్నస్థ శుక్రుడి కారణంగా వీరికి విశేష కళాభిరుచి కలిగి ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన శుక్రుడి స్వస్థానమైన తులను చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి విచిత్రపు అలవాట్లు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామికి ప్రేమ అధికంగా ఉన్న వినోదమైన వారి అలవాట్లు
వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలకు కారకుడౌతాడు.
* శని :- మేష లగ్నానికి శని దశమ, ఏకాదశాధిపత్యం వహిస్తాడు. మేష లగ్నానికి శని మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. మేష లగ్నస్థ శని కారణంగా వ్యక్తి సన్నగా కోపస్వభావితుడై ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా సోదరుల నుండి సహాయ సహకారాలు అందవు. సపమ దృష్టి కారణంగా బంధి మిత్రుల సహాకారం బాధిస్తుంది. జీవిత భాగస్వామి చెడు మనస్తత్వం కలిగి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో అస్థిరత ఉంటుంది. లగ్నస్థ శని శుభగ్రహ చేరిక దృష్టి కలిగిన శుభఫలితాలు ఉంటాయి.
* రాహువు :- మేషలగ్నస్థ రాహువు వ్యక్తికి ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరికి ఉదర సంబంధ వ్యాధులు ప్రాప్తిస్తాయి. జీవితంలో చాలా సంఘర్షణ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అతి కష్టం మీద సఫలత సాధిస్తారు. వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా ఉద్యోగంలో సఫలత సాధిస్తారు. రాహువు దృష్టి వలన సప్తమ స్థానం బాధించబడి జీవిత భాగస్వామి రోగగ్రస్థుడౌతాడు. వైవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది. మిత్రుల సోదరుల సహాయ సహకారాలు అందడం కష్టం.
* కేతువు :-
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/533973" నుండి వెలికితీశారు