హుసేన్ సాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: replacing dead link thehindu.com with hindu.com
పంక్తి 30:
 
హుస్సేన్ సాగర్‌ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం జపాన్ అంతర్జాతీయ సహకార బ్యాంకు వారి సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్టు నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు 2006లో 310 కోట్ల రూపాయల ఖర్చుతో ఒప్పందం కుదుర్చుకొన్నారు<ref>http://www.hindu.com/2006/04/01/stories/2006040118871400.htm</ref>. 10 సంవత్సరాల పాటు నడిపే ఈ ప్రాజెక్టు కోసం జూలై 2006లో జపాన్ బ్యాంకువారు ప్రాధమిక సర్వే నిర్వహించారు కూడాను. కాని తరువాత వివిధ ప్రభుత్వ, నగర పాలిక సంస్థలు ఈ కార్యక్రమంలో తమ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల పనులలో ప్రగతి చాలా మందకొడిగా ఉంది <ref>http://www.cyberabadtimes.net/archives/hussain-sagar--neglected.php</ref>. 2008 జనవరిలో మురుగు నీటిని శుభ్రపరచే ప్లాంటు కోసం టెండర్లు పిలవడం జరిగింది. 2010 నాటికి ఈ కర్మాగారం పని చేయడం మొదలు పెడుతుందనీ, అప్పటికల్లా చెరువు పూడిక తీయడం, బయటినుండి వచ్చే మురుగు నీరు దారి మళ్ళించడం వంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి<ref>http://www.cyberabadtimes.net/archives/hussain-sagar-pollution-free-by-2010.php</ref>
 
కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌లోకి ప్రధానంగా ఐదు నాలాల నుంచి వ్యర్థ రసాయన, మురుగు నీరు వచ్చి చేరుతోంది.జీడిమెట్ల, బాలానగర్‌, సనత్‌నగర్‌ పారిశ్రామిక ప్రాంతాల నుంచి శుద్ధిచేయని వ్యర్థ రసాయనాలు కూకట్‌పల్లి నాలాలో కలిసి, సాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌లో జలచరాలు బతకాలంటే 'కెమికల్" లీటరుకు 50 మిల్లీ గ్రాముల్లోపు ఉండాలి. కానీ అది 134 నుంచి 350 ఉంది.సాగర్‌ పరిసరాల్లోని భూగర్భజలంలో సీసం, కాడ్మియం, జింక్‌, నికెల్‌ తదితర విషపూరిత కారకాలు అధికస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
 
==పడవలు, పోటీలు==
"https://te.wikipedia.org/wiki/హుసేన్_సాగర్" నుండి వెలికితీశారు