దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
మంజులవాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం '''మాతంగకన్యాం మనసా స్మరామి''' అని కాళిదాసు కీర్తించిన మాతంగి మహావిద్య సరస్వతీ అవతారం. అటువంటి దేవదాసీల ఉన్నత స్థానం క్రమక్రమంగా దిగజారింది. ఈ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొక్కరి చొప్పున గుడిలోని దేవుడికి "పెళ్ళి" చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి, దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం ప్ర్రదర్శిస్తూ, ఇతర భారతీయ సంప్రదాయాలను ఆచరిస్తూ గడపాలి. గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి [[మాతంగి]] నులుగా, [[బసివి]] ని లుగా ఎలా బలితీసుకుంటారో [[వి.ఆర్‌.రాసాని]] "[[మట్టిమనుషులు]]" లో బయటపెట్టారు. దళిత స్త్రీలను [[జోగిని]] లుగా మార్చడం గురించి ‘‘[[జగడం]] ’’ నవలలో [[బోయ జంగయ్య]] చిత్రించారు.
జాతర ఆరంభించాలన్నా, సంబరం మొదలెట్టాలన్నా జోగిని అక్కడుండటం నేటికీ సాగుతున్న ఆచారం. ఆమె కోరికలు తీర్చే దేవత. తాకితే చాలు, జాతకం మారి పోతుందన్న [[మూఢ నమ్మకం]] . ఈవిశ్వాసాల వెనుక అమాయక మహిళల ఆక్రందనలు వినిపిస్తాయి. అణగారిన వర్గాల్లోని ఆడపిల్లల పాలిట ఇదో పెను శాపం.ముక్కుపచ్చలారని అమ్మాయిల్ని దేవతకిచ్చి పెళ్లి చేయడం... శుభకార్యాలు, చావు మేళాల్లో నృత్యం చేయించడం... మగవారి కోర్కెలకు సమిధ కావడం...జడలు కట్టిన జుట్టుతో కనిపించడం, మెడలో పలక, రథం ఎక్కించడం, నృత్యాలు చేయడం, ఆఖరుకి కన్న బిడ్డలకు తండ్రెవరో చెప్పలేని దుస్థితిలోకి తీసుకెళ్లడం... వారి వెతలు వింటుంటేనే [[కన్నీరు]] ధార కడుతుంది.
* జోగినుల వ్యవస్థ నిర్మూలనకు 'ఆశ్రయ్' సంస్థ ,జోగినిఆంధ్రప్రదేశ్‌ జోగినీ వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితిసంఘటన(ఎపిజెవివిఎస్‌) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
జోగినిలు చదువుబాట పట్టాలి.అమ్మాయిలకు ఎవరో కట్టిన తాళిని తీసేయించాలి.జోగినులకు అందరిలా పెళ్లి చేయాలి.వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి.జోగినిల సంక్షేమం కోసం వారి అనారోగ్య సమస్యలు పరిష్కరించాలి. తండ్రి పేరు తెలియని చిన్నారులకు గుర్తింపు దక్కేలా చూడాలి. పదమూడేళ్లకు జోగినిలుగా మారి మూడు పదులకల్లా ముసలి వారవుతున్న వారికి పింఛను ఇవ్వాలి.మన రాష్ట్రంలో ఆ దురాచారంలో మగ్గే వారి సంఖ్య 45 వేలు.పేదరికం, మూఢ నమ్మకాలు, బలవంతపు ప్రోత్సాహమే కారణం. వారిలో సగం మంది వయసు పాతికలోపే. పేరుకి దేవత. వూరందరికీ దేవదాసీ. చదువు సంధ్యల్లేవు. సామాజిక ఆదరణ లేదు.తీవ్ర అనారోగ్య సమస్యలు. నిస్సహాయస్థితిలో వారి పిల్లలు జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలి. వూరి పెద్దలను బాధ్యులుగా చేస్తూ సవరణలు తీసుకురావాలి. చిరు ప్రాయంలోనే బాలికల జీవితాలను బుగ్గి చేసే తీరుని ప్రతి ఒక్కరూ బహిరంగంగా ఖండించాలి.
==కఠిన నియమాలు==
జోగినులు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి కడగాలి. పూజలు చేయాలి. ఆ రెండు రోజులు ఒక్కపూటే భోజనం చేయాలి. మాంసం ముట్టుకోరాదు. వారంలో ఆరెండు రోజులే ఊర్లో యాచించి, వారమంతా గడపాలి. బస్వినులు సోమవారం, శనివారం పూజ చేయాలి.వికలాంగులు, అత్యాచారానికి గురైన వారిని జోగినులుగా మారుస్తున్నారు.
ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్లి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నిండి, ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగినీ తల్లి అయితే ఆమె పెద్దకోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకుని, ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి.జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని స్కూల్లో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలున్నారు. <ref>http://www.prajasakti.com/socialjustice/article-18165</ref>
== మూలాలు ==
<references/>
 
 
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు