రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: pt:Ravi Varma)
రాజా రవి వర్మ ఈనాటి భారతదేశములోని [[కేరళ]]లో [[తిరువనంతపురం|తిరువనంతపురాని]]కి 25 మైళ్ళ దూరంలోని [[కిలమానూరు]] రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు [[ఏప్రిల్ 29]], [[1848]]న జన్మించాడు. చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామ స్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్ఛ్యాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.
 
♥==♥వృత్తి♥==♥
==వృత్తి==
1873 [[వియన్నా చిత్ర ప్రదర్శన]]లో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చాడు.<ref> Kilimanoor Chandran, ''Ravi Varmayum Chitrakalayum''(in Malyalam),Department of Culture,Kerala, 1998</ref> ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవి వర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవి వర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవి వర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్థి పొందింది.
 
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/549914" నుండి వెలికితీశారు