మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఆదిమానవుని కాలంలో కుడ్య శల్పాలు, కుడ్య చిత్రాలు ఒక రకంగా మొదటి మాధ్యమమని అనుకోవచ్చు. లిపి కూడా లేని కాలంలో మానవుడు తన భావాలను
వెబుచ్చడానికి చేసిన ప్రయత్నమే కుడ్యశిల్పాలు. అవి ఇప్పటికీ ఆనాటి నాగరికత, ఆనాటి జంతువులు, వారి సంస్కృతి మనకు అందిస్తూ గత చరిత్రను ఆధునికులకు అందించడంలో తమ తోడ్పాటు అందిస్తున్నాయి. అజంతా ఎల్లోరా గుహలు దీనికి ఉదాహరణలు. లిపి పుట్టిన తరువాత కాగితం లేని సమయంలో ముందుగా సమాచారాన్ని, భద్రపరచి ప్రజలకు అందించడానికి కొంత ఎక్కువ కాలం మన్నే తాటి ఆకులను రచయితలు మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇప్పటికీ పురాతన రచనల తాళ పత్ర గ్రంధాలను భద్రపరచి అపురూప సంపదగా కాపాడబడుతున్నాయి. అలాగే లోహాలను రచనలు భద్రపరచడానికి ఎంచుకుని రచనలు సాగించారు. అవే తామ్రపత్ర గ్రంధాలు. ఇవి అత్యధిక కాలం మన్నికగా ఉంటాయి. రాజులు తమ శాసనాలను ప్రజలకు తెలియపరచడానికి శిలలను మాధ్యమంగా చేసుకుని వాటి మీద శాసనాలను చెక్కించి ప్రజలకు కనిపించేలా స్థాపించారు. దేవాలయాలు, కోటలు మొదలైన ప్రదేశాలలో వీటిని ఇప్పటికీ చూడ వచ్చు. అలాగే రాజాజ్ఞను ప్రజలకు చేరవేయడానికి మనిషి డప్పు, ఢంకా వంటివి వాయిస్తూ మాటాలతో బిగ్గరగా పలుకుతూ ఉంరంతా తిరుగుతూ ప్రచారం చేసే వారు. ఆ కాలంలో విద్యుత్‌ పరికరాలు కనిపెట్ట లేదు కనుక ప్రజలకు సమాచారం ఈ విధంగా అందేది. డప్పు వాయిస్తూ విషయాన్ని బిగ్గరగా మాటలలో పలుకుతూ ఊరంతా తిరిగే వారు. ఈ పని చేయడానికి ప్రత్యేక ఉద్యోగులు ఉండే వారు. ఈ పద్దతిని చాటింపు అంటారు. ఇందులో డప్పు శబ్ధం ముందుగా ఆకర్షించి తరువాత మాటలు ప్రజలను చేరుతాయి. ఢంకా ప్రత్యేకమై ఉన్నత ప్రదేశంలో ఉంచి పెద్దగా వాయిస్తూ అతి బిగ్గరగా చెప్తారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద గంటలను రాజ భవనం ముందు ఉంచే వారు. ప్రజలు రాజుకు విన్న వించాలని అనుకున్నప్పుడు గంట వాగించి ఆతరువాత రాజోద్యోగుల ద్వారా రాజును దర్శించి తమ విన్నపాలను రాజుకు చెప్పుకునేవారు. కాగితం లేని రోజులలో రాజ్యాల మద్య సందేశాలను వస్త్రం మీద వ్రాయబడిన లేఖల ద్వారా ప్రత్యేక ఉద్యోల చేత అందించబడేది. వీరిని వార్తాహరులు అనే వారు. ఇదీ ఒక మాధ్యమమే.
=== వస్తురూప మాధ్యమం ===
ప్రాచీనకాల రాతి పనిముట్లు రాతియుగపు మానవుని తొలి నైపుణ్యంగా అప్పటి వారి సాంకేతిక జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. తవ్వకాలలో లభించే వస్తువులు, నగరాలు పురాతన మానవ సంస్కృతిని అధునికులకు చేరవేస్తున్నాయి. శిలాజాలు భూమి మీద నశించిన జీవరాశుల రహస్యాలను ఇప్పటి మానవులకు అందిస్తున్నాయి. దేవాలయ శిల్పాలు ఆ కాలపు నాట్య భంగిమలను, పురాణ కధలను అందిస్తున్నాయి. ఖజూరహో శిల్పాలు, బేలూరు, హళి బీడు శిల్పాలు
నాట్య భంగిమలకు ప్రసిద్ధి. ఆ కాలపు శిక్షించిన విధానాన్ని సుచీంద్రం కేవెలలో శిలారూపంలో చూడవచ్చు. శిల్పకళా వైరుద్యాలు వాటిని నిర్మించిన కాలాన్ని అప్పటి సంస్కృతిని ఈ కాలానికి అందిస్తున్నాయి. కుడ్యచిత్రాలు, చిత్రలేఖనాలు కూడా అప్పటి చరిత్రను వేషధారణను మరింత విశదీకరిస్తాయి.
=== కళారూప మాధ్యమం ===
"https://te.wikipedia.org/wiki/మాధ్యమము" నుండి వెలికితీశారు