మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
కాగితం, కలం కనుగొనడం మాధ్యమంలో విపవాత్మకమైన మార్పులబ్ను తీసుకు వచ్చింది. రాజ్యాంగపరమైన విషయాలను, రాజ్యాంగ వ్యవహారాలను, ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలు, నూతన పరిశోధనలు వంటి అనేక విషయాలను ప్రజల మద్యకు దినపత్రికల రూపంలో అందడం మొదలైంది. అలాగే వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు వ్యాపారసరళిలో కధలు, కావ్యాలు, ధారావాహికలు, చిట్కాలు , స్త్రీలను ఆకర్షించే అల్లికలు, వంటలు, ముగ్గులూ, పిల్లను ఆకర్షించే బొమ్మల కధలు, అందరినీ ఆకర్షించే వ్యంగ్య చిత్రాలతో ప్రజలను రంజింపచేసాయి. కొందరు ఔత్సాహికులు చేతివ్రాత పత్రికలు కూడా నడిపారు. అచ్చుతో పని లేకుండా చేతితో వ్రాసి ఒకరికి ఒకరు అందిస్తూ చదువుతూ పోవడం. కరపత్రాలు అనే చిన్న కాగితాలలో ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి పెట్టి ప్రజలకు సమాచారాన్ని అందించడం అచ్చు యంత్రాల ఉపయోగంతో సాధ్యమైంది. కొన్ని మతపరమైన పుస్తకాలను ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి మతప్రచారం చేస్తూ ఉండడం జన విదితమే. హిందువులు దేవతా స్తోత్రాలను చిన్న చుఇన్న పుస్తకాలుగా ముద్రించి దైవప్రీతి కొరకు భక్తులకు పంచి ఇస్తారు. క్రైస్తవులు తమ ప్రవక్తలు కధలను సువార్తలు అన్న పేరుతో ముద్రించి అందరికీ ఉచితంగా ఇస్తుంటారు.
=== శబ్ధరూప మాధ్యమం ===
రేడియో కనిపెట్టిన తరువాత శబ్ధరూప మాద్యమం మరింత ఊపందుకుంది. ఒకప్పుడు కొమ్ము బూరలను, శంఖనాదాన్ని, గంటా నాదాన్ని శబ్ధరూప మాధ్యమంగా వాడుకున్నారు. విదేశీ నావికులు తాము వ్యాపారార్ధం పట్టుకు వచ్చిన వస్తువులను విక్రయించడానికి శబ్ధరూపమైన సింగి నాదాన్ని వాయించి ప్రకటించే వారు. ప్రజలు ఆశబ్ధం విని వెళ్ళి సామాను కొనే వారు. అందుకే సింగినాదం విని జీలకర కొనేవారు కనుక సింగినాదం జిలకర అనే సామెత వచ్చింది. రాజులు లాలంలో యుద్ధం ఆరంభించడానికి ముందు శంఖనాదంతో తమ సంసిద్ధతను చాటే వారు. కొందరు సన్యాసులు, భిక్షుకులు కూడా ఒకప్పుడు శంఖనాదం చేసేవారు. చర్చిలో గంటానాదంతో కొన్ని విషయాలను చెప్పేవారు. రాజులు గంటా నాదంతో ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. వేదాలు శబ్ధరూపంగానే వినపడ్డాయి. అవి ఎవరిచేత రచింపబడ లేదు కనుక అవి అపౌరుషేయాలు, శ్రుతులైనాయి. వేదాలను పఠించడం ద్వారానే గురువుల నుండి శిష్యులు నేర్చుకుంటారు. ఆకాశవాణి వచ్చిన తరువాత శబ్ధరూప మాద్యమంలో మరింత మార్పులు వచ్చాయి. ఊదయం భక్తి గీతాలతో ప్రారంభం చేసి సూక్తులు చెప్పి వ్యవసాయదారులకు సూచనలు అందించి దేశంలో జరిగిన విశేషాలను వార్తలలో అందించడం వరకు ఆకాశవాణి కార్యక్రమాలద్వారా ప్రజలకు అందించేది. పంచాయితీలలోను రేడియోలను పెట్టి చదువు కోని పామరులకు విశేషాలు తెలుసుకోవడం సులువైంది. సంగీతం, కధలు, నాటకాలు, స్త్రీల కార్యక్రమాలు, బాలల పాటలు ఆకాశ వాణి అందించేది. చలన చిత్రాలను శబ్ధరూపంలో విని ఆనందించే వారు. రేడియో ఉండడం అప్పట్లో అంతస్థుకు చిహ్నం. రేడియోల ముందు గుంపులుగా కూర్చుని ఆనందించిన సందర్భాలు కోకొల్లలు. ప్రజలకు అత్యవసరంగా అందించ వలసిన హెచ్చరికలు సైతం ఆకాశవాణి ద్వారానే ప్రలకు చేరేవి.
"https://te.wikipedia.org/wiki/మాధ్యమము" నుండి వెలికితీశారు