మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
=== చలన చిత్ర రంగం ===
వినోదమే ప్రధానమైన మాధ్యమం చలన చిత్రరంగం. అప్పటి వరకూ ప్రజల మనసులను దోచుకున్న నాటకరంగాన్ని త్రోసి రాజని చలన చిత్ర రంగం ముందుకు సాగింది. ముందు మూకీ చిత్రాల విడుదల. మాటలు లేకపోయినా ప్రజలను చిత్రరంగం సమ్మోహన పరచింది. తరువాత చిత్రాలకు మాటలు పాటలు పద్యాలను చేర్చి ప్రదర్శించ గలిగారు. చిత్రరంగం ప్రజల జీవితంలో ఒక భాగం అయి పోయింది. ఒకప్పటిలా కాకున్నా ఇప్పటికీ చలన చిత్రాలకు ప్రజల జీవితంలో చలన చిత్రాల స్థానం ప్రత్యేకమే. చలన చిత్రాలు ప్రజలకు చరిత్రను సదృశ్యకంగా చూపించాయి. పల్నాటి యుద్ధము, మహామంత్రి తిమ్మరుసు, అనార్కలి, తెనాలి రామకృష్ణ, అల్లూరి సీతారామ రాజు వంటి అనేక చిత్రాలు ప్రజల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. పౌరాణిక చిత్రాలు ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. రామాయణ, మహా భారతం, శివపురాణం వంటి పురాణేతిహాసాలలోని ఘట్టాలు అనేకం వివిధ చిత్రాలుగా విడుదలై ప్రజాదరణ పొంది అమోఘ విజాయాన్ని సాధించాయి. భక్తుల చరిత్రలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, స్వాతంత్ర్య సమరయోధుల గురించిన చిత్రాలు ప్రజలకు ఆనాటి రోజులను కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రజలను అలరించాయి. చిత్రరంగం వినోదము అందించడామే కాక అనేక మందికి జీవనోపాధికి కారణమైంది. చలనచిత్ర నటులు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. అభిమాన సంఘటితమై సంఘాలు ఏర్పరుచుకున్నారు. నాయకులకు పాలాభిషేకం చేసి గుడి కట్టి పూజించేంతగా నటులు ప్రజాభిమానం సంపాదించుకున్నారు. ఒకాపటి నాటక నటులు తరువాత చలచిత్ర నాయకులు, నిర్మాతలు అయ్యారు. హిందీ నటుడు రాజకపూర్ కుటుంబం అందుకు తార్కాణం. వారి తండ్రి పృధ్వీరాజ్ కపూర్ నాటకరంగం నుండి చిత్రరంగానికి వచ్చి చిత్రరంగంలో శాశ్వత స్థానం సపాదించాడు. వారి కుటుంబం ఇప్పటికీ చిత్రరంగంలో ప్రత్యేకత సంతరించుకుంది. అక్కినేని నాగేశ్వరరావు వంటి మహా నటులను చిత్రరంగానికి అందించినది నాటక రంగమే. చిత్ర రంగం నుండి రాజకీయాలలో ప్రవేశించిన ఎమ్.జి.రామచంద్రన్, పౌరాణిక పాత్రధారణతో ఆయా పాత్రలకు ప్రాణం పోసిన నందమూరి తారక రామారావు, వివిధ భాషలలో నటించి ప్రజాభిమానం చూరగొన్న జయలలిత వంటి నటీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయంగా ఆయారాష్ట్ర ఉన్నత స్థానాలైన ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నారు. చిత్ర రంగం కళాకారులంరి సమైక్య కృషితో పని చేస్తుంది కనుక వెంపటి చిన సత్యణం వంటి నృత్య కళాకారులు, ఘంటసాల, ఎస్.పి బాలసుభహ్మణ్యం, పి సుశీల వంటి అనే గాయక గాయణీ మణులను ప్రతిభను ప్రజలకు పరిచయం చేసింది.
=== దూరదర్శన్ ===
చలన చిత్రాల తరువాత ప్రజాజీవితంలో ప్రవేశించిన దూరదర్శన్ ప్రజాలను ప్రజల మనసును చలన చిత్రాల నుండి కొంత త్న వైపు తిప్పుకుంది. ప్రారంభంలో బ్లాక్ & వైట్
టి.వి లతో ప్రారంభం అయింది. వీటిని కూడా ముందు పంచాయితీ కార్యాలయాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆరంభదశలో పంచాయితీ కార్యాలయాలలో అనేక మంది ప్రజలు కూడి చలనచిత్రాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇరుగు పొరుగు కూడా వచ్చి దూరదర్శన్ కార్యక్రమాలు చూస్తుండే వారు. ఇంట్లో కూర్చుని కార్యక్రమాలను చూస్తూ పొద్దు పుచ్చడం ప్రజలను ఆకర్షించిది. తరువాత క్రమంగా ఇంటింటికి టి.విలు వచ్చాయి. చాలా కాలం వరకు దూరదఋసన్ కార్యక్రమాలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేవి. అప్పట్లో ఏంటెనాలను బిగించి దాని ద్వారా ప్రసారాలు సాగేవి. ప్రభుత్వరంగం ఆధీనంలో ఉన్నప్పుడు ప్రాంతీయ భాషా కార్యక్రమాలకు సమయం కొంత మాత్రమే కేటాయించ బడింది. మిగిలిన సమయం దేశీయ భాష అయిన హిందీకి ముఖ్యత్వం ఉండేది. తరవాతి కాలంలో ప్రైవేటు రగం దూరదర్శన్ రంగంలో ప్రవేశించడంలో ప్రాంతీయ భాషా కార్యక్రమాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వ్యాపార దృక్కోణం కారణంగా కార్యక్రమాల నాణ్యత పెరిగింది. బ్లాక్ & వైట్ స్థానంలో కలర్ టి.విలు వచ్చాయి. దూరదర్శన్ కారణంగా ప్రజలకు పుస్తక పఠనం మీద ఉన్న ఆసక్తి కొంత తగ్గింది. ఇంటి ముంగిటలో కూర్చుని పొద్దుపుచ్చగలిగిన కారణంగా చలన చిత్రాలకు వెళ్ళే ప్రజల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. దూరదర్శన్ రంగం అనేకమందికి ఉపాధి వనరుగా మారింది. సంపాదనలో వెనుక బడిన చలనచిత్ర నటులకు సాంకేతిక నిపుణులకు నూతన ఆదాయ మార్గం కల్పించింది. దూరదర్శన్ వినోద కార్యక్రమాలే కాక విజ్ఞాన కార్యక్రమాలకు నెలవయ్యింది. డిస్కవరీ, హిస్టరీ, నేష్సనలు గియోగ్రఫీ లాంటి అనేక చానల్స్ ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య సంబంధిత కార్యక్రమాలకు ప్రత్యేక చానల్స్ ఉన్నాయి. క్రీడలను ప్రత్యక్ష ప్రసారాలు చూడడానికి స్పోర్ట్ చానల్స్ ఉన్నాయి. భక్తి కార్యక్రమాలకు ప్రత్యేక చానల్స్ ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ విధాలకు ప్రజలకు అందించే వసతి కొరకు స్వంత చానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా దూరదర్శన్ రంగం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.
 
=== విద్యుత్ పరికరాల మాధ్యమం ===
"https://te.wikipedia.org/wiki/మాధ్యమము" నుండి వెలికితీశారు