ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:مؤسسات فناوری هندوستان
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:भारतीय प्रौद्यौगिकी संस्थानम्; పైపై మార్పులు
పంక్తి 1:
[[బొమ్మదస్త్రం:IIT-locations.svg|right|thumb|270px|ఐఐటీలు ఉన్న ప్రాంతాలు]]
'''ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ''' (ఐఐటీ)లు (Indian Institute of Technology) భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో పదిహేను ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ఐఐటీ విద్యార్థులు సాధారణంగా ఐఐటియన్లుగా వ్యవహరించబడతారు.
 
పంక్తి 6:
ఐఐటిలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండి, ఆయా రంగాలలో తమదైన ముద్ర వేశారు. వీటికున్న స్వయంప్రతిపత్తి అధికారం వలన ఇవి ఇతర భారతీయ యూనివర్సిటీల్లో ఇచ్చే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) కాక (B.Tech) డిగ్రీని బ్యాచిలర్ విద్యార్థులకు అందజేస్తాయి. ఐఐటీలు విజయవంతం కావడంతో, వీటిని పోలిన ఐఐఎమ్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్), ఎనైటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఐఐఐటీ మొదలైన సంస్థలు కూడా ప్రారంభించేందుకు వీలు కలిగింది.
 
== ఐఐటీ సంస్థలు ==
ప్రస్తుతం ఉన్న ఏడు ఐఐటీలు [[ఖరగ్‌పూర్]], [[ముంబై]], [[చెన్నై]], [[కాన్పూర్]], [[ఢిల్లీ]], [[గౌహతి]], [[రూర్కీ]] లో ఉన్నాయి. అన్నీ సంస్థలకూ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉండటం వలన వాటి పాఠ్యప్రణాళికలను అవే రూపొందించుకుంటాయి.
 
పంక్తి 18:
}}</ref>
 
[[బొమ్మదస్త్రం:IITB_Main_Building.jpg|right|thumb|ఐఐటి బొంబాయి ప్రధాన భవనం]]
 
 
పంక్తి 45:
| date = [[2006-03-17]]
| url = http://www.iitk.ac.in/infocell/iitk/newhtml/history.htm
| title = IIT Kanpur &mdash; History
| publisher = IIT Kanpur
| accessdate = 2006-05-27
}}</ref>దీని విస్తీర్ణం 1200 ఎకరాలు. 10 హాస్టల్ భవనాలు ఉన్నాయి. ఇక్కడ 500 మంది అధ్యాపకులు మరియు సుమారు 2,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు అంతే సంఖ్యలో పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉంటారు.
[[బొమ్మదస్త్రం:IIT_Guwahati.jpg|right|thumb|ఐఐటీ గౌహతి పైనుంచి చూస్తే]]
ఈశాన్య రాష్ట్రమైన [[అస్సాం]] రాజధాని [[గౌహతి]] లో [[బ్రహ్మపుత్రా నది]] ఉత్తరపు ఒడ్డున ఐదవ ఐఐటీని [[1994]]లో స్థాపించారు. చుట్టూ కొండల మధ్య రమణీయమైన ప్రకృతి ఒడిలో సుమారు 700 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఇది కొలువు తీరి ఉండటం వలన ఇక్కడికి పర్యాటకులు కూడా విచ్చేస్తుంటారు.<ref name="IITG">{{cite web|url=http://www.iitg.ac.in/gen/about.html|title=About - Indian Institute of Technology Guwahati|accessdate=2006-08-25|date=[[2006-08-12]]|publisher=IIT Guwahati}}</ref> ఇక్కడ సుమారు 1,300 అండర్ గ్రాడ్యుయేట్లు, 500 మంది పిజి విద్యార్థులు, 18 విభాగాలు, మరియు 152 మంది అధ్యాపకులు ఉన్నారు.
 
పంక్తి 61:
}}</ref>ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. [[1854]] నుంచీ థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఉన్న సంస్థ [[1949]] లో రూర్కీ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకొంది.మరలా [[2001]] ఐఐటీ రూర్కీగా రూపాంతరం చెందింది.
 
== పరిపాలనా వ్యవస్థ ==
[[బొమ్మదస్త్రం:IIT-Organisational-structure.svg.png|thumb|280px|ఐఐటీల పరిపాలనా వ్యవస్థ]]
ఐఐటిల పరిపాలనా వ్యవస్థలో భారత రాష్ట్రపతి అతున్నత స్థాయిలో ఉంటాడు. ఆయన క్రింద ఐఐటీ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖా మంత్రి, అన్ని ఐఐటీల చైర్మన్లు, అన్ని ఐఐటీల డైరెక్టర్లు, యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్ చైర్మన్, CSIR (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) చైర్మన్, IISc (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) చైర్మన్, మరియు డైరెక్టర్, ముగ్గురు పార్లమెంటు సభ్యులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి మరియు కేంద్ర ప్రభుత్వం , AICTE( ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), మరియు రాష్ట్రపతి ప్రతిపాదించిన ముగ్గురు సభ్యులు ఉంటారు.
 
ఐఐటీ కౌన్సిల్ క్రింద ప్రతి ఐఐటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వీరి క్రింద సంస్థ యొక్క డైరెక్టర్ ఉంటాడు. సంస్థ మొత్తానికీ ఈయనే ముఖ్య నిర్వహణాధికారి. డైరెక్టర్ల క్రింద డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు. ఇంకా క్రిందకు వెళితే డీన్లు, విభాగాధిపతులు, రిజిస్ట్రార్లు, విధ్యార్థి సంఘం యొక్క చైర్మన్, హాల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఉంటారు. విభాగాధిపతుల కింద ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉంటారు.వార్డెన్లు హాల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ క్రింద ఉంటారు.
 
== ప్రవేశార్హతలు ==
[[బొమ్మదస్త్రం:Mathdept.jpg|thumb|right|225px|ఐఐటీ ఢిల్లీ లో గణితశాస్త్ర విభాగం]]
అన్ని ఐఐటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE) ద్వారా బ్యాచిలర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. ప్రతియేటా సుమారు 350000 మంది పరీక్షకు హాజరయితే అందులోంచి కేవలం 5000 మంది విద్యార్థులు మాత్రమే ఐఐటీలలో ప్రవేశం దక్కుతుంది. ఎంటెక్ కోర్సులకు GATE (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)పరీక్ష ద్వారానూ, ఎంఎస్సీ కోర్సులకు JAM పరీక్ష ద్వారా, M.Des కోర్సులకు CEED పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అన్ని ఐఐటీలలో కలిపి సుమారు 15 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 12 వేలమంది పోస్టు గ్రాడ్యుయేట్లు, మరియు పరిశోధనా విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు.
 
== రిజర్వేషన్లు ==
[[భారతీయ రాజ్యాంగం|భారతీయ రాజ్యాంగాన్ని]] అనుసరించి అన్ని ఐఐటీలలో [[1973]] నుంచి [[షెడ్యూల్డు కులాలు|షెడ్యూల్డు కులాల]] వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఐఐటిల ప్రవేశ విధానం ప్రకారం మొత్తం సీట్లలో 15% షెడ్యూల్డు కులాల వారికీ 7.5% [[షెడ్యూల్డు తెగలు|షెడ్యూల్డు తెగల]] వారికీ కేటాయించ బడ్డాయి.
 
ఇతర వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పించాలని [[మండల్ కమీషన్]] నివేదిక సమర్పించినా [[2006]] వరకూ ఈ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించబడలేదు. ఐఐటీలు ఈ సీట్లు ఖచ్చితంగా నింపాలి అనే నియమమేమీ లేదు. ఐఐటీలు విద్యార్థులను ఎంపిక చేసే విధానాల్ని బట్టి వీటిలో చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. [[2004]] వ సంవత్సరంలో షెడ్యూల్డు తెగల వారికీ కేటాయించ బడ్డ 279 సీట్లలో 112, షెడ్యూల్డు కులాల వారికి కేటాయించబడ్డ 556 సీట్లలో 11 ఖాళీగానే ఉండిపోయాయి.
 
== విద్య ==
[[బొమ్మదస్త్రం:IITKLibrary.jpg|thumb|300px|కేల్కర్ గ్రంథాలయం, ఐఐటీ కాన్పూర్]]
ఐఐటీలకు భారతదేశంలో మరే ఇతర ఇంజనీరింగ్ కళాశాల పొందనన్ని నిధులు భారత ప్రభుత్వం సమకూరుస్తుంది. <ref name="funding">{{cite web
| authorlink = CURRENT SCIENCE, VOL. 86, NO. 3
పంక్తి 100:
అన్ని ఐఐటీలలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి క్రెడిట్ విధానాన్ని అవలంభిస్తారు. కోర్సుల యొక్క ప్రాముఖ్యతను బట్టి ఒక్కో కోర్సుకు ఎన్ని క్రెడిట్లు ఉండాలో నిర్ణయిస్తారు. 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయన్నదాన్ని బట్టి గ్రేడ్ ను నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కో మార్కుల రేంజికి ఒక్కో గ్రేడ్ (10 లోపు) ఉంటుంది. ఒక్కోసారి తరగతి మొత్తం ప్రతిభను పరిగణనలోకి తీసుకుని రిలేటివ్ గ్రేడింగ్ విధానాన్ని కూడా అనుసరించడం జరుగుతుంది. ప్రతీ అర్థ సంవత్సరానికి (సెమిస్టర్) ఒకసారి పరీక్షలు నిర్వహించి ఆ సెమిస్టర్ లోని కోర్సులలో ఒక విద్యార్థి సాధించిన గ్రేడ్ల సగటును లెక్కిస్తే వచ్చేది సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(SGPA). అలాన్ని SGPA లకు సగటును లెక్కిస్తే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (CGPA) వస్తుంది.
 
=== అండర్ గ్రాడ్యుయేట్ విద్య ===
[[Imageదస్త్రం:IITM Library.JPG|thumb|300px|ఐఐటీ మద్రాసు గ్రంథాలయం]]
ఐఐటీల నుంచి ఎక్కువగా బిటెక్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా బయటకు వస్తుంటారు. కొద్ది మంది డ్యుయల్ డిగ్రీ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. బిటెక్ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. విద్యార్థి ఎనిమిది సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.<ref name="BTP2">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance No.3)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref>డ్యుయల్ డిగ్రీ కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. మొదటి సంవత్సరం అన్ని బిటెక్ మరియు డ్యుయల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఒకే కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది. <ref name="BTP3">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> కొన్ని విభాగాలలో దానికి సంభందించిన ప్రాథమిక సబ్జెక్టులను కూడా చేరుస్తారు.<ref name="BTP7">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.4.2:Class Committee)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> ఈ కామన్ కోర్సులు అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు ([[ఎలక్ట్రానిక్స్]], [[యాంత్రిక శాస్త్రము]], [[రసాయన శాస్త్రము]], [[భౌతిక శాస్త్రము]]) సంభందించిన ప్రాథమిక భావనలను విద్యార్థులకు పరిచయం చేస్తారు. మొదటి సంవత్సరం తరువాత విద్యార్థుల ప్రతిభను ఆధారంగా చేసుకుని వేరే విభాగానికి మారడానికి కూడా అవకాశం కల్పించబడుతుంది.<ref name="BTP4">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.5.0:Change of Branch)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> కానీ ఈ విధానం కేవలం మెరిట్ విద్యార్థులకు మరియు ఖచ్చితమైన విధానాలతో కూడుకొన్నది కావున దీని ద్వారా కొద్ది మార్పులు మాత్రమే జరుగుతాయి.<ref name="BTP4"/>
 
పంక్తి 114:
}}</ref>
 
=== ఉన్నత విద్య ===
ఐఐటీలలో ఎంటెక్, ఎంబీయే, ఎమ్మెస్సీ, PGDIT, MMST, MCP, PGDIPL, M.Des, PGDMOM మొదలైన అనేక పోస్టుగ్రాద్యుయేట్ కోర్సులను అందిస్తాయి. పరిశోధనా విద్యార్థుల కోసం పీహెచ్‌డీ లను కూడా అందిస్తాయి. పీహెచ్‌డీ లో విద్యార్థి ఒక ప్రొఫెసర్ సూచించిన సమస్య పైన లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాజెక్టు పైన పని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క కాలవ్యవధి నిర్దిష్టంగా ఉండదు. ఇది విద్యార్థులు పరిశోధన చేసే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పరిశోధన అనంతరం వారు పరిశోధనావ్యాసాన్ని సమర్పించాల్సి ఉంటుంది మరియు వారి పరిశోధనను సమర్థించుకోవాల్సి ఉంటుంది. పరిశోధన సమయంలో భోధనావకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది. కొన్ని ఐఐటీలు ఎమ్మెస్ (M.S) కోర్సును కూడా అందిస్తున్నాయి. ఎంటెక్ మరియు ఎమ్మెస్ కు తేడా ఉన్నదల్లా వ్యాసాన్ని (Thesis) ను సమర్పించడమే. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎనైటీలు కలిపి ఇంజనీరింగ్ లో 80% PhD లను విడుదల చేస్తున్నాయి.<ref name="PhD">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 25}}</ref>
 
ఐఐటీలు బిటెక్ మరియు ఎంటెక్ కోర్సులకు కలిపి కొన్ని డ్యుయల్ డిగ్రీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ కోర్సులను మిళితం చేస్తారు. దీని కాలవ్యవధి ఐదు సంవత్సరాలు.<ref>http://www.iitm.ac.in/Academics/Ordinances.html#DUAL Ordinance under Ordinance No. 3</ref> విడివిడిగా బిటెక్ మరియు ఎంటెక్ చేయడం వలన ఆరు సంవత్సరాలు పడుతుంది.<ref name="Dude">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 6}}</ref> ఈ విధమైన కోర్సు విధానం ఐఐటీ విద్యార్థులు పోస్టుగ్రాడ్యుయేషన్ కు వేరే విద్యాసంస్థకు వెళ్ళకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఒక్క ఐఐటీ గౌహతి తప్ప మిగిలిన ఐఐటీలన్నీ మేనేజ్‌మెంట్ పై కోర్సులను అందిస్తున్నాయి (చూడండి: [[భారతదేశంలో విద్య]] )
 
== సంస్కృతి మరియు విద్యార్థి జీవితం ==
:అన్ని ఐఐటీలు విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ, పరిశోధనా విద్యార్థులకూ క్యాంపస్ లోపలే వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. విద్యార్థులు తాము చదివినంతకాలం హాస్టళ్ళలోనే ఉంటారు. విద్యార్థులు తమ మొదటి సంవత్సరంలో NSS కానీ, NCC కానీ , NSO కానీ ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని ఐఐటీలలో [[క్రికెట్]],[[వాలీబాల్]],[[హాకీ]],[[బాస్కెట్ బాల్]],[[లాన్ టెన్నిస్]], [[బ్యాడ్మింటన్]] మొదలైన ఆటలకోసం మైదానలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఐఐటీలలో వినోద సౌకర్యాలకూ కొదవలేదు. అన్ని భాషల సినిమాలు ప్రదర్శించడానికి అనువుగా ఓపెన్ ఎయిర్ థియేటర్లు కూడా ఉంటాయి. ఇవి కాక ప్రతీ ఐఐటీ ప్రతీ యేటా సాంస్కృతిక సంబరాలను కూడా జరుపు కొంటుంటాయి. ఈ సంబరాలలో బయటి కళాశాలల్ విద్యార్థులు కూడా విచ్చేసి తమ కళలను ప్రదర్శిస్తారు.
=== <small>సాంకేతిక ఉత్సవాలు</small> ===
:ప్రతీ ఐఐటీలో ప్రతీ ఏడాదీ సాధారణంగా మూడు రోజుల నుంచి నాలుగు రోజుల పాటు సాంకేతిక ఉత్సవాలు (Technical Festivals) జరుపుకుంటారు. ఐఐటీ రూర్కీలో [[కోగ్నిజన్స్ ]] (Cognizance), ఐఐటీ మద్రాసులో [[శాస్త్ర]] (Shaastra), ఐఐటీ కాన్పూర్ లో [[టెక్‌కృతి]] (Techkriti), ఐఐటీ ఖరగ్పూర్ లో [[క్షితిజ్]] (Kshitij), ఐఐటీ బాంబే లో [[టెక్‌ఫెస్ట్]] (Techfest), ఐఐటీ ఢిల్లీ లో [[ట్రిస్ట్]] (Tryst), ఐఐటీ గౌహతిలో [[టెక్నిక్]] (Techniche) అనే పేర్లతో నిర్వహించబడతాయి. వీటిలో చాలావరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించబడతాయి. ట్రిస్ట్ ఉత్సవానికి ఎక్కువ మంది హాజరవడమే కాకుండా ఇక్కడ అనేక విధాలైన కార్యక్రమాలు కూడా చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఐఐటీ మద్రాసులో కేవలం విద్యార్థులచే నిర్వహించబడే [[శాస్త్ర]] ప్రపంచ నాణ్యతా పరమైన ప్రమాణాలు పాటిస్తూ [[ISO 9001:2000]] సర్టిఫికేట్ ను సంపాదించింది.<ref name="ISO">{{cite web
| last = The Director
| first = IIT Madras
పంక్తి 133:
| accessdate = 2006-05-26
}}</ref>
== <small>సాంస్కృతిక సంభరాలు</small> ==
కేవలం సాంకేతిక ఉత్సవాలే కాక ఐఐటీలలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా మూడు నాలుగు రోజుల పాటు జరుపుతారు. [[ఐఐటీ రూర్కీ]] లో [[థామ్సో]] (Thomso), [[ఐఐటీ మద్రాసు]]లో [[సారంగ్]] (Saarang), [[ఐఐటీ కాన్పూరు]] లో [[అంతరాజ్ఞి]] (Antaragni), [[ఐఐటీ ఖరగ్‌పూర్]] లో [[స్ప్రింగ్ ఫెస్టివల్]] (Spring Fest), [[ఐఐటీ బాంబే]] లో [[మూడ్ ఇండిగో]] (Mood Indigo ), [[ఐఐటీ ఢిల్లీ]] లో [[రెండెజ్వస్]] (Rendezvous), [[ఐఐటీ గౌహతి]]లో [[ఆల్కెరింగా]] (Alcheringa) అనే పేర్లతో నిర్వహించబడతాయి.
[[బొమ్మదస్త్రం:Illumination festival.JPG|thumb|left|225px|ఐఐటీ ఖరగ్పూర్ లో ప్రమిదలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన]]
 
ఇవి కాకుండా ఐఐటీ ఖరగ్‌పూర్ మరియు ఐఐటీ బాంబే ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ [[దీపావళి]] రోజున [[ఇల్యూమినేషన్]] ఫెస్టివల్ మరియు రంగోలి ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఉత్సవంలో ఎత్తుగా నిర్మించిన వెదురు కట్టడాల మీద మట్టితో చేసిన [[ప్రమిద]]లతో మనుషుల రూపాలు, కట్టడాల రూపాలు మొదలైన ఆకారాలు ఏర్పాటు చేస్తారు.<ref name="Illu">{{cite web
పంక్తి 148:
 
 
== గుర్తింపు ==
ఐఐటీలు ఇచ్చే డిగ్రీలు AICTE గుర్తింపు కలిగి ఉండటం వలన వీటికి దేశంలో ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. పూర్వ విద్యార్థులు విదేశాలలో తమ సత్తా చాటడం వలన అక్కడ కూడా వీటికి చాలా గుర్తింపు ఉంది. భారత ప్రభుత్వం IIT చట్టం ద్వారా వీటికి ప్రత్యేక గుర్తింపునివ్వడం ఐఐటీల విజయంలో కీలకమైన అంశం.
 
== విమర్శ ==
ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా ఐఐటీలు విమర్శలకూ లోనయ్యాయి. ఐఐటీలపై ప్రధాన విమర్శ [[మేధో వలస]]( Brain Drain). ఇంకా కొద్దిమంది విమర్శకులు స్త్రీ శాతం తక్కువగా ఉండటం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోకపోవడం వంటి అంశాలను లేవనెత్తుతుంటారు.
 
== పూర్వ విద్యార్థులు ==
ఐఐటీలలో చదివిన పూర్వ విద్యార్థులు తాము చదివిన విద్యాసంస్థల పట్ల గౌరవాన్ని చాటుకోవడం కోసం వివిధ రకాలైన కార్యక్రమాలను చేపడుతుంటారు. స్వదేశం లోనూ మరియు విదేశాలలోనూ ఎన్నో పూర్వ విద్యార్థుల సంఘాలు ఈ సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా సహాయ పడుతున్నాయి. పూర్వ విద్యార్థులు కొందరు ప్రస్తుత ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా, మరియు ధన సహాయం చేయడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
=== ప్రముఖ ఐఐటియన్లు ===
* [[నారాయణ మూర్తి]] - [[ఇన్ఫోసిస్]] చైర్మన్
* [[వినోద్ ఖోస్లా]] - [[సన్ మైక్రో సిస్టమ్స్]] సహ వ్యస్థాపకుడు
* [[కన్వల్ రేఖీ]] - [[నోవెల్]] సీటీఓ
* [[అరుణ్ సారిన్]] - [[వోడాఫోన్]] సీఈఓ
* [[రజత్ గుప్తా]] - [[మెకన్సీ]] మాజీ మేనేజింగ్ డైరెక్టర్
== మూలాలు ==
{{reflist}}
{{విశేషవ్యాసం|2008 ఏప్రిల్ 26}}
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:భారతదేశంలో విద్య]]
[[వర్గం:భారతదేశంలో సాంకేతిక విద్య]]
<!-- అంతర్వికీ లింకులు -->
 
{{link FA|en}}
పంక్తి 187:
[[no:Indian Institute of Technology]]
[[ru:Индийский институт технологии]]
[[sa:भारतीय प्रौद्यौगिकी संस्थानसंस्थानम्]]
[[sv:Indian Institute of Technology]]
[[zh:印度理工學院]]