ఏకలవ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
ఏకలవ్యుడు విలువిద్యలో తనను ఎక్కడ మించిపోతాడేమోనని మదనపడ సాగాడు. తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి తనను అందరి కన్నా మేటి విలుకానిని చేస్తానని ఇచ్చిన మాటను గుర్తు చేశాడు. అప్పుడు ద్రోణుడు అర్జునునికి అభయమిచ్చి రాజకుమారులతో కలిసి ఏకలవ్యుడిని కలవడానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ఎప్పటి లాగే విలువిద్య దీక్షగా సాధన చేస్తున్నాడు. గురువును చూడగానే అత్యంత భక్తి ప్రపత్తులతో గురువాజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఆయన ముందు మోకరిల్లాడు.
 
ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణ ఇమ్మని అడిగాడు.ఏకలవ్యుడు అందుకు సంతోషంగా గురువు ఏదడిగినా సరే ఇస్తానన్నాడు. అప్పుడు ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా ఏకలవ్యుని కుడి చేతి బ్రొటనవేలుని ఇమ్మని అడిగాడు.(కాని కొందరు ఏకలవ్యుడు అడగలేదు, అర్జునుడు అడిగాడు అని అంటారు.) ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుడి అభిప్రాయం. కానీ ఏకలవ్యుడు మాత్రం బెదరక, సందేహించక వెను వెంటనే తన కుడి చేతి బ్రొటన వేలుని ఖండించి గురుదక్షిణ గా సమర్పించాడు. మరోవైపు అర్జునుడు కూడా తెగిన వేలుతో ఏకలవ్యుడు మునుపటి ప్రదర్శన చేయలేడని సంతోషించాడు.
 
==మరణం==
తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ [[స్వయంవరం]] సమయంలో జరాసంధుని కోరిక మేరకు, [[శిశుపాలుడు|శిశుపాలుడికి]] మరియు రుక్మిణీ దేవి తండ్రియైన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. <ref name="ADAthawale_vastav"/> భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణీ శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు.<ref name="ADAthawale_vastav"/><ref>Dowson, John (1820-1881). ''A classical dictionary of Hindu mythology and religion, geography, history, and literature''. [[London]]: Trübner, 1879 [Reprint, London: Routledge, 1979]. Also available at [http://www.mythfolklore.net/india/encyclopedia/ekalavya.htm ప్రాచీన భారతదేశంలోని పురాణ విజ్ఞాన సర్వస్వం]</ref>
"https://te.wikipedia.org/wiki/ఏకలవ్యుడు" నుండి వెలికితీశారు