రక్తం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: av:Би
పంక్తి 71:
 
కార్ల్ లేండ్‌స్టయినర్ , లెవీస్, తదితరులు [[1940]] లో రక్తంలో మరొక వర్గాన్ని కనుక్కున్నారు. దీనిని మొదట రీసస్ కోతులలోను తరువాత మానవులలోను కనుక్కోవడం జరిగింది కనుక రీసస్‌ కోతుల గౌరవార్ధం దీనికి [[Rh-కారణాంశం]] (Rh-factor) అని పేరు పెట్టేరు. ఈ కారణాంశం కలిగిఉన్న వారిని 'Rh+' అని లేని వారిని 'Rh-' అని అంటారు. మానవులలో ఎక్కువ శాతం మంది 'Rh+' వారున్నారు. ఇప్పుడు 'Rh+' జాతి మగాడు 'Rh-' జాతి ఆడదానిని పెళ్ళి చేసుకుంటే వారికి పుట్టబోయే సంతానం 'Rh+' అయినా కావచ్చు, 'Rh-' అయినా కావచ్చు. ఈ గర్భస్థ శిశువు 'Rh+' అయిన పక్షంలో తల్లి రక్తం ఒక వర్గం, పిల్ల రక్తం మరొక వర్గం అవుతుంది. పిల్ల రక్తంలోని 'Rh+' కారణాంశాలు తల్లి రక్తంలో ప్రవేశించగానే వాటిని పరాయి కణాలుగా గుర్తించి తల్లి శరీరం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ఈ యుద్ధం వల్ల మొదటి కాన్పులో తల్లికి, పిల్లకి కూడ ఏమీ ప్రమాదం ఉండదు. కాని రెండవ కాన్పులో తల్లి గర్భంలో మళ్ళా ఉన్న శిశువు ,మళ్ళా 'Rh+' అయిన పక్షంలో ఆ పిల్ల బతకదు. అందుకని పెళ్ళికి ముందే ఆడ, మగ రక్త పరీక్ష చేయించుకుని జన్యుపరంగా ఎవరెవరి వైఖరి (genetic profile) ఎలా ఉందో తెలుసుకోవటం ఉభయత్రా శ్రేయస్కరం.
==కృత్రిమ రక్తం==
ఎడిన్‌బరో, బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎముకమజ్జ నుంచి గ్రహించిన మూలకణాల నుంచి ఎర్ర రక్తకణాలను సృష్టించారు.దీంతో గుండెమార్పిడి, బైపాస్‌, క్యాన్సర్‌ బాధితులకు ఆపరేషన్‌ చేసే సమయంలో తగినంత రక్తం అందుబాటులో ఉండటం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడే వీలుంది. మూలకణాల నుంచి సృష్టించిన ఈ కృత్రిమరక్తంతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బెడద ఉండదు. పైగా దీన్ని దాదాపు అన్ని రక్తం గ్రూపుల వారికి ఎక్కించొచ్చు కూడా. తొలిదశలోని పిండం నుంచి సేకరించిన మూలకణాలతో ఎర్రకణాలను పెద్దసంఖ్యలో సృష్టిస్తే అప్పుడది నిజం రక్తంలాగానే ఉంటుంది..ఒక్క పిండం నుంచే లక్షలాది మందికి సరిపడిన ఎర్రకణాలను సృష్టించొచ్చు.(ఈనాడు28.10.11)
 
== వ్యాధులు ==
"https://te.wikipedia.org/wiki/రక్తం" నుండి వెలికితీశారు