పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పుష్కర్]]
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction
 
|native_name = Pushkar
|type = city
|skyline =Panoroma of Pushkar Lake in Rajasthan.jpg
|skyline_caption = panoramic view of [[Pushkar lake]]
|latd = 26.5 | longd = 74.55
|locator_position = right
|state_name = Rajasthan
|district = [[Ajmer district|Ajmer]]
|leader_title =
|leader_name =
|altitude = 510
|population_as_of = 2001
|population_total = 14789
|population_density =
|area_magnitude= sq. km
|area_total =
|area_telephone =
|postal_code =
|vehicle_code_range =
|sex_ratio =
|unlocode =
|website =
|footnotes =
|
}}
భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని [[అజ్మీరు]] జిల్లాలోని ఒక ఊరు పుష్కర్(Hindi: पुष्कर). అది [[అజ్మీరు]] జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673)అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కధనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంశం చేయబడ్డాయి. ధ్వంశం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాత కాలంలో ధ్వంశం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి.
బ్రహ్మాఅలయానికి చేరిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్ధంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, ''' మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ''' ఒకటి మరియు ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని '''ప్రంబనన్''' ఒకటి. పుష్కర్6లో 52 ఘాట్లు భక్తుల స్నానార్ధము ఉన్నాయి. పుష్కర్|లొ ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు '''పుష్కర్ కెమేల్ ఫెయిర్''' అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత. కొన్ని దశాబ్ధాలుగా పుష్కర్ యొక్క సహజ వాతావరణ కాలుష్యం కలత చెందవలసిన విధంగా పెరిగిందని భావించబడుతుంది. పర్యాటకుల సౌకర్యార్ధం అడవులను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని భావించబడుతుంది.
Line 7 ⟶ 32:
=== చరిత్ర ===
ప్రస్తుతం ఇక్కడున్న దేవాలయం పదునాలుగవ శతాబ్ధంలో కట్టిందని, కాని దానికి పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితంమే అక్కడ ఆలయం వుండేదని అంటారు. తర్వాత [[ఆదిశంకరాచార్యుడు]] ఒకసారి, మహారాజ జనత్ రాజు మరోసారి ఆలయాన్ని పునరుద్దరించారని చరిత్రకారుల నమ్మకం. ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి వున్నాయి. భక్తులు తమపేరు చెక్కిన వెండి నాణేలను దేవునికి సమర్పిస్తుంటారు. పాలరాతి మెట్లు ఎక్కి మండపం దాటి గర్బగుడిలోకి వెళ్లగానే హంసవాహనం మీద వున్న చతుర్ముఖ [[బ్రహ్మ]]విగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరుసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఆలయ గోడల మీద [[సరస్వతి]]దేవి, ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలొ పూజాదికాలు సనాతనధర్మం ప్రకారమే జరుగు తుంటాయి. గర్బగుడి లోని విగ్రహాన్ని గృహస్థులైన పురుషులు పూజించ రాదు. కేవలం సన్యసించిన వారే పూజించాలి. ఆ సాధువులు కూడ పుష్కర్ లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి వుండాలనేది నిబంధన. గర్బగుడికి ఎదురుగా వున్న మండపంలో వెండితాబేలు వున్నది. ప్రతిఏటా కార్తీక పౌర్ణమితో బాటు ప్రతిపౌర్ణమి , అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలోనె పుష్కర్ జాతర కూడ జరుగుతుంది. ఇది దీపావళి తరవాత వచ్చే ఏకాదశి నాడు మొదలై పౌర్ణమి వరకు జరుగుతుంది. జాతర సమయంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతర హస్తకళలకు పెట్టింది పేరు. ఆలయానికి ఎదురుగా వున్న రెండు కొండలపై వున్న [[సావిత్రి]], [[గాయత్రి]] దేవతలను కూడ భక్తులు దర్శించుకుంటారు . సావిత్రి ముఖ కవళికలు కోపంగాను, గాయిత్రి విగ్రహం భయపడు తున్నట్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఇంకా అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనది అగస్తేశ్వర ఆలయం ఉంది. అందులోని శివలింగం బ్రహ్మ చేత ప్రతిష్టించబడిందని, ఇక్కడ పూజలు చేసి, అభిషేకం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పెద్దదైన ఈ శివలింగం పై రాగితో చేసిన పాము చుట్టు కొని వున్నట్టుటుంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత మరో ఆలయం పేరు రంగ్‌జీ ఆలయం ఉంది. ఇక్కడి [[విష్ణు]]మూర్తిని రంగ్‌జీ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణభారతదేశ శైలిలో వుంటుంది. మరో ముఖ్య మైన ఆలయం వరాహ దేవాలయం. ఇక్కడ విష్ణుమూర్తి వరాహరూపంలో దర్శనమిస్తాడు. ఇంకా ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలున్నాయి.
=== బయటి లింకులు ===
 
[[bn:পুষ্কর]]
[[ca:Pushkar]]
[[de:Pushkar]]
[[es:Púshkar]]
[[eu:Pushkar]]
[[fr:Pushkar]]
[[gu:પુષ્કર]]
[[hi:पुष्कर]]
[[bpy:পুষ্কর]]
[[it:Pushkar]]
[[he:פושקר]]
[[pam:Pushkar]]
[[nl:Pushkar]]
[[ne:पुस्कर]]
[[no:Pushkar]]
[[pnb:گردوارہ پشکر]]
[[pl:Puszkar]]
[[ru:Пушкар]]
[[sv:Pushkar]]
[[vi:Pushkar]]
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు