అట్లతద్ది: కూర్పుల మధ్య తేడాలు

sentence added
పంక్తి 5:
 
==వ్రతవిధానము==
ఈ రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి [[గౌరీపూజ]]చేసి, 1011 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 1011 అట్లు, 1011 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కధ చెప్పుకొని, [[అక్షతలు]] వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 1011 రకాల ఫలాలను తినడం, 1011 మార్లు [[తాంబూలం]] వేసుకోవడం, 1011 మార్లు [[ఊయల]] ఊగడం, [[గోరింటాకు]] పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే '[[ఉయ్యాలపండగ]]' అనీ, '[[గోరింటాకుపండగ]]' అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం తో పెల్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.(సేకరణ:డా.శేషగిరిరావు-శ్రీకాకుళం)
<poem>
అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
"https://te.wikipedia.org/wiki/అట్లతద్ది" నుండి వెలికితీశారు