సంక్రమణం: కూర్పుల మధ్య తేడాలు

చి మకర సంక్రమణంని సంక్రమణంకి తరలించారు: పేజీ మారుస్తున్నాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సంక్రమణమంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. సంవత్సర కాలంలోసూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తుంటాడు.
ఈ అనంత విశ్వంలో జరిగే ప్రధాన సంఘటనల ఆధారంగానే సూర్య చంద్ర గమనాలు, నక్షత్రరాశుల కదలికలు. భూగోళం మీది సమస్త సంస్కృతీ సంప్రదాయాలకు, వైవిధ్యానికి ఆయువు పట్లు. అటువంటి వాటిలో ‘ఉత్తరాయణం’‘[[ఉత్తరాయణం]]’ ముఖ్యమైనది. సూర్యుడు నెలకు ఒక నక్షత్రరాశిలో సంచరిస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. అదే సంక్రమణం. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించటమే మకర సంక్రమణం. అదే మహాపర్వదినం. పన్నెండు రాశుల సంక్రాంతుల్లోనూ ఆషాఢ మాసంలో వచ్చే [[కర్కాటక సంక్రమణం]], పుష్య మాసంలో వచ్చే [[మకర సంక్రమణం]] ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మొదటి సంక్రమణం దక్షిణాయనాన్ని, మకర సంక్రమణం ఉత్తరాయనాన్ని ప్రారంభిస్తాయి. ఉత్తరాయణాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.<br/>
 
ఈ సంక్రమణానికే ఎందుకంత ప్రాధాన్యం?<br/>
==ప్రాధ్యాన్యత=
సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించించడమే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణింపబడుతోంది. అందువల్ల ఈ సంక్రాంతి పర్వదినం చాలా శ్రేష్ఠమైనది. దేవతల పగలుగా చెప్పే ఉత్తరాయణానికి అంతటి విశిష్ఠత ఉండబట్టే కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడి అస్తస్రన్యాసం చేసి మృత్యుదేవత ఒడికి చేరువలో ఉన్న భీష్మపితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ప్రాణాలను నిలుపుకుని అంపశయ్యపై పరుండి ఆ పిమ్మటే ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఉత్తరాయణంలో వచ్చే మకర సంక్రమణానికి అంతటి ప్రాముఖ్యత.
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/సంక్రమణం" నుండి వెలికితీశారు