వారసవాహిక: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ckb:کرۆمۆسۆم
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వారసవాహిక''' అనేది ఇంగ్లీషులోని '[[క్రోమోజోమ్‌]]' ([[ఆంగ్లం]] chromosome) కి తెలుగు సేత. ఇంగ్లీషులో 'క్రోమోజోమ్‌' అన్న మాట గ్రీకు భాషలోని 'క్రోమో' (అంటే రంగు), 'సోమా' (అంటే శరీరం లేదా పదార్ధం) అన్న మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక క్రోమోజోమ్‌ అంటే 'రంగు పదార్ధం'. ఇది క్రోమోజోముల తత్వం అర్ధం కాని రోజులలో అజ్ఞానం వల్ల పెట్టిన పేరు. 'క్రోమోజోమ్‌' కి ఏ రంగూ ఉండదు. సూక్ష్మదర్శిని లో చూట్టానికి వీలుగా ఉంటుందని చాల పదార్ధాలకి రంగు పులుముతారు. ఈ పద్ధతిని ఇంగ్లీషులో staining అంటారు. జీవకణాలకి రంగు పులిమి [[సూక్ష్మదర్శిని]] లో చూసినప్పుడు ఆ రంగు [[కణిక|కణికలో]] (nucleus) ఉన్న జన్యు పదార్ధానికి అంటుకొని గాజు పలకకి ఉన్న పారదర్శకమయిన నేపధ్యంలో ఖణిగా కనిపిస్తుంది. అంతే తప్ప ఈ జన్యు పదార్ధానికి ఏ రంగూ లేదు. కనుక జీవకణంలో[[జీవకణం]]లో ఉన్న కణిక లో ఉన్న జన్యు పదార్ధం లో ఉన్న సన్నటి దారాల లాంటి పదార్ధాన్ని ''వారసవాహికలు'' అని తెలుగులో అందాం.
 
 
"https://te.wikipedia.org/wiki/వారసవాహిక" నుండి వెలికితీశారు