వెంకయ్య స్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నెల్లూరు జిల్లాలోని గొలగమూడిలోకల వెంకయ్య స్వామి ఆలయం ప్రసిద్ద క్షేత్రం. ఈ క్షేత్రం నెల్లూరుకు 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ స్వామి వెంకయ్యను ఆ ప్రాంత ప్రజలు భగవంతునిగా కొలుస్తారు.
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|250px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి ]]
ఈయన స్వస్థలం ఆత్మకూరు సమీపము లోని నాగుల వెల్లటూరు.
 
==జీవిత చరిత్ర==
ఈయన స్వస్థలం ఆత్మకూరు సమీపము లోని నాగుల వెల్లటూరు. ఈయన చిన్నతనములో అందరి బాలులవలే ఉండేవారు కాదు.ఈయన చిన్నతనము నుంచే ఏకాంత ప్రియులు. ఆ వూరి లోని పిల్లలండరూ తగువులు జరిగితే మన స్వామి వారిని తగువు తీర్చమనేవారు. ఈయనను ఒక అవదూతగా, షిర్డీ సాయి తరువాతి అవతారముగానూ చెపుతారు. మరికొందరు దత్తావతారమని తలుస్తారు. వెంకయ్యస్వామి మొఇదట్లో పిచ్చివానిగా పిలవబడుతూ 12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. తదనంతర కాలంలో గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు, దారాలు ఇవ్వడం చేసేవాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన భక్తుల నుద్దేశించి వారికోసం తన సందేశాలను తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దెవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి.
ఈయన చిన్నతనములో అందరి బాలులవలే ఉండేవారు కాదు.ఈయన చిన్నతనము నుంచే ఏకాంత ప్రియులు. ఆ వూరి లోని పిల్లలండరూ తగువులు జరిగితే మన స్వామి వారిని తగువు తీర్చమనేవారు.
 
దేవాలయ కుడ్యాలపై రాసిన వెంకయ్యస్వామి చెప్పిన సూక్తులు :
 
1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.
 
2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.
 
3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.
 
4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.
 
5) ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.
 
6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.
 
7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.
 
8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేది గదయ్యా.
 
9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.
 
10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.
 
11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీ కేముందో అదే నీకు మిగులు కదయ్యా.
 
12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.
 
13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.
 
15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.
 
16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.
 
17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.
 
18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.
 
19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.
 
20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.
 
 
 
 
 
 
==విడియో లింక్ ==
http://www.youtube.com/watch?v=W4nOaF7JeNY
 
==బయటి లింకులు==
* http://www.saimastersevatrust.org/index.html
* http://nellore.ap.nic.in/places.htm
 
 
"https://te.wikipedia.org/wiki/వెంకయ్య_స్వామి" నుండి వెలికితీశారు