పంచారామాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు +[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు)
ద్రాక్షారామము అనే వ్యావహారిక నామాన్ని దక్షారామము అనే అసలైన నామంతో మార్పు చేయడమైనది
పంక్తి 35:
గుంటూరు జిల్లాలో గుంటూరు కు 35 కి.మీ. దూరంలో [[అమరావతి]] క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారం లో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.

==[[ దక్షారామము ( వ్యావహారికంగా ద్రాక్షారామము)]]==
[[బొమ్మ:Draksharama temple.jpg|200px|thumb|right]]

తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామదక్షారామ క్షేత్రం ఉంది.

ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు

శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామముదక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరి గా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.

నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.

భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.

పంక్తి 53:
తూర్పుగోదావరి జిల్లా [[సామర్లకోట]] సమీపం లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి.

ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని [[తూర్పు చాళుక్యులు|చాళుక్య రాజయిన]] భీముడు నిర్మించాడని క్షేత్ర కధనంలో వివరించబడినది. ఈయనే ద్రాక్షరామదక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై షుమారు 922 వరకు సాగింది.

కుమరారామ శ్రీ భీమేశ్వరస్వామి వేంచెసి ఉన్న భీమవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఒక భాగం (అక్షాంశము 17 02' ఉ, రేఖాంశము 82 12' తూ). ఇది పూర్వం ఛాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేస్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది.
పంక్తి 64:
;మరొక నమ్మకము ప్రకారము

1. అమరారామము, 2. ద్రాక్షారామముదక్షారామము, 3. సోమారామము ([[భీమవరము]]), 4. కుమారారామము లేదా భీమారామము (సామర్లకోట), 5. క్షీరారామము (పాలకొల్లు) అనునవి పంచారామములు

[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ]] వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. షుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర టిక్కెట్టు 350 రూపాయలు.
"https://te.wikipedia.org/wiki/పంచారామాలు" నుండి వెలికితీశారు