శ్రీ కృష్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
 
=== మహాభారతంలో ===
[[దస్త్రం:Krishna as Envoy.jpg|thumb|ఎడమ|Krishna-envoy|కురుసభలో రాయబారిగా శ్రీ కృష్ణుడు]]
[[దస్త్రం:Gita-kalamkari-painting.JPG|right|300px|thumb|యుద్ధసమయంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి గీతాబోధ చేయటం.]]
మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణుని అనుబంధం మరువరానిది. పాండవ మధ్యముడైన అర్జునునితో చెలిమి విడదీయరానిది. పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది. శ్రీకృష్ణుని సంప్రదించకుండా దర్మరాజు శకునితో ఆడిన జూదము తప్పమిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే. కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే. [[ద్రౌపది]]ని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలికన్నామిన్నగా చూసుకున్నాడు. వస్ర్తాపహరణ అవమానమునుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది. పాండవవనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు. వారి రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. [[ద్వారక]] సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. [[ఇంద్రప్రస్థం]] లో [[ధర్మరాజు]] చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీ_కృష్ణుడు" నుండి వెలికితీశారు