బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ta:பொம்மிரெட்டி நாகிரெட்டி
పంక్తి 3:
==జీవిత విశేషాలు==
ఈయన [[డిసెంబర్ 2]], [[1912]]న [[వైఎస్ఆర్కడప జిల్లా]] [[‌పొట్టింపాడు]] గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆ పల్లెటూరి వీధిబడిలో [[రామాయణం|రామాయణ]] [[మహాభారతం|మహాభారతాలు]], [[భాగవతము|భాగవతం]]లాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
 
ఆ తర్వాత ఆయన [[మద్రాసు]] (ఈనాటి [[చెన్నై]]) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.
పంక్తి 14:
 
ముద్రణ, ప్రచురణ, సినిమా రంగాల నుంచీ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలనుంచీ ఎన్నో అవార్డులూ, సత్కారాలూ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. విశ్వవిద్యాలయాలు గౌరవడాక్టరేట్లతో సత్కరించాయి.
 
==చిత్రరంగంలో==
మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన [[బొమ్మిరెడ్డి_నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] స్థాపించిన [[వాహినీ పిక్చర్స్|వాహినీ సంస్థ]]లో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో ([[1941]]లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి [[భక్తపోతన]] కు దర్శకత్వం వహించిన [[కె.వి.రెడ్డి]] నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో [[జెమినీ_పిక్చర్స్|జెమినీ]] వారి [[బాలనాగమ్మ]] విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు