చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: gd:Chidambaram
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ml:ചിദംബരം; పైపై మార్పులు
పంక్తి 23:
}}
:''ఈ వ్యాసం కడలూరు జిల్లాలోని ఒక పట్టణానికి సంబంధించినది. [[భారత ఆర్ధిక మంత్రి]] కోసం [[పి. చిదంబరం]] చూడండి.''
'''చిదంబరం''' [[తమిళనాడు]] లోని [[కడలూరు]] జిల్లాకు చెందిన [[మునిసిపాలిటీ]] మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు [[చెన్నై]] కి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది.
 
== పట్టణం ఉనికి ==
పరమ [[శివుడు]] శివతాండవం చేస్తూ [[నటరాజు]] గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నది. [[శైవులకు]] దేవాలయం లేదా [[తమిళం]] లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం -- చిత్ - స్పృహ + [[అంబరం]] - [[ఆకాశం]] - అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.
 
== ఆలయ కథా విశేషం ==
చిదందరం ఇతిహాసం ప్రకారం [[శివుడు|పరమశివుడు]] ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి వెళ్ళాడు.ఈ వనంలో ఉన్న ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగల్గినవారు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి [[ఉసిరి]] కాయలు తింటున్నాడు. శివుని భార్య పార్వతి కూడా శివుని వెంబడించింది.ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబర వాసిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు.
తమ భార్యలూ, ఇతర స్త్రీజనం మోహితులై ఉండటం చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారు. భిక్షువు రూపంలో ఉన్న భగవంతుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారు. భగవంతుడు దాని చర్మం వలిచి నడుముకి బట్టగా కట్టుకున్నాడు. పూర్తిగా విసుగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి 'ముయలకన్' అనే శక్తిమంతమైన మరియు అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. చిరు మందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు. ఋషులు భగవంతుడిని గుర్తెరిగి, తమ మంత్ర తంత్రాలు పని చేయవని తెలుసుకొని ఆయనకు దాసోహమన్నారు.
 
[[ఫైలుదస్త్రం:NatarajaPerumal.jpg|thumb|250px|right|చిదంబరం చిత్సభలో నటరాజమూర్తి. ఎడమ ప్రక్క ఉన్న మూర్తి [[చిదంబర రహస్యం]] - సువర్ణ బిల్వ పత్రాలు మాత్రం కనుపిస్తాయి. కుడివైపున అమ్మవారు శివకామసుందరి.]]
 
జగద్రక్షకుడైన [[విష్ణు]] అవతారానికి పరుపుగా భాసించే ఆదిశేషుడు ఆనంద తాండవం గురించి విని దాన్ని చూసి ఆనందించాలని కుతూహల పడ్డాడు. భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించి, కాలగమనంలో నాట్యము చూపెదనని చెప్పి సాధువైన పతంజలి వేషములో వెళ్ళమని చెప్పి తిల్లాయ్ అడవికి పంపెను. పతంజలి వ్యాఘ్రపాదర్ / పులికాల్ముని (వ్యాఘ్ర / పులి, పాదర్ - పాదములు కలవాడు - ఈయన తేనెటీగలు రాకమునుపే పూవులు కోయటానికి చెట్లెక్కేందుకు వీలుగా పులి కాళ్ళు, చూపు కోరి సంపాదించుకున్నాడు) తో కలిసి తిల్లాయ్ అడవిలోనికి వెళ్ళి భగవంతుణ్ణి శివలింగ రూపంలో పూజించారు. ఆ దేవుణ్ణి ఈ నాటికీ 'తిరుమూలతనేశ్వర్' (తిరు - శ్రీ, మూలతనం - మూలమైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు)గా పూజిస్తున్నారు.
 
పురాణాల ప్రకారం, శివుడు తన దివ్యమైన 'ఆనంద తాండ'వాన్ని [[నటరాజు]] రూపంలో ఆ ఇద్దరు సాధువులకు తమిళుల 'తాయ్' (జనవరి-ఫిబ్రవరి) నెలలో పూసమ్ నక్షత్రపు తేదీన చూపాడు.
 
చిదంబరం అనేక రచనల్లో తిల్లయ్ (ఆలయం ఉన్న తిల్లయ్ అడవిని సూచిస్తూ) అని, పెరుంపత్రపులియూర్ లేదా వ్యాఘ్రపురం (వ్యాఘ్రపాదర్ స్వామి వారి గౌరవ సూచకంగా) అనీ పేర్కొనబడి ఉంది. ఈ ఆలయం'విరాట్ హృదయ పద్మ స్థలం' అంటే కమలం వంటి విశ్వపు గుండెలో ఉన్నదని ప్రతీతి.
 
పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు.
 
ఈ బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడి. ఇందులో స్వామి క్రింద తెలిపిన మూడు రూపాల్లో దర్శనమిస్తారు:
 
1) సంపూర్ణ రూపం - [[నటరాజు]] రూపంలోని స్వామి
పంక్తి 48:
3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం
 
ఈ విధంగా చిదంబరం పంచభూత స్థలాల్లో (పంచభూతములు - భూమి, నీరు, నిప్పు, గాలి మరియు ఆకాశం) ఒకటిగా వెలుగొందుతోంది. మిగిలినవి - భూ స్వరూపంగా కొలువబడుతున్న [[కాంచీపురం]] లోని [[ఏకాంబరేశ్వరర్]] దేవాలయం, నీటి స్వరూపంగా కొలువబడుతున్న [[తిరుచ్చిరాపల్లి]] దగ్గరలోని [[తిరువనైకవల్]] లో గల [[జంబుకేశ్వరర్]] దేవాలయం, అగ్ని స్వరూపంగా కొలువబడుతున్న [[తిరువణ్ణామలై]] లోని [[అన్నమలైయర్]] దేవాలయం మరియు గాలి స్వరూపంగా కొలువబడుతున్న [[శ్రీ కాళహస్తి]] లోని [[శ్రీకాళహస్తీశ్వర]] దేవాలయం.
 
[[పరమశివుడు]] నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభై లు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు [[తిరువాలంగడు]] లోని [[రత్తినసబై]] (రత్తినం - రత్నం), [[కౌర్తాళ్ళం]] లోని [[చిత్రసబై]] (చిత్ర - చిత్రకళకు ప్రతీక), [[మదురై]] లోని [[మీనాక్షి]] దేవాలయంలోని [[రజతసబై]] (రజత - వెండి) మరియు [[తిరునెల్వేలి]] లోని [[నెల్లైఅప్పర్]] దేవాలయంలోని [[తామిరసబై]] (తామిరం - రాగి).
 
== దేవాలయపు భక్తులు ==
 
ఈ దేవాలయపు భక్తుల్లో మొదటివారుగా పరిగణింపబడుతున్నవారు ఆలయ నిర్వహణ చూసే తిల్లై వాళ్ అంధనార్ (తిల్లైలో ఉండే పూజారులు అని అర్థం) అని పిలవబడే పూజారులు.
నలుగురు భక్త కవులు ఈ దేవాలయాన్ని ఈ స్వామిని అజరామరం చేశారు. వాళ్ళెవరంటే [[తిరుజ్ఞాన సంబంథర్]] , [[తిరునావుక్కరసర్]] , [[సుందరమూర్తి నయనార్]] మరియు [[మాణిక్కవసాగర్]] . మొదటి ముగ్గురి రచనలు దేవరములుగా ఖ్యాతి పొందాయి. [[తిరుజ్ఞాన సంబంథర్]] చిదంబరం స్వామి పైన రెండు దేవరములు, [[తిరునావుక్కరసర్]] [[నటరాజ]] స్వామి పైన ఎనిమిది దేవరములు మరియు [[సుందరమూర్తి నయనార్]] [[నటరాజ]] స్వామి పైన ఒక్క దేవరము రచించి స్వరపరిచారు. [[మాణిక్కవసాగర్]] రెండు రచనలు చేశారు. మొదటిది చిదంబరంలో ఎక్కువగా పాడబడే [[తిరువాసకం]] (పవిత్ర వచనాలు) మరియు రెండవది పూర్తిగా చిదంబరంలోనే పాడబడే తిరుచిత్రాంబలక్కోవైయార్ (లేదా తిరుకోవైయార్). [[మాణిక్కవసాగర్]] చిదంబరంలోనే ఆధ్యాత్మిక ఆనందం, ముక్తి పొందారని చెప్పబడుతుంది.
 
== భౌగోళికం ==
పంక్తి 149:
[[en:Chidambaram]]
[[ta:சிதம்பரம் (நகரம்)]]
[[ml:ചിദംബരം]]
[[bpy:চিদাম্বরম]]
[[de:Chidambaram]]
"https://te.wikipedia.org/wiki/చిదంబరం" నుండి వెలికితీశారు