హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
1990 నాటికి హాంగ్ కాంగ్ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధిసాధించింది. అయినప్పటికీ 1998లో ఆషియన్ ఆర్ధిక మాంధ్యం ప్రభావం హాంగ్ కాంగ్ మీద కూడా ప్రభావం చూపింది.
తరువాత 2003 లో సార్స్ వ్యాధి ప్రభావం కూడా హాంగ్ కాంగ్ ఆర్ధికరంగం మీద దెబ్బతీసింది. తరువాత దేశీయ మరియు అంతర్జాతీయ అవసరాలు హాంగ్ కాంగ్ ఆర్ధికరంగాన్ని తిరిగి అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్ళింది. ఎగుమతుల రుసుము తగ్గింపు హాంగ్ కాంగ్ ను పోటీలో నిలబడేలా చేసి ఆర్ధికమాంధ్య కాలం ముగింపుకు వచ్చింది. చివరి కాలనీ రాజ్యం సమయంలో ఆరంభమైన ప్రభుత్వ జోక్యం కొంచెం కొంచెంగా పెరుగుతూ 1997 వరకూ కొనసాగింది. తరువాత ఆదాయ హామీ, నిర్భంధ పదవీవిరమణ భత్యం, పరిమిత కూలీలు, వివక్షకు వ్యతిరిక్త విధానాలు హాంగ్ కాంగ్ ఆర్ధికరంగ అభివృద్ధికి దోహదం చేసాయి.
 
 
ఈ ప్రదేశం స్వల్పంగా పంటభూములు మరియు కొన్ని సహజ సంపదలు కలిగి ఉంది. అందువలన హాంగ్ కాంగ్ అనేక ఆహారపదార్ధాలు దిగుమతి చేసుకుంటుంది. హాంగ్ కాంగ్ ఆర్ధికరంగానికి వ్యవసాయ కార్యక్రమాలు ప్రధానమైనవి కాదు. ఆహారం మరియు పూలతోటల అభివృద్ధి వంటి వ్యవసాయం హాంగ్ కాంగ్ జిడిపికి 0.1% మాత్రమే సాయం చేస్తుంది. హాంగ్ కాంగ్ అదాయం మరియు జిడిపి లను దేశీయ ఉత్పత్తులకంటే ఎగుమతి మరియు దిగుమతుల వలన లభించే ఆదాయం అధిగమిస్తుంది. అత్యధిక వాణిజ్య పరిమితి కలిగిన
దేశాఆలలో హాంగ్ కాంగ్ 11వ స్థానంలో ఉంది. అత్యధిక హాంగ్ కాంగ్ ఎగుమతులు రెండవ ఎగుమతి కొరకే హాంగ్ కాంగ్ కు చేరుతుంటాయి. ఈ ఉత్పత్తులు వెలుపలి నుండి హాంగ్ కాంగ్ కు చేరుకుంటాయి. ప్రధానంగా రిపబ్లిక్ చైనా ఉత్పత్తులు హాంగ్ కాంగ్ ద్వారా ఎగుమతి చేయబడతాయి. హాంగ్ కాంగ్ భౌగీళిక పరిస్తితులు రవాణా, మౌళికంగా నగరాభివృద్ధి వంటి విషయాలకు తోడ్పడుతూ హాంగ్ కాంగ్ ను అత్యంత రద్దీ అయిన కంటైనర్ పోర్ట్ మరియు రద్దీ అయిన వస్తు రవాణా చేస్తున్న విమానాశ్రయంగా చేసింది. సాంరాజ్యాధికారం మార్చబడడానికి ముందే హాంగ్ కాంగ్ రిపబ్లిక్ చైనాతో వ్యాపార పెట్టుబడి మరియు వాణిజ్య సంబంధాలను బలపరచింది. ఆర్ధిక మాంధ్యం కారణంగా క్షీణదశకు చేరుకున్న ఉద్యోగావకాశాలను 2007 చివరి నాటికి 3.46 మిలియన్ల పూర్తి సమయ ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ శాతాన్ని 4.1% కి తీసుకు వచ్చారు. హాంగ్ కాంగ్ ఆర్ధికరంగంలో 90% జిడిపి పెరుగుదలకు కారణం అయినది సేవారంగం, 9% జిడిపి అభివృద్ధికి పారిశ్రామిక రంగం సహకరిస్తుంది. 2007లో ద్రవ్యోల్బణం 2.5% నికి చేరుకుంది.
హాంగ్ కాంగ్ అత్యధిక ఎగుమతి దారులు రిపబ్లిక్ చైనా, జపాన్ మరియు అమెరికా దేశాలకు చెందినవారే.
 
బ్రిటన్ కామన్ లా ఆధారిత హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ కావడం మూలాన ప్రాంతీయ సివిల్ వ్యవహారాలలో రక్షకదళం జోక్యం నుండి తగిన రక్షణ కలిగిస్తుంది. హాంగ్ కాంగ్ ప్రభుత్వానికి ప్రజారక్షణ బాధ్యత ఉంది కనుక అది నిర్వహణ మరియు విపత్తు నివారణ వంటి విషాయాలకు రిపబ్లిక్ చైనా నుండి రక్షకదళ సహాయం తీసుకుంటుంది. రక్షకదళ నిర్వహణా వ్యయాన్ని హాంగ్ కాంగ్ ప్రభుత్వం భరిస్తుంది.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు