హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 174:
 
హాంగ్ కాంగ్‍లో తొమ్మిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లోని చాలా పురాతనమైన విశ్వవిద్యాలయం 1911 లో స్థాపించబడిన " యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ". అండర్ గ్రాజ్యుయేట్ చదువుల ప్రవేశానికి ఉన్న పోటీ విద్యార్ధులను భయాందోళనకు గురిచేస్తుంది. ఉన్నత విద్యలకు సంవత్సర విద్యార్ధుల ప్రవేశ స్థానాలు పరిమితంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. ప్రత్యేకంగా కొన్ని వృత్తి విద్యా స్థానాలు కొన్ని ప్రత్యేక ప్రదేశ విద్యాసంస్థలకు లభించడం ఒక సమస్య. కొన్ని విద్యలను కొన్ని ప్రత్యేక ప్రాంతంలో ఉన్న సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వైద్య విద్యను రెండు విద్యాసంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ " ది లికా షింగ్ ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ " విద్యను అందిస్తుంది. వైద్య విద్యను అందిస్తున్న రెండవ విద్యా సంస్థ " ది ఫేకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ది చైనీస్ య్జునివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ". హాంగ్ కాంగ్‍లో ప్రభుత్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేనివారికి అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నత డిప్లొమా మరియు సంబంధిత డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థలలో ప్రతిభ చూపిన వారిలో కొందరు ప్రభుత్వ విశవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని అందుకుంటున్నరు.
 
 
==ఆరోగ్య సంరక్షణ ==
హాంగ్ కాంగ్‍లో 50కి పైగా ప్రభుత్వ వైద్యశాలలు, 13 ప్రభుత్వేతర వైద్యశాలలు ఉన్నాయి. అత్యధికంగా ఆరోగ్యసంరక్షణ వసతులు లభ్యం కావడం వైద్యసేవలలో హాంగ్ కాంగ్‍ను
Line 181 ⟶ 183:
 
2011 నాటికి ప్రధాన చైనా భూమి నుండి తల్లులు హాంగ్ కాంగ్‍లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి పొందడంతో నగరంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్ వార్డులు గదులు అన్నీ నిండి పోతున్న కారణంగా నగరంలోని గర్భవతులకు ప్రసవకాలంలో ఆసుపత్రులలో అవసరమైన పడకలు మరియు రొటీన్ చెకప్పులు వంటి వైద్యపరమైన వసతులు లభించ లేదని ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. 2001-2010 మద్యకాలంలో వైద్యసిబ్బందికి పెరిగిన పనిభారం, వైద్యపరమైన పొరపాట్లు మరియు వైద్యపరమైన ఆపదలు ప్రధాన రిపబ్లిక్ చైనా వార్తా పత్రికలలో ప్రధాన వార్తలుగా వెలువడుతుంటాయి.
 
== నిర్మాణశైలి ==
గణాంకాలను అనుసరించి హాంగ్ కాంగ్‍లో షుమారు 1,223 ఆకాశసౌధాలు ఉన్నాయి. అవి హాంగ్ కాంగ్‍ను అంతర్జాతీయ శ్రేణికి చేర్చాయి. మిగిలిన లేనన్ని 500 అడుగులకంటే అధిక ఎత్తైన భవనాలు హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. ఎత్తైన ఆకాశసౌధాలు మరియు అధిక సంఖ్యలో ఉన్న భవన సముదాయం ఉన్న హంగ్ కాంగ్ నగరప్రాంతం హార్బర్ సమీపంలో విశాలమైన నివాసగృహాల కొరత అధికంగా ఉంది. నిటారుగా ఉండే కొండలు కలిగిన హాంగ్ కాంగ్ దీవి వైశాల్యం 1.3 చదరపు కిలోమీటర్ మాత్రమే ఉంది. నివాస అనుకూల ప్రాంతం కొరత కారణంగా నగరంలో జనసాంద్రత అధికంగా ఉంది. ఈ కారణంగా ఎత్తైన కార్యాలయ భవనాలు మరియు నివాస గృహసముదాయాలు కూడా ఆకాశసౌధాలుగా నిర్మించవలసిన అవసరం ఏర్పడింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన నివాస గృహాలు కలిగిన 100 ఆకాశభవనాలలో 36 హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. హాంగ్ కాంగ్ లోని అధికమైన ప్రజలు 14 అంతస్థుల కంటే ఎత్తులోనే నివసించడం మరియు పనిచేయడం వటివి చేస్తున్నారు. ఈ కారణంగా హాంగ్ కాంగ్ అత్యంత ఎత్తైన నగరంగా గుర్తింపు పొందింది.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు