ఇలియానా: కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేయబడ్డాయి
కొత్త విషయం చేర్చి "సినీ జీవితం" భాగాన్ని సవరించాను
పంక్తి 17:
 
==సినీ జీవితం==
===2006-2007 : సినిమాల్లోకి తెరంగేట్రం===
ఇలియానా [[వై.వి.యస్.చౌదరి]] దర్శకత్వము వహించిన ''[[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]'' చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు [[రామ్ (నటుడు)|రామ్]] సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.
అరుణ భిక్షు దగ్గర కొంతకాలం నటనలో శిక్షణ పొందిన తర్వాత 2006లో ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన ''[[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]'' చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో ఆమె [[రామ్ (నటుడు)|రామ్]] సరసన నటించింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[మహేష్ బాబు]] సరసన [[పోకిరి]] సినిమాలో నటించింది. ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ నటిగా అవతరించింది.
 
ఆపై 2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ్ సినిమాలోకి అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]] సరసన [[ఖతర్నాక్]] చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా పరాజయం పాలైనప్పటికీ ఇందులో ఇలియానా తన అందచందాలకు మంచి ప్రశంసలు అందుకుంది. కానీ [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]] సరసన నటించిన [[రాఖీ (2006 సినిమా)|రాఖీ]] మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో [[ప్రభాస్]] సరసన నటించిన [[మున్నా]] చిత్రాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి. ఈ విజయాలతో ఇలియానా తెలుగు సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది.
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఇలియానా" నుండి వెలికితీశారు